ఏ నాయకుడు ఏ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆగేది లేదని, విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం మడమ తిప్పకుండా పోరాడతానని, ఈ ప్రయాణంలో జాతి రత్నాల్లాంటివారు కూడా అడ్డుకున్నా ప్రజల మద్దతుతో ముందుకెళ్తానని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కరాఖండిగా తేల్చేశారు. సెప్టెంబర్ 5న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభలో భిక్షపతి తన వైఖరిని ప్రజలందరికీ విడమరచి చెప్పారు. గత పదేళ్లుగా కులసంఘంలో పని చేస్తూ జాతి అభివృద్ధి కోసం పాటు పడుతున్నానని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ విశ్వబ్రాహ్మలకు ఏం చేయాలో తనకంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయన్నారు. 30 ఏళ్లకు పైగా విశ్వబ్రాహ్మణ కుల సంఘం పేరుతో పనిచేస్తున్న కొందరు పెద్దలు ఇప్పటివరకు ఏం చేశారో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉనికి చాటుకునేందుకే సంఘాల పేరుతో అమాయకులైన విశ్వబ్రాహ్మలను మోసం చేస్తున్నారని, ఆ మోసాలను ప్రశ్నిస్తున్నందువల్లే తన మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు సాగిస్తున్నాయన్నారు. అయితే కులం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పదేళ్లుగా తాను కుల సంఘాల్లో చురుగ్గా పని చేస్తున్న కారణంగానే ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ ప్రజానీకం తనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారన్నారు. దశాబ్దాలుగా అసలు చర్చకు రాని సమస్యలను తన ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తానని, అలా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని, ప్రజల దీవెనలు ఉంటే దూసుకెళ్తానన్నారు. ఈ బహిరంగ సభ విశ్వబ్రాహ్మణ జాతిని మలుపుతిప్పేదిగా అవుతుందని, ఇక నుంచి జాతి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, జాతీయులంతా అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
3) ఫారెస్టు అధికారులు కర్రకోత, దూగోడ మిషన్లను సీజ్ చేసి వడ్రంగులను వేధించి గ్రామాల్లో వారి వృత్తిని తీవ్రంగా అడ్డుకున్నారు. వారి పనిముట్లను, లైసెన్సులను మళ్లీ వారికి అందజేసి వడ్రంగుల వృత్తిని కొనసాగేలా చేయాలి.
4) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాళిబొట్లు తయారుచేసే హక్కును అక్కడి విశ్వబ్రాహ్మణులకే కట్టబెడుతూ జీవో జారీ చేసిన పద్ధతిలోనే తెలంగాణలో కూడా తాళిబొట్ల తయారీని మా విశ్వబ్రాహ్మణ సోదురులకే కట్టబెట్టి ఆదుకోవాలి.
5) విశ్వబ్రాహ్మణుల్లో అర్చక వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నవారిని, వేదాధ్యయనం చేస్తూ ఉన్నవారిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో తగిన హోదాలో ప్రాధాన్యత కల్పించాలి.
6) విశ్వబ్రాహ్మణులకు మండలానికో కమ్యూనిటీ హాలు కోసం ఎకరం భూమి, రూ. కోటి నిధులు కేటాయించాలి. జిల్లా స్థాయిలో రెండెకరాల భూమి, రెండు కోట్ల నిధులు కేటాయించాలి.
7) మేడ్చల్ -సిద్దిపేట రోడ్డులో 300 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన చేతివృత్తుల పారిశ్రామిక హబ్ ను విశ్వబ్రాహ్మణులకే కేటాయించి నిర్వహణ బాధ్యతలు కూడా విశ్వబ్రాహ్మణులకే అప్పగించాలి.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కళామండలి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యానందాచారి బృందం అభినయించిన స్ఫూర్తిదాయకమైన గీతాలకు సభకు హాజరైన జనమంతా ఎంతో హుషారుతో కోరస్ అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో వీవీఐఎస్ ప్రధాన కార్యదర్శులు తల్లోజు చెన్నయ్యాచారి, నౌండ్ల సంతోష్ ఆచారి, నందిపేట రవీంద్రాచారి, కోశాధికారి బిక్షపతిచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల బ్రహ్మచారి, గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనేత చేపూరి లక్ష్మణాచారి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నాగారం కవితారాణి, ప్రధాన కార్యదర్శి సిద్ధాంతం శ్యామల, యువజన విభాగం అధ్యక్షుడు చంద్రశేఖరాచారి, గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అనంతోజు బ్రహ్మచారి, యువజన విభాగం ఉపాధ్యక్షుడు వలబోజు రవికిరణ్ ఆచారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కాతోజు రామాచారి, వివిధ జిల్లాలు, మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ కమిటీ ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
అభ్యర్ధించినా కానీ పనులు జరగకపోతే ..పోరాటం చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయి...
ReplyDelete