Skip to main content

తెలంగాణ ఖజానా ఖాళీ.. కారణాలు ఇవేరైతు బంధు పథకం రెండో దఫాకు  నిధులు లేవా...నవంబర్ నెల సగం గడిచినా ఈ పథకంపై  ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు...... ఖజానా నిండుకుందా.... ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి  పథకంలో మార్పులు చేసి పది ఎకరాల పరిమితి  విధించబోతున్నారా.....రైతు బంధు నిధుల విడుదల ఆలస్యంపై ప్రత్యేక కథనం...తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి నిధుల కొరత ఏర్పడిందని సమాచారం..ఇంతవరకు రెండో దఫా నిధుల విడుదల పై ప్రభుత్వంలో కదలికే లేదు.ఈ పథకం మొదటి విడతను మే, జూన్ నెలలో, రెండో విడతను అక్టోబర్, నవంబర్ లలో విడుదల చేస్తామని ప్రకటించారు..అయితే మొదటి దఫా నిధులే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.హుజుర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో సూర్యాపేట జిల్లాలో పెండింగులో ఉన్న నిధులు ఒకేసారి విడుదల చేశారు. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.ఒక విడత రైతుబంధు కు ఆరు వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల కోట్లే విడుదలయ్యాయి... నిధుల కొరత కారణంగా ఒకేసారి ఇవ్వలేక దశల వారిగా విడుదల చేస్తున్నారు..మరో ఐదు వందల కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.


 


మొదటి దఫా పూర్తి కాకుండానే రెండో విడత సమయం వచ్చింది.గత ఏడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నవంబర్ నెలలోనే ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ రైతు బంధు చెక్కుల పంపిణీని నిలిపివేసింది.ఈసీ అనుమతించాక సరిగ్గా పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసింది ప్రభుత్వం.అయితే ఈ ఏడాది నవంబర్ నెల మధ్యలోకి వచ్చినా రెండో విడత నిధుల ఊసే ఎత్తడం లేదు..ఆర్థిక మాంద్యం ఉందని బడ్జెట్ నే కుదించారు. ఈ ఏడాది నిధుల కటకట ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.అందుకే రెండో విడత జాప్యమవుతోందని తెలిసింది..రాష్ట్రానికి ఉన్న రుణపరిమితి ని ఇప్పటికే సగానికి పైగా వినియోగించుకున్నారు. అప్పు తీసుకొని ఇతర అవసరాలకు వాడుకున్నారు. మళ్ళీ అప్పు కోసం మరో రెండు నెలలు ఆగక తప్పదు.నిధులు లేక రెండో విడత రైతు బంధుపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని అంటున్నారు అధికారులు.ఆర్థిక శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి రైతు బంధు రెండో విడత అలస్యమయ్యే అవకాశం ఉందని తెలిసింది.


 


మరోవైపు ఈ పథకాన్ని పునఃసమీక్షించే యోచనలో ఉన్నట్లు సమాచారం..నిధుల కొరత సాకుతో ఈ పథకాన్ని పది ఎకరాల లోపు రైతులకే పరిమితం చేసే యోచనలో ఉన్నారని తెలిసింది.దీని వల్ల ఏటా రెండు వేల కోట్లు ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు..టిఆర్ఎస్ మొదటి ప్రభుత్వ హయాంలో మెప్పు కోసం ప్రకటించిన కొన్ని విషయాల్లో పునఃసమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు.దీనికి ఆర్టీసీ, ఉద్యోగుల జీతాల పెంపుపై సిఎం ఇప్పటి వైఖరినే ఉదాహరణగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.కేసీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీతాల పెంపు విషయంలో ఉదారంగా వ్యవహరించారు.కానీ రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్టీసీ, ఉద్యోగుల జీతాల పెంపుపై కఠినంగా ఉంటున్నారు.ఇదే విధంగా రైతు బంధు పథకంలో కూడా 10 ఎకరాల పరిమితి విధించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి ఇప్పటి ఆర్థిక పరిస్థితి ని కారణంగా చూపి ప్రజల ను మెప్పించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం..


 


Comments

Popular posts from this blog

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం.  మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి.  థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాత

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో