Skip to main content

పేరుకు తగినట్టుగానే ఆయన రారాజు-చిరంజీవి

తెలుగు చిత్రసీమలో మరో పాతతరపు ధ్రువతార నింగికేగింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కృష్ణంరాజు.. అటు రాజకీయాల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనే తహతహ ఆయనకు ఉన్నా.. అందుకు తగిన సహకారం దొరకలేదనే అసంతృప్తికి లోనైనట్టు చెబుతారు. ఏ పార్టీలో ఉన్నామన్నది కాకుండా.. ఏం చేశామన్నదే ఆయన ఫిలాసఫీగా ఉండేదని.. అయితే రాజకీయాల్లో ఉండే అనేక రకాల ఒత్తిళ్లు, పరిమితుల కారణంగా.. ఏ పార్టీలో కూడా కృష్ణంరాజు పూర్తిగా ఒదిగి ఉండలేకపోయారన్న అభిప్రాయాలున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రేక్షకులకు తన విలక్షణమైన నటనను అపురూపమైన జ్ఞాపకంగా అందించారు కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు పూర్తి పేరు.. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ నట విగ్రహంగా మాత్రమే తెలిసిన కృష్ణంరాజులో బహుముఖీనమైన అభిరుచులు, ఆకాంక్షలు ఉన్నాయి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అనేక పాత్రలను ఎంతో విజయవంతంగా పోషించినట్టు ఆయన సినీ ప్రస్థానం చెబుతుంది. తెలుగునేలపై స్వేచ్ఛా పోరాటాల సమయంలో తనదైన ముద్రవేసిన ఆంధ్రపత్రికకు కృష్ణంరాజు ఓ సాధారణ రిపోర్టర్ గా పనిచేశారు. డిగ్రీ తరువాత నటజీవితం వైపు ఆకర్షితులయ్యారు. 1966లో చిలకా గోరింక సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు.. 1970, 80వ దశకంలో రారాజుగా వెలుగొందారు. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి మహానటుల హవా కొనసాగుతున్న కాలంలో.. తనదైన గంభీర ముద్రతో, ప్రత్యేకమైన హావభావాలతో, పదాలు పలికించలేని ముఖకవళికలతో తెలుగు ప్రేక్షకులకు వెండితెర మీద కొత్తరుచులు చూపించారు. రెబల్ స్టార్ గా చిరస్థాయిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. 

స్ఫూరద్రూపి అయిన ఈ రెబల్ స్టార్.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఎంతో ప్రయత్నించారు. 1992లో నర్సాపురం లోక్‎సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1998లో కాకినాడ నుంచి బీజేపీ తరఫున గెలిచి ఓ ప్రజానాయకుడిగా రాణించారు. లక్షా 65 వేల ఓట్ల మెజారిటీ సాధించి వాజ్‎పేయి వంటి మహా నేతల దృష్టిని ఆకర్షించారు. అందుకే ఆయనకు విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి మంత్రిత్వ శాఖల్లో సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. అంతేకాదు.. అనేక పార్లమెంటరీ కమిటీల్లోనూ సభ్యత్వం కల్పించి ఆయన ఆలోచనలకు అవకాశం కల్పించారు. ఆనాటి బీజేపీ నేతల వ్యవహార శైలి కారణంగానే కృష్ణంరాజు కమలనాథులవైపు మొగ్గు చూపారంటారు. అయితే ఆ తరువాత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా ఏపీలో బీజేపీ పర్ఫామెన్స్ పెద్దగా లేనికారణంగా.. బీజేపీలో కొనసాగలేకపోయారు. ఆ కారణంగానే తనకు ఆప్తుడైన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరిపోయారని విశ్లేషకులు భావిస్తారు. అయితే ఆ పార్టీ కూడా ఓ చరిత్రగా మిగిలిపోవడంతో.. చాలాకాలం పాటు రాజకీయాల పట్ల మౌనముద్ర దాల్చారని సన్నిహితులు చెబుతుంటారు. ఆ తరువాత కమలనాథులు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తుండడంతో.. బీజేపీ మీద ఆశలు పెంచుకున్నారంటారు. 

ఏపీలో పార్టీ బలోపేతానికి కమలనాథులు తీసుకునే చర్యల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం, పలువురు సీనియర్ నటులను కూడా బీజేపీ నేతలు సంప్రదిస్తూం ఉండడం వంటి కారణాలతో కృష్ణంరాజులో ఆశలు మల్లీ చిగురించాయంటారు. ఈ క్రమంలోనే ఈ రెబల్ స్టార్.. గవర్నర్ పదవిని ఆశించారని, తన కోరికను బీజేపీ నేతలు తప్పక తీరుస్తారన్న అభిప్రాయంలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే తెలుగు ప్రజల అభిమాన నటుడు.. అనుకోకుండా అంతిమయాత్రకు సిద్ధమవడంతో ఆవేదన చెందుతున్నారు. 

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనోత్సవాల కోసం హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. అందుకోసం ఆయన 16వ తేదీనే హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి, కేంద్రంలో మంత్రిపదవి అలంకరించిన వ్యక్తిగా కృష్ణంరాజుకు బీజేపీ నేతలు పెద్దఎత్తున నివాళులు అర్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులను అమిత్ షా స్వయంగా కలిసి కృష్ణంరాజుకు నివాళులు అర్పిస్తారని, ఆయన కుటుంబానికి సంఘీభావం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే అమిత్ షా ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్నారని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీరని లోటు మిగిల్చిందన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్ షా కలిసే సమయంలో ఆయన నటవారసుడైన ప్రభాస్ కూడా అక్కడే ఉండేలా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో మరో నటుడు నిఖిల్‎తో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ తో షా భేటీ అయిన రోజునే నిఖిల్ కూడా కలవాల్సి ఉండగా.. అనుకోకుండా అది వాయిదా పడిందని చెబుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో 183 సినిమాలు చేసిన సుదీర్ఘమైన నట ప్రస్థానం కలిగిన కృష్ణంరాజు.. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతారు. భారతీయ సంప్రదాయాలన్నా, భారతీయ జీవన విధానమన్నా ఎక్కువగా ఇష్టపడే రెబల్ స్టార్.. రోజూ రెండుసార్లు యోగా చేసేవారని చెబుతారు. రెగ్యులర్ గా యోగా చేసేవారికి శరీరం లొంగిపోతుందని, 8 గంటల నిద్ర అనే బానిసత్వం నుంచి విముక్తి పొందుతుందని ఆయన నమ్మేవారు. నిత్య యోగా వల్ల 2 గంటల నిద్ర కూడా సరిపోతుందనేవారు. నిద్రను నియంత్రించడం ద్వారా ఎక్కువ గంటలు శ్రమించే అవకాశం శరీరానికి దొరుకుతుందని, అదే విజయానికి కారణమవుతుందని కృష్ణంరాజు నమ్మేవారు. సినిమాల్లో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆయన తెలుగు అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ ప్రయాణానికి సిద్ధమవడం తెలుగు లోకాన్ని విషాదంలో ముంచేసింది. 

Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో