Skip to main content

తెలంగాణలో మరాఠీ సినిమా - ఓ శుభారంభం


మూస కథలు, పసలేని కథనాలు, మూడు పాటలు, ఆరు ఫైట్లు అనే ట్రెండు నుంచి తెలుగు ఇండస్ట్రీ కాస్త దారి మళ్లినట్టు కనిపిస్తున్నా.. నూతన పోకడలు, లో-బడ్జెట్ లోనే సృజనాత్మకమైన ప్రయోగాలు అనే కేటగిరీస్ లో మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. తిమింగలాల వంటి బడాబాబులు ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలతో కూడిన లో-బడ్జెట్ సినిమాలకు ఇంకా సమయం రాలేదన్న నిరాశ అంతటా ఆవరించిన ఉన్న సమయంలో నూతన తరానికి మలయసమీరం లాంటి ఓ శుభవార్త వినిపిస్తోంది. 


తొలితరం తెలంగాణ పోరాటయోధుడు కేశవరావు జాదవ్ మనవడు అయిన సత్యనారాయణరావు జాదవ్ రచయితగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తెలంగాణ గడ్డ మీద మరాఠీ సినిమా పూర్తి చేశారు. పతీమజాకరామతీ (నా మొగుడు చిలిపికృష్ణుడు అని  తెలుగులో సమానార్థం) విడుదలకు సిద్ధమైన క్రమంలోనే లాక్ డౌన్ రావడం వేరే విషయం. అయితే 2, 3 నెలల్లో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా హాల్స్ తెరిస్తే దీపావళి కానుకగా పతీమజాకరామతితో పాటు శెగావచరాజా అనే మరో సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు సత్యనారాయణరావు జాదవ్ చెప్పారు. ఒకవేళ లాక్ డౌన్ తెరవడం కుదరకపోతే ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్  ఫామ్ లో ఉన్న దాదాపు 160 చానల్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జాదవ్ ఎంతో ధీమాగా చెప్పడం విశేషం. తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు, మరాఠీ నటులతో రూపొందించిన మొదటి సినిమా ఇదే అవుతుందని అందువల్ల మరాఠీ ఇండస్ట్రీ నుంచి తనకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని జాదవ్ చెప్పారు. అయితే తమ వంశీకులు ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ లోని మరాఠీ ప్రాంతంవారని అందువల్ల తాతలు, తండ్రులు, కుటుంబ సభ్యులంతా మరాఠీ సంస్కృతిని పాటిస్తారని, తన మాతృభూమి హైదరాబాద్ అవడం వల్ల ఉర్దూ బాగా ఒంటపట్టిందని జాదవ్ చెబుతారు. తాత కేశవరావు జాదవ్ కు తెలంగాణ ఉద్యమంతో విడదీయలేని అనుబంధం ఉందని, తనకు సినిమాల మీద ఉన్న శ్రద్ధ కారణంగా తాను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానని జాదవ్ చెబుతారు. మరాఠీ సినిమాలో బోనాల పాట


పతీమజాకరామతి సినిమాలో మానవవిలువలు, కుటుంబ విలువలు, సమాజ విలువల గురించి చెప్పామని.. విలువలు అనగానే బోరింగ్ సబ్జెక్టు అనే అభిప్రాయానికి కొందరు త్వరగా వస్తారని.. కానీ తాము మంచి ట్రీట్ మెంట్ తో, కామెడీ టచ్ ఇచ్చి యువతరాన్ని  దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. కుటుంబంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో కాలేజీల్లో గురుశిష్యుల మధ్య కూడా అలాంటి రిలేషన్సే  ఉండాలని చూపించడానికి ఈ సినిమాలో ప్రయత్నించామన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల్లాగా విద్యా నిలయాల్లో గురశిష్యులు ఉంటారని, అందువల్ల విద్యార్థులంతా అక్క-చెల్లెళ్లు, అన్నదమ్ములు, సోదరీసోదరులే అవుతారు తప్ప మరే రకమైన రిలేషన్స్ కు తావు లేదన్న మెస్సేజ్ ఇచ్చామని, ఇది ప్రస్తుత సమాజానికి  చాలా అవసరమైన సబ్జెక్టు అని జాదవ్ అన్నారు. అయితే క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేయడం కోసం ర్యాగింగ్ భూతాన్ని కూడా చూపించామని, దాన్ని నివారించేందుకు ఎలాంటి ఫైట్స్ లేకుండా కేవలం ఒక్కచెంపదెబ్బతోనే విలన్స్ మారిపోయే సీన్ ను అతి రమ్యంగా, సృజనాత్మకంగా తెరకెక్కించామన్నారు. అలాగే ఇందులో 5 పాటలు పెట్టామని, అందులో 2 పాటలు లవ్ సాంగ్స్ అని, బోనాల జాతర నేపథ్యంలో సాగే ఓ ఫోక్ సాంగ్ కూడా పెట్టామని, ఆ విధంగా మరాఠీ సినిమాలో తెలంగాణ బోనాల ప్రాశస్త్యాన్ని చూపించి రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక పరిపుష్టికి పెద్దపీట వేశామన్నారు. ఆ పాటను వరంగల్ లో చిత్రీకరించినట్లు చెప్పారు.అలాగే ఈ సినిమా చూస్తే ప్రేమోన్మాదం గానీ, లవ్ పేరుతో నేరాలు గానీ తగ్గే అవకాశం ఉంటుందని, ప్రేమజంటలు నేరస్తులుగా మారకుండా ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రేమించడం నేరం కాకపోయినా.. పెద్దల్ని ఒప్పించుకొని తమ లవ్ ని అరేంజ్డ్ మ్యారేజ్ గా చేసుకోవాలని సూచించామన్నారు. దీనివల్ల ఎవరూ పారిపోయే అవకాశం ఉండదని, ఆత్మహత్యలకు ఆగిపోతాయని, యువతరం ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయన్నారు. 


 


విడుదలకు ముందే అవార్డులు


పతీమజాకరామతి సినిమా విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ సంపాదించిందని జాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి తొలి మరాఠీ మూవీ తమ బ్యానర్ మీద రావడంతో మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రోత్సాహం లభించిందన్నారు. కథకు, కథనానికి, రెండు రాష్ట్రాల మధ్య భావ వారధిగా నిలిచినందుకు, రేపటిరోజుల్లో ఔత్సాహికులు ఎక్కడినుంచైనా సినిమా తీసుకునేలాగా ఆదర్శంగా నిలిచినందుకు అఖిల భారత చిత్రపట్ మహా మండల్ వారు కళాసమృద్ధి అవార్డుతో సత్కరించారన్నారు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఈ సినిమా స్క్రిప్టును పంపిస్తే జ్యూరీ సభ్యులు దీనికి 37 నేషనల్ అవార్డ్స్ అందజేశారన్నారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్, కొల్హాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక ఫెస్టివల్స్ కు ఈ స్క్రిప్టును పంపి పోటీలో పెట్టామని, అలా విడుదలకు ముందే అవార్డులు వరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  


ఈ సినిమాకు తనకు బెస్ట్ డైరెక్టర్ గా, తనతో పాటు సిద్ధేశ్వర్ పవార్ కు కలిపి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా అవార్డు వరించిందన్నారు. అలాగే ఈ సినిమాకు బెస్ట్ మూవీ అవార్డు, సామాజిక హితకరమైన థీమ్ ఎంచుకున్నందుకు తనకు ప్రత్యేకంగా బెస్ట్ థింకర్ అవార్డు వచ్చిందన్నారు. 


వరంగల్ లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటో


విడుదలకు ముందే బుక్కయిన 16 వేల టికెట్లు


సినిమాలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేసి గురుశిష్యుల సంబంధం అనే ఇతివృత్తం ద్వారా గొప్ప విలువలను ప్రోత్సహించినందుకు భవసార్ క్షత్రియ సమాజ్ వారు 16 వేల టికెట్లు ముందుగానే బుక్ చేసి ప్రోత్సహించారని ఆనందం వ్యక్తం చేశారు. వారి ప్రోత్సాహం తనను ఎంతో వెన్ను తట్టిందని, ఇంకా ఇలాంటి సినిమాలను తెలంగాణ, ఆంధ్రాల్లో తీసుకువచ్చి ఒక కొత్త ఒరవడిని పరిచయం చేయాలని ఉందని జాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు కూడా తమ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. టెంపర్, బలుపు వంటి హిట్ పిక్చర్స్ కి గాత్రదానం చేసిన వినాయక్ సతీశ్... ఈ సినిమాలో కూడా పాటలు పాడారన్నారు జాదవ్. 


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల