Skip to main content

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదు-ఎర్రోజు భిక్షపతి


ఏ నాయకుడు ఏ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆగేది లేదని, విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం మడమ తిప్పకుండా పోరాడతానని, ఈ ప్రయాణంలో జాతి రత్నాల్లాంటివారు కూడా అడ్డుకున్నా ప్రజల మద్దతుతో ముందుకెళ్తానని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కరాఖండిగా తేల్చేశారు. సెప్టెంబర్ 5న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభలో భిక్షపతి తన వైఖరిని ప్రజలందరికీ విడమరచి చెప్పారు. గత పదేళ్లుగా కులసంఘంలో పని చేస్తూ జాతి అభివృద్ధి కోసం పాటు పడుతున్నానని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ విశ్వబ్రాహ్మలకు ఏం చేయాలో తనకంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయన్నారు. 30 ఏళ్లకు పైగా విశ్వబ్రాహ్మణ కుల సంఘం పేరుతో పనిచేస్తున్న కొందరు పెద్దలు ఇప్పటివరకు ఏం చేశారో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉనికి చాటుకునేందుకే సంఘాల పేరుతో అమాయకులైన విశ్వబ్రాహ్మలను మోసం చేస్తున్నారని, ఆ మోసాలను ప్రశ్నిస్తున్నందువల్లే తన మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు సాగిస్తున్నాయన్నారు. అయితే కులం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పదేళ్లుగా తాను కుల సంఘాల్లో చురుగ్గా పని చేస్తున్న కారణంగానే ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ ప్రజానీకం తనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారన్నారు. దశాబ్దాలుగా అసలు చర్చకు రాని సమస్యలను తన ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తానని, అలా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని, ప్రజల దీవెనలు ఉంటే దూసుకెళ్తానన్నారు. ఈ బహిరంగ సభ విశ్వబ్రాహ్మణ జాతిని మలుపుతిప్పేదిగా అవుతుందని, ఇక నుంచి జాతి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, జాతీయులంతా అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 


ఇక ఈ సభకు ప్రభుత్వ ప్రతినిధిగా బీసీ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. తాను ప్రభుత్వం ఆదేశిస్తే వచ్చానని, విశ్వబ్రాహ్మణులకు ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అందుకు సంబంధించిన కేటాయింపులు తెలిపే ఉత్తర్వుల తాజా ప్రతిని సంఘం అధ్యక్షుడు భిక్షపతికి అప్పగించారు. అన్ని రంగాల సేవల్లో కూడా విశ్వబ్రాహ్మణులే ముందుంటారని, అయితే అభివృద్ధిలో మాత్రం వెనుకబడ్డారని, అయితే పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వబ్రాహ్మల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ఉన్నారని, ఆయన హయాంలోనే మీ జాతి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రికి బీసీలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సంఘీయులు ఎదుర్కొంటున్న ఇతర అన్ని సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇక ఆత్మగౌరవ భవనం కోసం ఐదెకరాల భూమికి సంబంధించిన కాగితాలు, అందుకయ్యే రూ. 5 కోట్ల నిధుల కేటాయింపుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఎర్రోజుకు అప్పగించడంతో సభికులంతా ఈలలు, కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

ఇక భిక్షపతి సభాముఖంగా పలు డిమాండ్లను వినిపించారు. 

1) ప్రభుత్వం ఇతర కులాలకు ఇస్తున్నట్టుగానే 50 ఏళ్లు పైబడ్డ విశ్వబ్రాహ్మణులకు కూడా పింఛన్లు ఇవ్వాలి.
2) వరంగల్ విశ్వబ్రాహ్మణ గర్జన సభలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి పాలకమండలిని నియమించడంతో పాటు ఆ సభలోనే హామీ ఇచ్చినట్టు రూ. 250 కోట్లు తక్షణమే విడుదల చేయాలి.
3) ఫారెస్టు అధికారులు కర్రకోత, దూగోడ మిషన్లను సీజ్ చేసి వడ్రంగులను వేధించి గ్రామాల్లో వారి వృత్తిని తీవ్రంగా అడ్డుకున్నారు. వారి పనిముట్లను, లైసెన్సులను మళ్లీ వారికి అందజేసి వడ్రంగుల వృత్తిని కొనసాగేలా చేయాలి.
4)  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాళిబొట్లు తయారుచేసే హక్కును అక్కడి విశ్వబ్రాహ్మణులకే కట్టబెడుతూ జీవో జారీ చేసిన పద్ధతిలోనే తెలంగాణలో కూడా తాళిబొట్ల తయారీని మా విశ్వబ్రాహ్మణ సోదురులకే కట్టబెట్టి ఆదుకోవాలి.
5) విశ్వబ్రాహ్మణుల్లో అర్చక వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నవారిని, వేదాధ్యయనం చేస్తూ ఉన్నవారిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో తగిన హోదాలో ప్రాధాన్యత కల్పించాలి.
6) విశ్వబ్రాహ్మణులకు మండలానికో కమ్యూనిటీ హాలు కోసం ఎకరం భూమి, రూ. కోటి నిధులు కేటాయించాలి. జిల్లా స్థాయిలో రెండెకరాల భూమి, రెండు కోట్ల నిధులు కేటాయించాలి.
7) మేడ్చల్ -సిద్దిపేట రోడ్డులో 300 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన చేతివృత్తుల పారిశ్రామిక హబ్ ను విశ్వబ్రాహ్మణులకే కేటాయించి నిర్వహణ బాధ్యతలు కూడా విశ్వబ్రాహ్మణులకే అప్పగించాలి.
8) మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి అయిన శంకరమ్మకు ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి. 

ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కళామండలి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యానందాచారి బృందం అభినయించిన స్ఫూర్తిదాయకమైన గీతాలకు సభకు హాజరైన జనమంతా ఎంతో హుషారుతో కోరస్ అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో వీవీఐఎస్ ప్రధాన కార్యదర్శులు తల్లోజు చెన్నయ్యాచారి, నౌండ్ల సంతోష్ ఆచారి, నందిపేట రవీంద్రాచారి, కోశాధికారి బిక్షపతిచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల బ్రహ్మచారి, గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనేత చేపూరి లక్ష్మణాచారి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నాగారం కవితారాణి, ప్రధాన కార్యదర్శి సిద్ధాంతం శ్యామల, యువజన విభాగం అధ్యక్షుడు చంద్రశేఖరాచారి, గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అనంతోజు బ్రహ్మచారి, యువజన విభాగం ఉపాధ్యక్షుడు వలబోజు రవికిరణ్ ఆచారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కాతోజు రామాచారి, వివిధ జిల్లాలు, మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ కమిటీ ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 

                                   2) మధుసూధనాచారికి నో ఛాన్స్

బహిరంగ సభను ప్రతిబింబించే చిత్రమాలిక

Comments

  1. అభ్యర్ధించినా కానీ పనులు జరగకపోతే ..పోరాటం చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయి...

    ReplyDelete

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎ