Skip to main content

అరిగోస పెట్టి ఆపన్న హస్తం - అల్ప సంతోషంలో చిన్న పత్రికలు


ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దయ తలచారు. చిన్న, మధ్య తరహా స్థాయి పత్రికలు ఇంకా బతికే ఉన్నాయని గుర్తించారు. తామంతా బతికున్న విషయం కేసీఆర్ గుర్తించినందుకు పత్రికా యాజమాన్యాలు తెగ సంబరపడిపోతున్నారు. తమ ఆకలికేకలు తీరుతాయో లేదో తెలీదు కానీ, తమ పత్రికలకు మాత్రం  ఊపిరి పోసినందుకు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాసిన్ని ఆనందబాష్పాలు కూడా రాల్చారు. తెలంగాణ కోసం పెద్దపత్రికలు ఏం చేశాయో ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు. మదపుటేనుగు లాంటి పెద్దపత్రికల వ్యవహార శైలికి సాక్షాత్తూ ముఖ్యమంత్రులే నిండు అసెంబ్లీల్లో ఏం అభిప్రాయాలు వెలిబుచ్చారో, ఎంత ఆగ్రహం వెళ్లగక్కారో ఇప్పుడు చెప్పుకోవడం అస్సలు బాగుండదు. కానీ చిన్న పత్రికలు మాత్రం తెలంగాణవాదం మినహా మరో మాటకు తావు లేకుండా పని చేశాయి. ఉడుతా భక్తిని ప్రదర్శించాయి. ఉద్యమ నాయకుడి వెంట ఉద్యమ గొంతుకలై చిన్న పత్రికల సంపాదకులు, విలేకర్లంతా కలాలతో కవాతులు చేయించారు. అయితే ప్రజలకు వాటి రీచ్ పెద్దగా లేకపోవచ్చు గానీ ఒకవేళ ఉంటే అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరూ ఈ చిన్న పత్రికలనే అక్కున చేర్చుకొని ఉండేవారు. ఆ విషయం ఈనాడు అధికారంలో ఉన్న ఆనాటిి ఉద్యమ నాయకులందరికీ తెలుసు. అయినా చిన్న పత్రికల మొహాల్లో ఒక చిరునవ్వు మొలిపించటానికి ఇంత టైమ్ తీసుకున్నారు. అయినా అదే పదివేలు. 

చిన్న పత్రికలకు అండగా ప్రభుత్వం - అల్లం నారాయణ
చిన్న పత్రికలకు అన్నివిధాలా అండగా ఉంటామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన చిన్న పత్రికల కృతజ్ఞతా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు ముందు చిన్న పత్రికల సంపాదకులు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లకు క్షీరాభిషేకం చేసి ఆనందోత్సాహాలు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చిన్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం ఆనందించాల్సిన విషయమని అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. చెయ్యనివాటి గురించి మాట్లాడుకున్నట్లుగానే చేసిన వాటి పట్ల కృతజ్ఞతలు తెలపడం జర్నలిస్టులుగా మనందరి కనీస బాధ్యత అంటూ గుర్తు చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం అందించి ఆదుకుందని ప్రశంసించారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, మేగజైన్స్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

తెలంగాణ ఎంప్యానెల్ మెంట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గం
 
హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ ఎంప్యానల్డ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా బిజిగిరి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిరికొండ ఆగస్టిన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసరి వెంకటేశ్వర్ రావు, గౌరవాధ్యక్షులుగా డి.ఎస్.ఎన్ మూర్తి, సలహాదారులుగా కె. సూర్యనారాయణ, ఉస్మాన్ రషీద్, ఉపాధ్యక్షులుగా జానకి రామ్, అవ్వారి భాస్కర్, అర్పెల్లి  శ్రీనివాస్, వెన్నమళ్ళ రమేష్ బాబు, కట్టా రాఘవేందర్  రావు, ట్రెజరర్ గా జి. ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ గా ఖలీల్, జె. సంపత్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా సాయి కిరణ్, పి. సత్యం నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో టి.యు.డబ్ల్యు.జె. పట్టణ అధ్యక్షులు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ యారా, ఎలక్ట్రాన్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, చిన్న, మధ్య తరహా పత్రికల సంపాదకులు, తదితరులు పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత