ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడి టీడీపీని మళ్లీ ప్రజలకు చేరువ చేసేలా సరికొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రచార బాధ్యతలను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త దుర్గా స్థపతి ఆచార్యకు అప్పగించారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ ఈ ప్రచార బాధ్యతలను తమకు అప్పగించారని దుర్గాస్థపతి ఆచార్య చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇప్పటికే బాగా అర్థం చేసుకున్న తాము.. అందులో భాగంగానే అద్భుతమైన ఫలితాలు రాబట్టే దిశగా సృజనాత్మకమైన రీతిలో నినాదాలు రూపొందించి కార్యక్షేత్రంలోకి వెళ్తున్నామని స్థపతి చెప్పారు. అదే పద్ధతిలో కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు. టీడీపీ కోసం తమ క్యాంపెయిన్ ఎలా ఉంటుందో ఇకపై చూస్తారని.. తమ విజన్ కు, సృజనాత్మకమైన పనితీరును బాగా అర్థం చేసుకోవడం వల్లే ఎంతో నమ్మకంతో తమకు ఈ కీలకమైన బాధ్యతలు టీడీపీ నేతలు అప్పగించారని స్థపతి చెప్పారు. Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.