Skip to main content

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది. 

కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది.

సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు. అతను ప్రజల కోసం పోరాడే ఒక సామాజిక కార్యకర్త, కవి.

అనుకోకుండా దసరా నవరాత్రి ఉత్సవాల్లో గుడిలో డాన్స్ చేస్తున్న హీరోయిన్ను చూస్తాడు. ఎప్పుడూ గుడికి వెళ్ళని హీరో... ప్రతిరోజూ ఉత్సవాలకు వెళ్తూ, హీరోయిన్ ను ప్రేమిస్తాడు.

హీరోయిన్ ఒక దేవదాసి (దేవుడికి ఇస్తామని చెప్పి బాలికలను దేవుడి బార్య పేరుతో గుడులలో ఉంచుతారు. జీవితం మొత్తం వారిని పూజారులు వాడుకుంటూ ఉంటారు). రోజు రాత్రి గుడి మహంత (పెద్ద పూజారి) ఒక అమ్మాయితో గడుపుతాడు. సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంటుంది. హీరో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుని కలకత్తా తీసుకెళ్ళి అక్కడ తన రచనలను కొనసాగిస్తాడు. ఈ సినిమాలో  హీరో 1970 లలో హత్య కావించబడటాడు..హీరోయిన్ 80 సంవత్సరాల వయస్సులో,అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

*****

హీరో: "నేను ప్రపంచం గురించి రాస్తూ ఉంటాను"

హీరోయిన్: "మరి నాగురించి ఎప్పుడు రాస్తావు?"


"నేను వెళ్తాను

నేను రాస్తాను"

లాంటి డైలాగ్ లు బాగున్నాయి.


నీ విలువ నీకు తెలియదు, నాతో రా! అని హీరో అంటే, "అర్ద మూట బియ్యం కోసం మా అమ్మ నన్ను  చిన్నప్పుడే అమ్మేసింది. అది నా విలువ" అంటుంది.


"మా మీద హక్కు ఆ దేవుడికి కూడా లేదు",

"ఆ నీరు దళితులు తాగితే అంటారానిడైతే, మరి వారు పీల్చిన గాలి మీరెందుకు పీలుస్తున్నారు",

"నీ వల్ల మా పరువంతా పోయింది, నిన్ను చంపితే కాస్తయినా మా పరువూ నిలబడుతుంది"

అమ్మాయి తలను, కళ్ళను,పెదవులను, జుట్టును వర్ణిస్తూ కవిత్వం చెప్పే సీన్ బాగుంటుంది.


"మైత్రేయి! ఇన్ని ముళ్ళ మద్య కూడా నువ్వు  వికసిస్తున్నావు, నీ పేరు ఇప్పటి నుండి రోసీ(Rosy)"

లాంటి డైలాగ్ లు బాగున్నాయి. "అమావాస్య రోజు, నీ ఒడిలో నేను చచ్చిపోతే నాకు గౌరవం" అని వయస్సులో అన్న హీరోయిన్    పునర్జన్మ ఎత్తిన ప్రీయున్ని  తన వృద్దాప్యంలో  అతని వొడిలో చనిపోవడం తో కథ ముగుస్తుంది.

చాలా అద్భుతమైన సినిమా....

ఫోటోగ్రఫీ ,డైలాగ్ లు సూపర్...

కానీ పునర్జన్మ అనే కాన్సెప్ట్ బాగాలేదు. సందేశం బాగా లేదు, హీరోయిన్ తన హావభావాలను పలికించడానికి కూడా నాట్యాన్ని చూపారు. కవిగా,సంస్కర్త గా, సోషల్ ఆక్టివిస్ట్ గా హీరో నాని అద్భుతంగా నటించాడు. డైరెక్షన్ బాగుంది. పునర్జన్మ కాన్సెప్ట్ తప్ప, మిగిలిన సినిమా మొత్తం సూపర్. శ్యామ్ సింఘారాయ్ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చూసాను అనే ఫీలింగ్ కలిగింది.

- చీపాటి రాజేశ్వరరావు

Also Read: శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

Comments

Popular posts from this blog

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.