Skip to main content

అఖిలప్రియపై సొంత తమ్ముడు కోర్టుకెక్కడంలో అసలు కారణం ఇదే


భూమా అఖిలప్రియ మరో వివాదంలో  చిక్కుకున్నారా......ఆస్తికోసం సొంత తమ్ముడు .....సోదరిపైనే కోర్టుకెక్కాడా..... ఎప్పుడో 2016 లో  తండ్రి విక్రయించిన స్థలంపై  వాటా కోసం అఖిలప్రియ తమ్ముడు ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించినట్టు....ఒకవేళ నిజంగా  ఆస్తికోసం  అక్కపై  కోర్టుకెక్కితే ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంటారు.... ఆమె కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఎందుకు వెళతారు........దీని వెనుక ఎదైనా  హిడెన్ అజెండా  ఉందా....... అక్కపై తమ్ముడు  నిజంగా   కేసు పెట్టారా.... లేక ఫ్యామిలీ డ్రామానా? 


మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు కోర్టుకు వెళ్లారు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమా కుటుంబానికి హైదరాబాద్ శివారు గండిపేట వద్ద 1000 గజాల స్థలం ఉంది. అయితే, ఆ ఆస్తిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో తాను మైనర్ అని తన తండ్రి భూమా నాగిరెడ్డి చెప్పడంతో వేలిముద్రలు వేశానని జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడు. అప్పట్లో సుమారు రూ.2కోట్లకు ఆ భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, మూడేళ్ల నాడు అమ్మిన ఆస్తిలో తనకు వాటా కావాలంటూ జగన్ విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ప్రచారం జరుగుతోంది.


ఈ ప్రచారంపై కర్నూలు జిల్లావాసులు భూమా అభిమానులు తీవ్ర కలత చెందుతున్నారు. తన ఇద్దరు అక్కలపై భూమా కుమారుడు ఎందుకు కోర్టుకు ఎక్కారు..... ఎప్పుడో అమ్మిన భూమిపై వాటా కోసం ఇప్పడు పట్టుబట్టడం ఏంటని బుర్రలు పీకుంటున్నారు. తల్లిదండ్రుల మరణంతో భూమా కుటుంబానికి అఖిలప్రయ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు...అటు  తమ  కుటుంబానికి అండగా నిలిచిన అభిమాన బలాన్ని కాపాడుకుంటూ .. ఇటు  రాజకీయ ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొంటుూ  ముందుకు సాగుతున్నారు. 


కొద్దిరోజుల క్రితం భూమా అఖిలప్రియ  భర్త భార్గవ్ రామ్ కేసులు వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో కూడా భార్గవ్‌పై ఓ కేసు నమోదయ్యింది. ఇప్పుడు తాజాగా సొంత తమ్ముడు కోర్టుకు ఎక్కాడన్న వార్తలు  కర్నూలు , నంద్యాలలో హాట్‌టాపిక్ గా మారాయి.  మరోపక్క  తన  కుటుంబంపై జరుగుతున్న  ప్రచారంపై  జగత్ విఖ్యాత్ రెడ్డి  స్పందించారు. తాను దుబాయ్‌లో ఉన్నానంటూ  తమ కుటుంబం అంతా కలిసే ఉందని.. తమపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. దీంతో  భూమా కుటుంబంలో కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది. కేవలం భూమి కొనుగోలుదారులను ఇబ్బందిపెట్టేందుకే న్యాయవాదుల సలహా మేరకే విఖ్యాత్‌ కోర్టును ఆశ్రయించారని ఈ కేసును వాదిస్తున్న లాయర్‌ కూడా భూమా అఖిలప్రియ బంధువే అని సమాచారం.    అఖిలప్రియ స్పందించి నిజం ఏంటో  వెల్లడించాలని  అభిమానులు కోరుతున్నారు. 


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక