Skip to main content

వీకెండ్ స్టోరీ: కృషి ఉంటే యువకులు రమేశ్ లు అవుతారు

ఎవరైనా సెలవు రోజు ఏం చేస్తారు?

ఆ వారం రోజులు పడిన శ్రమ అంతా మరచిపోవాలని చూస్తారు. "సేద" దీరే సమయం కోసం ఎదురుచూస్తారు. ఇక రేపటి గురించి కలలు కనేవారైతే వచ్చే వారం రోజుల్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవర్ని కలవాలో పక్కాగా ప్లాన్ వేసుకుంటారు. కూడికలు, తీసివేతల లెక్కల్ని గణించుకొని ముందడుగు వేస్తారు. 

మరి.. కొడిచర్ల రమేశ్ ఏం చేస్తాడో తెలుసా?

షేవ్ చేస్తాడు. అవును మీరు చదివింది నిజమే. సెలవు రోజుల్లో ఆయన సేవ చేస్తాడు. షేవింగ్, కటింగ్.. ఇలా తన కులవిద్య అయిన క్షవర వృత్తినే ప్రతి మంగళవారం సెలవు దినాన సేవ కోసం కేటాయిస్తాడు. ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటి నుంచి బయటపడి ఏ వృద్ధాశ్రమానికో,  అనాథాశ్రమానికో వెళతాడు. ప్రతి వారం ఏదో ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి బాబాయిల్ని, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తాడు. జుట్టు బాగా పెరిగి చికాగ్గా కనిపించే అనాథలను ఎంతో నాగరికంగా తయారుచేసి ఆశ్రమ నిర్వాహకులకు ఎంతో ఆత్మీయ నేస్తంగా మారాడు. 
డబ్బున్న మారాజులు తమ పేరెంట్స్ ని ఖరీదైన వృద్ధాశ్రమాల్లో చేర్పించి డాలర్లు పోగేసుకునేందుకు  విమానాల్లో విదేశాలు చెక్కేస్తుంటే.. చిల్లిగవ్వ కూడా పోగేసుకోవాలనే ధ్యాసే లేని  రమేశ్ మాత్రం క్షవర సేవ కోసం తనకున్న టూ-వీలర్ మీదనే రథయాత్రను కొనసాగిస్తున్నాడు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన కొడిచెర్ల రమేశ్ ది స్వతహాగా సేవాభావం. మాటల్లో, మౌనంలో ఆయనలో ఎక్కడ చూసినా సేవాభావమే తొంగి చూస్తుంటుంది. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయినా, నరేంద్ర మోడీ పుట్టిన రోజు అయినా, సావిత్రిబాయి  ఫూలే కు నివాళి అర్పించే రోజైనా, సైనిక అమరవీరులను స్మరించుకునే రోజైనా, తెలంగాణ జాతిపిత  జయశంకర్ సార్ వర్దంతి అయినా, ఆఖరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైనా సరే... ప్రాముఖ్యత గల ఏ రోజు వచ్చినా ఏదో ఒక ఆశ్రమంలోనో, హైదరాబాద్ సిటీలోని ఏదోక స్లమ్ ఏరియాలోనో వాలిపోతాడు. అక్కడుండే పేదలకు ఉచితంగాా క్షురకర్మ చేసి వారి ఆదరాభిమానాలు చూరగొంటున్నాడు. రమేశ్ సేవా పరాయణతకు మెచ్చిన అనేక స్వచ్చంద  సంస్థలు ఆయనకు అనేక సత్కారాలు అందజేశారు. వారందరికీ రమేశ్ అంటే కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ. 
రక్త సంబంధాలు కూడా డబ్బు మారకంతో కలుషితం అయిపోతుంటే.. రమేశ్ నాయీ స్వచ్ఛమైన, స్వచ్ఛంద సేవాకార్యం మాత్రం ఎందరో దేవుడిచ్చిన బాబాయిలను, తమ్ముళ్లను సంపాదించి పెట్టింది.  ఇంతమంది ఆత్మీయులను ఎలా సంపాదించుకున్నావని రమేశ్ ని అడిగితే.. చాలా సింపుల్ గా.. "నాకేం వచ్చింది అని కాకుండా.. నేనేం ఇవ్వగలను" అనే ప్రశ్న వేసుకుంటే దాన్ని మించిన సౌభాగ్యం లేదంటాడు. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.