Skip to main content

ఆలయం అంటే ఏమిటో ఎందరికి తెలుసు?

 


దేవుణ్ని నమ్మేవాళ్లు అందరూ ప్రతిరోజూ కాకపోయినా సందర్భానుసారమైనా ఆలయ దర్శనం, దైవ దర్శనం చేసుకుంటారు. అయితే గర్భగుడి అనే మాట గురించి అందరికీ తెలిసిదే. అసలు గర్భగుడి అంటే ఏమిటనేది చాలా మందికి తెలియదు. గర్భగుడి అనగానే విగ్రహాన్ని రక్షిస్తూ నాలుగు వైపులా గోడలు ఉండడం.. పైనేమో ఊర్వం.. అంటే విమానం గుర్తుకు వస్తుంది. విగ్రహ రూపంలో భగవంతుడు నెలకొని ఉన్న చోటే గర్భగుడి అని కొందరు.. గుడి గర్భం.. అంటే మధ్యభాగంలో భగవంతుడుంటాడు కాబట్టి గర్భగుడి అని మరికొందరు భావిస్తారు. అయితే ఆ గుడిగర్భంలో లేదా.. గర్భగుడిలో ఏముంటుంది? ఈ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందనేది చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు తెలుసుకుందాం. 


 


ఆగమ,శిల్పశాస్త్రాల్లో గర్భగుడిని.. ప్రాసాదం, సందనం,ధామం, నికేతనం, మందిరం, సౌధం, ఆలయం, నీలయం, ఆయతనం అనే పేర్లతో పిలుస్తారు. అవే గాక దాదాపు ఇంకా ముప్పైకి పైగా పేర్లున్నాయి. అదొక విశేషం. అయితే ప్రాచీనకాలంలో ఆలయాన్ని నిర్మించే ముందు ఆ ప్రదేశంలో గర్పన్యాసం అనే ప్రక్రియ నిర్వహించేవారు. ఒక రాగి కలశం తీసుకొని అందులో నవరత్నాలనూ, పంచలోహాలనూ, ఇంకా కొన్ని ధాతువులను, కొన్ని ఔషధమూలికలనూ ఉంచి పూజాదికాలు నిర్వహించి... గర్భస్థానంలో.. అంటే మధ్య భాగంలో ఉంచేవారు. ఇలా ఆ గర్భాన్ని గుడిలో ఉంచడం వల్ల అది ఆలయం అభివృద్ధికి కారణమౌతుంది. ఆ తర్వాత ఆ గర్భంపైనే ఆధార శిలను ఉంచి దానిపై విగ్రహాన్ని ప్రతిష్ఠిస్థారు. అప్పుడే ఆ విగ్రహానికి జీవం వస్తుంది. అలా దాని చుట్టూ నిర్మించే గుడి దేహంతో సమానం. ఇదొక పద్ధతి. ఈ విషయాన్ని ఈశాన శివగురుదేవ పద్దతి చాలా స్పష్టంగా చెప్పిందని ఆగమ పండితులు చెబుతున్నారు. ఇంకా పలు ప్రాచీన గ్రంథాల్లో కూడా ఈ వివరం ఉంది. 


 


ఇక మరో సంప్రదాయం ప్రకారం ముందుగా ఆలయాన్ని నిర్మించి, ఆ తర్వాత అందులో విగ్రహం లేదా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే దాన్ని గృహగర్భం అంటారు. అదే ముందు విగ్రహం ప్రతిష్టించి ఆపై దానికి గుడి కడితే దాన్ని గర్భగుడి అంటారు. మనకు ఈ రెండు సాంప్రదాయాల్లో గుళ్లు నిర్మించుకునే పద్ధతులు పారంపర్యంగా వస్తున్నాయి. అందువల్ల స్వయంభూ విగ్రహాలకు నిర్మించిన ఆలయాన్ని మాత్రమే గర్భగృహం లేదా గర్భగుడి అని వ్యవహరించాలని ఆగమ నియమం. గర్భగుడిలో నెలకొన్న దేవుడికంటే ముందు ఆ దేవుడికి ఆశ్రయంగా నిలిచిన గర్భగుడి సాక్షాత్తు భగవంతుని శరీరం అని వైష్ణవాగమాలు చెప్తున్నాయి. గర్భగుడిలోకి ప్రవేశించడం అంటే భగవంతునిలో లయం కావడమే. అందుకే దాన్ని ఆలయం అని పండితులు పిలుస్తున్నారు. దైవదర్శనం ఒక ఫలితాన్ని ఇస్తే.. గర్భగుడిలోకి వెళ్లి దేవుణ్ని  దర్శించుకోవడం అనేది... మనల్ని దేవుడిలో లయం చేసే ప్రక్రియ అన్నమాట. ఇదండీ గర్భాలయం ప్రత్యేకత. 


 


- కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు


 


 


 


 


Comments

Popular posts from this blog

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  Also Read:  విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా? అలాంటి మహా పండితుడికి తగిన గుర్తి

బీజేపీ విజయానికి దూసుకొస్తున్న కొత్త నినాదం

ప్రతి జాతీయ ఎన్నికలోనూ సరికొత్త నినాదంతో విజయాలు నమోదు చేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. మోడీ, అమిత్ షా నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ పార్టీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరింత వినూత్నంగా ప్రచారానికి ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీ ఈసారి సృజనాత్మకమైన కన్సల్టెంట్లను రంగంలోకి దింపుతోంది.  అందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ప్రచార బాధ్యతలను ప్రముఖ కన్సల్టెంట్ దుర్గా స్థపతి చేపట్టారు. హైదరాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేస్తూ రాజకీయ కన్సల్టెంట్ గా కొనసాగుతున్న దుర్గాస్థపతి ఆచార్యకు ఈటల రాజేందర్ తమ పార్టీ జాతీయ స్థాయి ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా "యూత్ విత్ మోడీ - బూత్ విత్ మోడీ" అనే ఆకర్షణీయమైన ఎన్నికల నినాద అస్త్రాన్ని ఈటల ఆవిష్కరించారు. అలాగే "ఈటలతో మనమందరం -  అవుతుంది ప్రతి ఇల్లూ రామమందిరం" అనే మరో ఆకర్షణీయమైన క్యాప్షన్ ని కూడా సోషల్ మీడియాలోకి వదిలారు ఈటల. ఈ నినాదాలు అర్థవంతంగా ఉండడమే గాక.. ఎంతో ఆకట్టుకుంటున్నాయని, ప్రజల్ని ఆలోచింపజేస్తాయన్న నమ్మకం తనకు

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత