Skip to main content

ఆంధ్రాలో కాపులకు బీజేపీ ఎందుకు గాలం వేస్తోంది?


ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవిని కాపులు ఎందుకు అందుకోలేకపోతున్నారు? అంతటి సమర్ధులు లేరా? ఆర్థికంగా స్థితిమంతులు కారా? వంగవీటి రంగా, దాసరి నారాయణ రావు, కన్నా లక్ష్మీ నారాయణ, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం సీఎం అయ్యే అర్హతలు ఉన్నా ఆ పదవిని ఎందుకు అందుకోలేకపోయారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచి ఇపుడు సీఎం రేసులో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రాలో కాపులకు ఉన్న అడ్వాంటేజెస్ డిజాడ్వంటేజెస్ ఏమున్నాయో ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవి కాపులకు అందని ద్రాక్షలానే మిగిలింది. కాపు సామాజికవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా....సీఎం పదవిని మాత్రం అందుకోలేకపోవడంతో  వారు తీవ్ర నిరాశా నిస్ప్రుహలకు గురవతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,  బీజేపీలలో కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. అయితే బీజేపీ మాత్రం దక్షిణాది రాష్ట్రాలలో తన ముద్ర వేయలేకపోతోంది. ప్రాంతీయ పార్టీల పొత్తులతో అరకొర సీట్లు సాధిస్తోంది. ఒక్క కర్ణాటకలోనే అధికారం దక్కించుకోగలిగింది. 2014 నుంచి ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న బీజేపీ దక్షిణాదిలో పాగావేయలేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో పలు పేర్లతో పిలుస్తున్న కాపు సామాజికవర్గం జనాభా దాదాపు 26 శాతం ఉన్నట్లు గా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ లానే ఉండేది. రాష్ట్ర విభజన తరువాత రెడ్డి సామాజిక వర్గ ప్రాధాన్యం తెలంగాణ కాంగ్రెస్ కి పరిమిత మయింది. ఏపీలో రెడ్లందరూ వైసీపీకి జై కొట్టారు. దీంతో రెడ్లకు వైసీపీ, కమ్మ సామాజిక వర్గానికి టీడీపీలు ఉండగా ఉన్నాయి.  ఈ రెండు వర్గాలకు మీడియా అండదండలు పుష్కలంగా ఉన్నాయి.  అయితే కాపులకు ప్రాతినిథ్యం వహించేందుకు  పూర్తి స్థాయిలో పార్టీ లేకపోవడం ...అంతకు మించి మీడియా సపోర్ట్ కూడా లేకపోవడం వెలితిగా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగంగానే అంటున్నారు. పార్టీ ఏదైనా కాపు నేతలు ప్రతి ప్రభుత్వంలోనూ మంత్రి పదవులు దక్కించుకుంటున్నారు. అయితే సీఎం పీఠం దక్కించుకునేందుకు కాపు నేతలు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదనే చెప్పాలి. కాపులకు ఐక్యత లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఉన్నత పదవులు పొందలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా స్థితిమంతులైన నేతలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కాపు సామాజిక వర్గంలో ఉన్న సినీనటులు తమకున్న ప్రజాదరణను ఓటు బ్యాంకు గా మలచుకోవడంలో విఫలమయ్యారని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో తమకు దక్కిన మంత్రి పదవులతో సంత్రుప్తి చెందడం కూడా సీఎం పీఠం దాకా చేరుకోకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా కాపులకు యూనిటీ రావడం ప్రస్తుతం కొంత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో సీఎం పీఠాన్ని కన్నా లక్ష్మీ నారాయణ త్రుటిలో చేజార్చుకున్నారు. ఇపుడు కన్నా బీజేపీ అధ్యక్షుడిగా  ఉండటం, సోము వీర్రాజు లాంటి నేతలు అయనకు బీజేపీ దన్నుగా నిలవడంతో కాపులకు సీఎం పీఠం దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు సీఎం పీఠం దాకా వచ్చినా సినీరంగంలో తనదైన ముద్ర వేసిన దాసరి నారాయణరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నా సీఎం అయ్యేందుకు పరిస్థితులు అంతగా అనుకూలించలేదనే చెప్పాలి. ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించిన సినీ నటుడు చిరంజీవి కూడా తనకున్న ప్రజాదరణను ఓట్లగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ...కాపు సామాజిక వర్గానికి పెద్దాయనలా వ్యవహరిస్తున్న ముద్రగడ పద్మనాభం..ఇటీవలి ఎన్నికల తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.  బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికి అన్ని రాష్ట్రాలలోని కాపు సామాజిక వర్గాన్ని చేరదీస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ బలపడేందుకు భారీ కసరత్తు చేస్తోంది. ఇటీవల కర్ణాటకలో బీజేపీ బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ రెండు లక్షల బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించడం మీటింగ్ పెట్టడం దీనికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ల నుంచి వందల సంఖ్యలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమీకరణాల్ని ద్రుష్టిలో పెట్టుకుని ఏపీలో బీజేపీ భారీ స్కెచ్ కి వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. చిరంజీవికి అత్యంత ఆప్తుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు దాదాపు ఖాయమైపోయింది. గంటాతోపాటు అన్ని పార్టీలలోని కాపు నేతలను కూడా బీజేపీలోకి తెచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైరా సినిమా ప్రమోషన్ అంటూ చిరంజీవి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారని సమాచారం. అన్నయ్య సీఎం అయ్యేందుకు తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన అండదండలు ఖచ్చితంగా ఉంటాయని బీజేపీ విశ్వసిస్తోంది. మరోవైపు అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీలతో  పవన్ కు సన్నిహిత సంబంధాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాపు వర్గానికి చెందిన వారు సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
 

దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ప్రజల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతలకు గాలం వేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ప్రబల శక్తిగా అవతరించాలని బీజేపీ భావిస్తోంది. మరి బీజేపీలో తిరుగులేని వ్యూహకర్తలుగా పేరొందిన మోడీ అమిత్ షాల ద్వయం అనుసరిస్తున్న వ్యూహం ఏపీలో బీజేపీకి ఓట్ల వర్షం కురిపిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 


 


Comments

Popular posts from this blog

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం.  మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి.  థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాత

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో