Skip to main content

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల  ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు. 

రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక్కించారని బాలబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశారు. రేచర్ల రుద్రుడు వేయి స్తంభాల గుడిని నిర్మించినట్టుగా చరిత్రలో నమోదైనప్పటికీ ఆనాటిి కాకతీయ పాలకుడైన రుద్రుడిని రామప్ప ఆలయానికి జత చేయడం కొందరు కుసంస్కారుల, కుహనా మేధావుల కుట్రపూరిత  చర్యగా సినీ నిర్మాత, రచయిత కొత్తపల్లి సీతారాం పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు యునెస్కో కు నివేదికలు పంపినప్పుడే ఈ కుట్రకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ప్రముఖ సినీ గేయ రచయిత స్వర్గీయ సి.నారాయణరెడ్డి రాసిన రామప్ప అనే పుస్తకంలో, అలాగే రాగమయి అనే మరో కావ్యంలో ఆ శిల్పిని రామప్పగా పేర్కొనడం జరిగిందని, రామప్ప శిల్ప కళా నైపుణ్యానికి ఆనాటి పాలకురాలు రుద్రమదేవి మనసు పడిందని వారి మధ్య అవ్యక్తమైన, అవ్యాజమైన, అద్భుతమైన ప్రేమాయణం కూడా కొనసాగినట్లు సినారె వంటి ప్రముఖ రచయితలు కూడా పేర్కొన్నారని సీతారాం గుర్తు చేశారు.  అసలు ఆ ఆలయానికి శిల్పి పేరు మీద రామప్ప అనే పేరు పెట్టింది కూడా సాక్షాత్తూ  ఆనాటి పాలకుడు రేచర్ల రుద్రుడేనన్న విషయం గమనించాలని ఆయన ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నమోదైన అంశాలను విస్మరించి స్వీయ కల్పితాలతో  యునెస్కోకు  రిపోర్టులు ఇవ్వడం వల్లే రామప్ప పేరు కాస్తా బ్రాకెట్లోకి వెళ్లిపోయిందన్నారు. 

అయితే ప్రజలందరికీ తెలిసింది రామప్పేనని, రామప్ప పేరును ప్రజల మస్తిష్కాల్లోంచి ఎవ్వరూ చెరిపివేయజాలరని, అయితే మేధావుల ముసుగులో, చరిత్రకారుల పేరుతో కొందరు చేస్తున్న కుత్సితపు చేష్టలను ప్రజలెప్పుడూ తిరస్కరిస్తారని సీతారాం అన్నారు. ఇందులో భాగంగానే తాము  రానున్న రోజుల్లో మరిన్ని యాత్రలు నిర్వహిస్తామని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో వెనుక వేయబడ్డ ప్రాంతంగా పేరున్న తెలంగాణకు తన శిల్పకళా చాతుర్యంతో అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప పేరుకు అన్యాయం తలపెట్టే  ప్రయత్నాలను పాలకులు ఎంతో  ముందుచూపుతో  కనిపెట్టాలని, అలాంటివాటికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పుడే న్యాయం నాలుగు పాదాలమీద నడిచినట్టు కీర్తి పొందుతుందని సీతారాం అభిప్రాయపడ్డారు.  
ఈ యాత్ర పొడవునా జయహో రామప్ప, అమర శిల్పి రామప్ప అంటూ యాత్రికులు పెద్దఎత్తున  నినాదాలు చేశారు. పురుషులతో పాటు పెద్దసంఖ్యలో మహిళలు కూడా పాల్గొనడం విశేషం. నాగర్ కర్నూలు జిల్లాలోని యథార్థ పీఠం అధిపతి జనార్దనస్వామి ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


Comments

Popular posts from this blog

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో