Skip to main content

శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

చిత్రం ఏమంత దరిద్రంగా వుంది???

బానే తీశారు కదా....
నటన, కథ, నాట్యం, సంగీతం, సాహిత్యం అన్నీ బానే వున్నాయి కదా..
గొప్ప చిత్రం కాకపోయినా అసహ్యంగా అయితే లేదు కదా అనే అనుమానం మనకు రాక మానదు..

నిజమే సాంకేతికంగా అన్నీ బానే వున్న చిత్రమే....
అందునా నాని చిత్రం....సాయి పల్లవి లాంటి నాట్యం నటన అద్భుతంగా చేసే నటి వున్న చిత్రం అన్నీ సమపాళ్లలో వున్న చిత్రమే. కాకపోతే వొచ్చిన చిక్కల్లా అనసరంగా పెట్టిన రెండు విషయాలు. 

1. కమ్యూనిజం.
2. హిందూ ద్వేషం.

అనవసరంగా పెట్టారు అనేకన్నా కావాలనే పెట్టినట్టు అనిపించింది. అందుకే పొరబాటు అయితే పోనీలే అని వొదిలెయ్యొచ్చు కానీ కావాలని చేస్తే మాత్రం తగ్గేదెలే.. అందుకే ఈ విశ్లేషణ..

అసలు నేను దీనికి విశ్లేషణ రాయకూడదు అనుకున్నా. రాసినా రెండే రెండు ముక్కల్లో ముగించెయ్యాలి న్యాయంగా.  కానీ మరీ రెండు ముక్కల్లో అయితే సదరు దర్శకుని సంగతి అంచనా వెయ్యటం కష్టం కదా, అందుకే ఇలా...

మొట్ట మొదటగా కొన్ని విషయాలు చెప్పేసి తర్వాత చిత్రం గూర్చి చర్చించుకుందాం.

1. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉండి, అది ఎన్నికల్లో పాలుపంచుకోవడం.
2. అసలు ఏ మత సిద్ధాంతానికి తలవొగ్గని కమ్యునిస్టు మేధావులు కేవలం హిందూ ద్వేషాన్ని మాత్రమే తరతరాలుగా నూరిపోయటం.

ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపూ పై రెండు విషయాలు ఎప్పుడూ మనసులో అనుకుంటూ వుండాలి, లేకపోతే అనేకమంది బుర్ర తక్కువ సెక్యులర్ వాదుల్లా....అన్నీ సమానమే...అనుకుని ఆపై మనమే వెధవలం అని మనచేత చెప్పిస్తారు సదరు చెయ్యి తిరిగిన కమ్యునిస్టు భావజాలీకులు....

అందుకని ప్రతి క్షణం అప్రమత్తంగా వుండాలి....అరుంధతి చిత్రంలో షియాజి షిండే అన్నట్టు....మన చుట్టూ వుండే ప్రపంచంలో కమ్యునిస్టు సైతాన్ ఎప్పుడూ వుంటుంది...మనం మనో విజ్ఞాన నేత్రం తో చూడకపోతే మనతో పాటు మన తర్వాతి తరాలు కూడా మన సనాతన సంస్కృతి సంప్రదాయాలకు శాశ్వతంగా దూరం అయిపోతాం....

సరే ఇక సినిమా గూర్చి చెప్పుకుందాం..

వాసు/నాని ఒక పైకొస్తున్న దర్శకుడు. ఒక లఘు చిత్రం నిర్మించి పెద్ద నిర్మాత కి చూపించి పెద్ద సినిమా తియ్యాలి అని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన లఘు చిత్రంలో నటించే అమ్మాయి కోసం వెదుకులాడుతూ అంటే ఆడిషన్స్ చేస్తూ వుంటాడు. రిగ్గా అదే సమయంలో, కాళ్ళకి పారాణి పెట్టుకుని, చేతికి గోరింటాకు పెట్టుకుని, లంగా వోణితో.... ఆఆ..... ఆగాగెహే... అలా అయితే మళ్ళా మన సంస్కృతి సంప్రదాయాలు హైలెట్ అయిపోవూ...మార్చు సీన్ మార్చు...

సారీ బ్రో....ఇప్పుడు చూడు.....

జుట్టు విరబోసుకుని.., బొట్టు లేకుండా....
స్కిన్ టైట్ జీన్స్ ప్యాంటు షర్టులతో....
చేతిలో ప్రపంచలోనే అత్యంత సువాసనలు వొదిలే సుమధుర సిగరెట్టుతో.. పుట్టుకతోనే  పొగతాగే విద్యనభ్యసించిన చందాన అలవోకగా సిగరెట్టు తాగుతూ హీరోయిన్ కృతి శెట్టి, నాని కంట పడుతుంది. అప్పుడు నానీ పదహారు కళలకు కాణాచి అని ఆ అమ్మాయిని పొగిడే తీరు భలే బాగుంటుంది. సరే ఇక ఆమె వెకన పడి ఎలాగోలా ఆమెని ఒప్పించి తన లఘు చిత్రం మొదలు పెడతాడు. అలాగే మొత్తానికి కష్టపడి లఘు చిత్రం పూర్తి చేస్తాడు. మధ్యలో ఒక చోట ...కృతి శెట్టి ని అల్లరి చేసిన వాళ్ళని చితక్కొట్టే పోరాట సీన్లో నాని చెవిలో నుంచి రంగు.. అదే రక్తం పడుతుంది.

సరే ఆతర్వాత లఘు చిత్రం ఒక నిర్మాతకి చూపించి, పెద్ద చిత్రం ఆఫర్ కొట్టేస్తాడు....ఒక నెలలో కథ సిద్ధం చేసుకొని రమ్మని అంటాడు...అలాగే నానీ కథ రాసుకుంటాడు...అలా రాసుకునే ప్రయత్నం లో  క్లైమాక్స్ రాసేప్పుడు మళ్ళీ నాని చెవిలో రంగు పడుతుంది. ఏదీ ఏమైనా కథ పూర్తి చేసి నిర్మాతకి చూపిస్తే కథ ఓకే చేస్తాడు. రోజు ఆనందంలో మందు పార్టీ పెట్టుకుంటారు. అప్పుడు కృతి శెట్టి కూడా వస్తుంది.... అలా చివర్లో నానీ ,కృతి శెట్టి మాంఛి రసపట్టులో వున్నప్పుడు...నానీ రోజీ అని కలవరిస్తాడు.....అప్పుడు పాపం మన హీరోయిన్ హార్ట్ హర్ట్ అయ్యి... బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది...

నానీకి మళ్ళీ చెవిలో రంగు పడుతుంది. నాని సినిమా తీస్తాడు...సూపర్ హిట్ అవుతుంది.  హిందీలో  కూడా రీమేక్ చెయ్యటానికి రంగం సిద్ధం అవుతుంది. అదే సమయంలో దేశంలోనే అతి పెద్ద పబ్లిషింగ్ సంస్థ అయిన ఎస్ ఆర్ పబ్లిషర్స్ వాళ్ళు నానీ మీద కాపీ రైట్ కేసు వేస్తారు. విచిత్రంగా అదేదో పెద్ద తీవ్రవాది నో, లేక డజను మర్డర్లు, అరడజను మాన భంగాలు చేసి తప్పించుకు తిరిగే వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు ఒక కాపీ రైట్ కేసు లో నాని ని అరెస్టు చేసి జైల్లో పడేస్తారు.

పాపం మన హీరోపై ప్రేమ ఇంకా చావని హీరోయిన్ మళ్ళా తిరిగి వచ్చి తన బంధువు అయిన ఒక లాయర్ని నాని కేసు వాదించటానికి ఒప్పిస్తుంది. అసలు కేసు ఏంటి అంటే చాన్నాళ్ల క్రితం శ్యామ్ సింగ్ రాయ్ అనే ఒక వ్యక్తి రాసిన కథల్ని నాని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేశాడు అని. కథల్లో పేర్లతో సహా. కానీ నాని అవి తన సొంత కథలు అని, ససేమిరా కాపీ కొట్టలేదు అని వాదిస్తాడు....లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేయించు కుంటాడు.. ఏంటి ఇంతోటి కాపీ రైట్ కేసు లో లై డిటెక్టర్ టెస్ట్ ఏంటి అని మనం ఆశ్చర్య పోవాలి తప్ప చేసేదేమీ లేదు. సరే ఇక అటుతిప్పి ఇటుతిప్పి నానిని హిప్నాటైజ్ చేసి అసలు విషయం తెలుసుకుంటారు.

అసలు విషయమేమటంటే 1960 దశకంలో బెంగాల్ లో వున్న శ్యామ్ సింగ్ రాయ్ నే పునర్జన్మ గా ఇప్పటి నానీ గా వచ్చాడు అని. ఇక ఫ్లాష్ బాక్.... మనోడు ఒక రచయిత... తన రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేసి నక్సలైట్ ఉద్యమం వైపు, లేదా కమ్యునిస్టు సిద్ధాంతాల వైపు మరలిస్తు వుంటాడు... ఒక నాస్తికుడు. ఎడమ చేతి వాటం... అంటే లెఫ్ట్ భాజాలం అని సింబాలిక్ గా చెప్పాడు అన్నమాట.

విచిత్రంగా అదే చేత్తో సిగరెట్టు కూడా తాగుతాడు.. అంటే సింబాలిక్ గా లెఫ్ట్ భావజాలం పట్టుకుంటే కేన్సర్ వచ్చి పోతారు అన్నట్టు అనుకుంటా. సరే అలా ఊళ్ళో వాళ్ళతో గొడవలు పడుతూ వుంటాడు.

ఇక్కడే ఒక రెండు భయంకరమైన అపరాధాలు చేశారు. 

మొదటి అపరాధం: 
అంటరానివాళ్ళు అని కొంతమందిని ఊరి బావిలో నీళ్ళు తీసుకోకుండా చేస్తూ వుంటే హీరో అడ్డుకుని ఆ అంటరానివాడిని అదే బావిలో పడేస్తాడు. అవును నిజమే.. మీరు విన్నది నిజమే. ఒక మనిషినే బావిలో పడేస్తాడు ....పోని పడేస్తే పడేశాడు.... వాడి పైత్యం, పడేయించుకున్నవాడి భాగ్యం అని వదిలేద్దాం, కానీ అక్కడే ఒక డైలాగ్ ఋగ్వేదం గురించి వుంటుంది.. అది విన్నంత మాత్రాన నాకు, ఆ డైలాగ్ రాసినవాడిని, తీసినవాడిని, పదేళ్ల క్రితం నేను వాడి పక్కన పడేసిన ఎడమ కాలి చెప్పు వెతుక్కొచ్చి మరీ తెగేదాకా కొట్టాలి అనిపించింది. సరేలే శుక్లాంబరధరం శ్లోకమే పలకలేని పరమ శుంఠలకి , వేదం చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు ఎలా అర్థం అవుతాయి. వర్ణాశ్రమ ధర్మాలకి, కుల వ్యవస్థకు వున్న తేడా ఎలా అర్థం అవుతుంది. కాకపోతే అక్కడ డైలాగ్ పాజిటివ్ గా పెట్టే అవకాశం నూటికి నూరు శాతం వున్నా పెట్టకపోవడం అనేది కావాలనే హిందూ సమాజం పై ద్వేషాన్ని నూరిపోసేదిగా వుంది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా నిజమే మన వేదాలు అంతా దరిద్రం అనే అబద్ధాన్ని మనచేత నే అనిపిస్తారు. అంత కాకపోయినా అత్యంత తీవ్రంగా మనసులో ముద్ర వేసి వదులుతారు....అది ఒక టైం బాంబులా, ఒక స్లో పాయిజన్ లా మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తుంది.

నిజంగా వేదం ఏం చెప్పింది అనేది పరిశీలన చేసేంత ఓపిక, తీరిక, కోరిక, సహనం 99 శాతం మందికి వుండదు....అదే అలాంటి నికృష్టుల కు కలిసి వచ్చే అంశం. జాగ్రత్తగా వుండక అలాంటి జాంబీ ల కొరుకుడు కు గురైతే మనం కూడా మరో జాంబి లా మారిపోవటం ఖాయం. సరే అలా సాగిపోయే కథలో నవరాత్రులు వస్తాయి. ఒక గుళ్ళో సాయిపల్లవి అలియాస్ రోజీ నీ మన రాయ్ చూస్తాడు....ఆమె ఒక దేవదాసి. అక్కడ 25 మంది దేవదాసీలు వుంటారు...నవరాత్రుల ప్రతి రోజు ఒక నృత్య ప్రదర్శన...ఆ తర్వాత ఆ గుడికి చెందిన పూజారి అనాలో ధర్మ కర్త అనాలో , ఎవడో ఒక బ్రాహ్మణుడు ప్రతి రోజూ ఒక ఆమెను తన పక్కలోకి తీసుకెళ్తూ వుంటాడు..

మన రాయ్ మొత్తానికి కష్టపడి రోజీ ని పడేస్తాడు. ఆ నవరాత్రుల్లో ఒకానొక రోజు ఆ ఆలయ అధికారి, రోజీ ని రమ్మంటాడు... అప్పుడు మన రాయ్ రెచ్చిపోతాడు.. వాడి మార్మాంగం ఫసక్ చేస్తాడు... దెబ్బకి రోజీ ని పెళ్ళిచేసుకుని వేరే ఊరు వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ప్రెస్ లో పని చేస్తూ తన కమ్యునిస్టు పైత్యాన్ని సాహిత్య రూపంలో ప్రచురిస్తూ పెద్ద రచయితగా ఎదిగి బాగా సంపాదిస్తాడు. అదేంటి కమ్యూనిస్టు అంటే డబ్బులు సంపాదించటానికి వ్యతిరేకం కదా అనుకునేరు. అదంతా జానాల కోసమే తప్ప వాళ్ళ కోసం కాదు. మొత్తానికి బాగా డబ్బు వచ్చిన తర్వాత రాయ్ రోజీ మాట్లాడుకుంటారు ఇక్కడే మరో పెద్ద అపరాధం చేశారు.

రెండో అపరాధం:
వచ్చిన డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటూ రోజీ ఒక అద్భుతమైన లాజిక్ చెపుతుంది.  ఒక్క గుడిలోనే 25 మంది దేవదాసీలు వుంటే దేశం మొత్తంలో ఉన్న వేల గుళ్ళల్లో ఎన్ని వేల మంది దేవదాసీలు మగ్గిపోతున్నారో వారందరినీ కాపాడి పునరావాసం కల్పించాలి అని ఒక ట్రస్టు పెడదాం అంటుంది.

చూడడానికి చాలా మామూలుగా అనిపిస్తుంది కదా.... బహుశా నిజమే అనిపించవచ్చు కూడా... చాలా మంచి ఆలోచన చేశారు అనిపించొచ్చు కూడా... ఇక్కడే కొన్ని విషయాలు చెపుతాను జాగ్రత్తగా వినండి.

1. దేశం మొత్తంలో దేవదాసి వ్యవస్థ వున్న దేవాలయాలు ఎన్ని?
2. ప్రముఖ అంటే, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, తిరుపతి, లాంటి సనాతన దేవాలయాల్లో దేవదాసి వ్యవస్థ వున్నట్టు ఎక్కడైనా ఆధారాలు వున్నాయా?
3. అసలు దేవదాసి వ్యవస్థ అనేది స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీషు వాళ్ళే రద్దు చేశారు అని గొప్పలు పోతారు కదా ఇప్పటికీ ఇక్కడే వుంటూ బ్రిటీషు వాడి చంక నాకే సన్నాసులు కొందరు మరి దాని మాటేమిటి?
4. అసలు ఇలాంటి డైలాగ్ ద్వారా దేవాలయాలు అన్నీ సాని కొంపలు అని డైరెక్ట్ గా అన్నట్టు కాదా...?

ఇవి జస్ట్ పైపైన ఆలోచన చేస్తే వచ్చిన ప్రశ్నలు మాత్రమే. లోతుగా ఆలోచన చేస్తే... దేవదాసి వ్యవస్థ అనేది ఎక్కడో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అతి కొన్ని గుడులకు పరిమిత మైన ఒక ఆచారం, అదేదో మొత్తం దేశమంతా వున్నట్టు బ్రిటీషువాడు చేసిన ఒక ప్రచారం, దాని వల్ల మన దేవాలయాలు అంటే మనకే అసహ్యం కలగాలి తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు కోల్పోయి జాతి మొత్తం బలహీనం అవ్వాలి ...అది అసలు సంగతి...ఎందుకు అంటే దేవాలయాలే అప్పట్లో జాతిని జాగృతం చేసి స్వాతంత్ర స్ఫూర్తిని రగిల్చిన కేంద్రాలుగా వుండేవి.

విచిత్రంగా ఇప్పటికీ అది అర్థం చేసుకోలేని కొన్ని సంకర జాతి మెదళ్లు అర్థ జ్ఞానం తో చేసే ఇలాంటి పనుల వల్ల సాధారణ జనాలు ఇప్పటికీ గజి బిజీ అవుతున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి అనేది...ఇలాంటి నీచులు చెపితే వినే స్థితిలో మనం ఉండకూడదు అంటే...సరైన మందు. చాగంటి వారు, సామవేదం వారు, గరికపాటి వారు, శ్రీ భాష్యం వారు లాంటి మహానుభావులు చెప్పిన ప్రవచనాలు.

అవి వినండి..

ఏదైనా సమాజంలో మూఢాచారాలు...అన్యాయాలు అనేవి సర్వ సాధారణంగా వుంటాయి ..దానికి కారణం ఏంటి అనేది సరైన పద్ధతిలో విచారణ చేసి నివారణ మార్గాలు చూడాలి కానీ ఇలా ఏక మొత్తంలో ఒక అన్నింటికీ హిందుత్వమే కారణం, అసలు హిందూ మతమే దరిద్రం అనే పిల్లి బిత్తిరి కబుర్లు చెప్పే వాళ్ళ పళ్లు రాలగొట్టేలా మన సమాధానం ఇంకా మన చర్యలు వుండాలి....

మన సంస్కృతిని సాంప్రదాయాలను ఇలాంటి అబద్ధ ప్రచారాల నుండి మనమే కాపాడుకోవాలి....లేకపోతే ఇలాంటి సన్నాసులు రోజుకొకడు వచ్చి, మన గ్రంధాల గురించి వాడికి తెలిసిన ప్రవచనాలు చేస్తాడు. సినిమా పరంగా మరీ అంత చెత్త కాకపోయినా సినిమా తీసిన విధానంలో చెప్పిన విషయాల్లో చాలా స్పష్టంగా తప్పుడు అభిప్రాయం కనపడుతుంది. అందుకని ఇలాంటి సినిమా సనాతన వాదులు, జాతీయ వాదులు ఖచ్చితంగా ఖండిచాలి....

సెక్యులర్ వాదుల్లారా బహుశా మీకు నచొచ్చు ఏమో....కానీ ఇలాంటి సినిమాని ఇష్ట పడితే మీ బొచ్చుకు మీరే నిప్పెట్టుకున్నట్టు....ఆపైన మీ ఇష్టం. ఇకపోతే అలా సాగిపోతున్న వాళ్ళని వాళ్ళ అన్నలే అంటే. రాయ్ పెద్దన్న, రెండో అన్న కలిపి హత్య చేస్తారు.. అంటే పరువు హత్య అన్నమాట. మూడో అన్న మంచోడే, అలా ముగిసిన రాయ్ చరిత్ర పునర్జన్మ లో వాసు గా మరలా మొదలవుతుంది.

మరి కమ్యూనిస్టు అంటే పునర్జన్మ నమ్మ కూడదు కదా అని అడిగేరు... అలా ఏం ఉండదు.. వాళ్ళకి నచ్చితే ఏదైనా నమ్ముతారు లేదంటే వాళ్ళ సొంత సిద్ధాంతాలు సైతం గాలికొదిలేసి పోతారు.. ఎంతకైనా సమర్థులు....అందుకే నేను మొదట చెప్పిన రెండు విషయాలు ఎప్పుడూ మదిలో మెదులుతూ ఉండాలి అన్నది. అలా అప్పట్లో మిగిలి వున్న మూడో అన్న ప్రస్తుత వాసు యొక్క లఘు చిత్రం చూసి, అది తనకి మాత్రమే తెలిసిన కథ అని అర్థం చేసుకుని వాసునే అప్పటి రాయ్ నే ఇప్పటి వాసూనే అని కేసు వాపసు తీసుకోవటం , అప్పటికి ఇంకా బతికే వున్న రోజీ దగ్గరికి వాసు వెళ్లి కలవటం, వాసు ఒడిలో రోజీ కళ్ళు మూయటం తో కథ పూర్తవుతుంది.

మొత్తానికి ఒక సాధారణ కథ, సాధారణ సినిమా...

కానీ చేసిన అపరాధాలు మాత్రం సమాన్యమైనవి కావు. ఇలాంటి సినిమాలు మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని, వచ్చినా అట్టర్ ఫ్లాప్ అయ్యేలా హిందూ సభ్య సమాజం మేలుకుంటుంది అని ఆశిస్తున్నాను.

గమనిక:
ఇది కేవలం నా దృష్టి కోణం మాత్రమే. కేవలం నా వాక్ స్వాతంత్రం అనుసరించి నేను వ్యక్త పరచిన భావాలు మాత్రమే. 

- శైలేష్

Comments

Popular posts from this blog

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో