Skip to main content

లాండ్రీ, దోభీఘాట్లకు ఫ్రీ పవర్.. అంతకుమించి అడగొద్దు

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. లాండ్రీలకు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సినిమా పరిశ్రమకు ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించారు. 

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:

- ఎన్నికల ప్రణాళికలనేవి కేవలం కాగితాలకే పరిమితమైపోతున్న నేటి రాజకీయాల్లో 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తాను ప్రకటించిన పార్టీ ప్రణాళిక (మేనిఫెస్టోను వందకు వంద శాతం అమలు చేసిందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాదు... చెప్పని అంశాలను కూడా అనేకం ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచి అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి రాజకీయాల్లో ఇదో అరుదైన అంశం. మాకు తెలంగాణ ప్రజల పట్ల, హైదరాబాద్ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం. మేం చెప్పనవి, అమలు చేసిన పలు కార్యక్రమాలు. • నగర ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. దీనిపై మేం మేనిఫెస్టోలో చెప్పలేదు. చెప్పకపోయినా అమలు చేశాం. నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. రోజుకు లక్ష మంది ప్రజలు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. రూపాయికే నల్లాకనెక్షన్ పథకాన్ని కూడా అమలు చేశాం. వాస్తవానికి దీన్ని మనం గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎక్కడ ప్రకటించలేదు. ప్రకటించకపోయినా మేం అమలు చేశాం.

దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించాం. నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం, నగరాన్ని అద్భుతంగాతీర్చిదిద్దడమే లక్ష్యంగా మా ప్రణాళికలు సాగాయని కేబుల్ బ్రిడ్జి మీ కళ్ల ముందుకనపడుతున్నది. తీర్చిదిద్దడమే లక్ష్యంగా మా ప్రణాళికలు సాగాయని చెప్పడానికి కేబుల్ బ్రిడ్జి మీ కళ్ల ముందుకనపడుతున్నది. కేసీఆర్ కిట్ ను కూడా మేం ఎన్నికల హామీగా చెప్పలేదు. చెప్పకపోయినా పేదింటి ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పథకం ఇది. ప్రతీ రోజూ వేలాది మందికి ఉపయోగపడుతున్న మరో అద్భుత పథకం ఇది. • లింకు రోడ్లతో నగర ప్రయాణాన్ని సుళభతరం చేశాం. 11 చోట్ల లింక్ రోడ్లను పూర్తిచేశాం. ఇవే కాదు.. ఇంకా అనేకం ఉన్నాయి. నగర ప్రజల సౌకర్యం, భద్రతకు పెద్దపీఠ వేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. సమగ్ర జీహెచ్ఎంసీ చట్టం కాలానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ చట్టానికి ఇప్పటికే అనేక సవరణలు చేశాం. పాలనను మరింత సమర్ధంగా సాగించడానికి త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తాం. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించడంతోపాటు అధికారుల్లో బాధ్యతను పెంపొందించేలా నూతన చట్టం ఉంటుంది. ఇప్పటికే టీఎస్ ట్రైపాస్, నూతన రెవెన్యూ చట్టం వంటి పదునైన చట్టాలను తెచ్చాం. ఈ క్రమంలోనే నగర అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా కొత్త చట్టంలో నిబంధనలను పొందుపరుస్తాం.

జీహెచ్ఎంసీ ప్రజలకు తీపికబురు..

జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ మరో తీపికబురు అందిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 10లక్షల గృహవినియోగ నల్లా కనెక్షన్లున్నాయి. వీరందరూ తాగునీటి ఛార్జీలు భారంగా ఉన్నాయని భావిస్తున్నారు. డిసెంబరు నెల నుంచి నెలకు 20వేల లీటర్లలోపు నల్లా నీళ్లు వినియోగించే గృహవినియోగదారులు నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు. నెలకు 20వేల లీటర్ల వరకు ప్రభుత్వం ఉచితంగానే నీటి సరఫరా చేస్తుంది. దీని ద్వారా నీటి దుబారా తగ్గుతుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారిపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని జంటనగర ప్రజలు క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఉచిత నీటి పథకం మంచి చెడులను పరిశీలించి రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విస్తరించే అంశాన్ని కూడా పరిశీలిస్తాం.

సెలున్లకు ఉచితంగా విద్యుత్.. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు (సెలున్లు)కు ప్రభుత్వం డిసెంబరు మాసం నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది. నాయి బ్రాహ్మణులు చాలా కాలంగా కోరుతున్న ఈ కోరికను రాబోయే డిసెంబర్ నుంచి ప్రభుత్వం నెరవేర్చి నాయి బ్రాహ్మణుల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది. లాండ్రీలకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్.. జీహెచ్ఎంసీ పరిధిలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక సామాజిక ప్రజలందరూ తాము దోబీఘాట్ల వద్ద వాడుతున్న విద్యుత్ కు, లాండ్రీలకు వాడుతున్న విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. డిసెంబరు నుంచి జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని దోబీఘాట్లకు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం. ఇక జంటనగరాలలో ఇటీవల కురిసిన వర్షాలకు ద్వంసమైన దోబీఘాట్లను పునరుద్ధరించడంతోపాటు నగరంలో అవసరమైనచోట అధునాతనమైన దోబీఘాట్లను కూడా నిర్మించి ఇస్తాం. కరోనా కాలానికి సంబంధించి మోటారు వాహన పన్ను రద్దు కరోనా కాలంలో (మార్చి నుంచి సెప్టెంబర్ వరకు) లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్పర్ట్ వాహనాల నిర్వహకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,37,811 వాహనాలకు సంబంధించిన 287 కోట్ల మోటారు వాహన పన్నును రద్దు చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పధంతో స్వీకరిస్తున్నాం. వారిని ఆదుకోవాలని నిర్ణయించాం. మోటారు వాహనాలకు సంబంధించిన 287 కోట్లను (రెండు త్రైమాసికాలు) మాఫీ చేయాలని నిర్ణయించాం. పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు హెచ్డీ, ఎల్టీ కేటగిరిలకు కనీస డిమాండ్ ఛార్జీల మినహాయింపు

సినిమా పరిశ్రమకు బాసట... కరోనాతో కుదేలై ఆర్ధికంగా నష్ట పోయిన మరో రంగం సినిమా రంగం. మన హైదరాబాద్ నగరం సినిమా పరిశ్రమ, చిత్రనిర్మాణ రంగా నికి దేశంలోనే పెట్టింది పేరు. చితికి పోయిన చిత్ర పరిశ్రమను పునరుజ్జీవింపచే యడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జీహెచ్ఎం సీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థలతోపాటు ఉండే హెబీ, ఎల్టీ కేట 18 కనెక్షన్లకు సంబం థించి విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేస్తుంది. • రాష్ట్రంలో 10 కోట్లలోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయంబర్స్ మెంట్ ను సహాయంగా అందించి చిన్న సినీ పరిశ్రమలను ఆదుకుంటామని హామి ఇస్తున్నాం.

• రాష్ట్రంలోని అన్నిరకాల సినిమాధియేటర్లలో ప్రదర్శనలను (షోలు) పెంచుకునేందుకు అనుమతి ఇస్తాం. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటును కల్పిస్తాం.

. . సంక్షేమానికి పెద్దపీట కొనసాగిస్తాం

• అర్హులైన అందరికీ రేషన్ కార్డుల పంపిణీ- గతంలో రేషన్ పై పరిమితులు ఉండగా, ప్రస్తుతం ఎంతమంది కుటుంబ సభ్యులుంటే వారందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నాం. అర్హులందరికీ సామాజిక భద్రత పెన్షన్లు బస్తీల్లో ప్రభుత్వ మోడల్ స్కూల్స్ (ఇంగ్లీష్ మీడియం)ఏర్పాటు 'అన్నపురాసులు ఒకచోట.. ఆకలిమంటలు ఒకచోట' అన్నారు కాళోజి. పేదలు ఆకలితో అలమటించొద్దనే లక్ష్యంతో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే కడుపునిండా అన్నం పెడుతున్నాం. లాక్ డౌన్ సమయంలో ఇవి పేదలను ఉచితంగా ఆదుకున్నాయి. వీటిని మరింత విస్తరిస్తాం. కూర్చొని తినే విధంగా ఏర్పాట్లు చేస్తాం.

• నగరానికి వచ్చేవారి కోసం అన్ని వసతులతో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశాం. వీటిని మరింత విస్తరిస్తాం.

• యాచకులు లేని నగరంగా మారుస్తాం. సీనియర్ సిటిజన్ల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ- లైబ్రరీల ఏర్పాటు- ఇంటర్నెట్ సౌకర్యం. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్ లో లైబ్రరీ, సీనియర్ సిటిజన్స్ క్లబ్, యోగా సెంటర్, జిమ్ ఏర్పాటు చేస్తాం. ఉచితంగా బస్పాన్లు ఇస్తాం.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత