Skip to main content

Posts

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత

రాజ్ ‎కుమార్ ఖాతాలో అవార్డులు, రివార్డులు, ప్రశంసాపత్రాలు

ఆయన అవార్డుల కోసం పని చేయడు. అయినా అవార్డులు వెదుక్కుంటూ ఆయన్ని వరిస్తాయి. పని పట్ల ఆయన చూపే బాధ్యతే ఆయన వెంట అవార్డులు క్యూ కట్టేలా చేసిందంటే అతిశయోక్తి కాదంటారు ఆయన స్నేహితులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీ పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎస్.రాజ్‎కుమార్ ను ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి. తాజాగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‎కుమార్ తన సేవలకు గాను ప్రశంసా పత్రం అందుకున్నారు.  రాజ్‎కుమార్ ఇప్పటికే 38 ఉత్తమ సేవా పురస్కారు, 24 నగదు పురస్కారాలు, మరో 4 ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన రాజ్‎కుమార్ రెగ్యులర్ పోలీస్ డ్యూటీలే గాక, అధికారులు అప్పగించే ప్రత్యేకమైన టాస్కులు, డ్రాఫ్టింగ్ వంటి ఏ పనులు అప్పగించినా అన్నింటా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. అది చూసే రాజ్‎కుమార్ కోసమే పోలీస్ అధికారులు పలు ప్రత్యేకమైన పనులు అప్పగిస్తారన్న టాక్ కరీంనగర్ జిల్లాలో వినిపిస్తుంది. తాజా కార్యక్రమంలో ఎల్ఎండీ పోలీసులకు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్ఐ శీలం ప్రమోద్‎రెడ్డి, ఏఎస్ఐ నజీముద్దీన్, హెడ్ కాన

శ్రీకాంతాచారి బలిదానంతోనే తెలంగాణ స్వప్న సాకారం: జస్టిస్ చంద్రకుమార్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అమరుడు శ్రీకాంతాచారి బలిదానమే అత్యంత కీలకంగా మారిందని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలంతా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో... అమరుల కుటుంబాలను మాత్రం ఆదుకునేవారే కరువయ్యారన్నారు. కనీసం వారి త్యాగాలనైనా పట్టించుకునేవారు లేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అన్నారు. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదిరెడ్డి లాంటివారు ఎందరో ఉద్యమాన్ని రగిలిస్తే.. వారి కుటుంబాల్లోనే చీకట్లు అలుముకోవడం తెలంగాణ చరిత్రలో విషాదకరమైన ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు సగటు కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అంతకన్నా భిన్నంగా ఏమీ లేవని ఆవేదన చెందారు. అందుకే ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను మరో అంకానికి చేర్చే ప్రయత్నం జరుగుతుందని.. అమరుల స్ఫూర్తితో తెలంగాణ ప్రజల పార్టీ ఆ కార్యక్రమం పూర్తి చేస్తుందని చంద్రకుమార్ చెప్పారు. శ్రీకాంతాచారికి పాలాభిషేకం అంటే తెలంగాణ అమరులు అందరికీ చేసినట్టే అవుతుందన్నారు.   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్లో గల శ్రీకాంతాచారి వి

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

గ్రామ దేవతల కొలుపుతో పరవశిస్తున్న కమాన్‎పూర్

పెద్దపల్లి జిల్లా కమాన్‎పూర్ మండల కేంద్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎవర్ని పలకరించినా గ్రామ దేవతల ఆరాధనా పారవశ్యంతో తడిసిముద్దయిన ఆనందమే తాండవిస్తోంది. కమాన్‎పూర్‎లో దాదాపు వారం రోజులపాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపనా మహోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్లను గ్రామ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో, సామూహిక వేడుకగా జరుపుకుంటున్నారు.  బొడ్రాయి ప్రతిష్టాపనా కార్యక్రమం అనేది దాదాపుగా తరానికి ఒకసారి జరుపుకుంటారని పెద్దల ఉవాచ. ఒకసారి అలాంటి వేడుక జరిగిన తరువాత మళ్లీ 3, 4 దశాబ్దాల తరువాత గానీ జరుపుకోవడం కుదిరే పని కాదంటారు అనుభవజ్ఞులు. దేశమైనా, గ్రామమైనా ఒక మనిషితో సమానమేనని భారతీయుల తాత్విక చింతన చెబుతుంది. మానవ ఆకారానికి నాభి ఎలాగైతే నవ నాడులకూ ఒక కేంద్ర బిందువుగా ఉంటుందో.. అలాంటిదే గ్రామానికి బొడ్రాయి కూడా. గ్రామం మధ్యలోనే ఈ శిలలను ఏర్పాటు చేస్తారు. అమ్మవార్ల అదే రూపాలను చెక్కబొమ్మలుగా తీర్చిదిద్ది ఉత్సవ విగ్రహాలుగా ఊరేగించడం ఆనవాయితీ. అమ్మవార్ల శుభాశీస్సులు, కరుణా కటాక్షాలు ప్రజలందరి మీదా సమానంగా ప్రసరించాలని వేడుకుంటారు. ఆ తరువాత ఊరంతా సామూహికంగా

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.

వీరభద్ర విజయం - ఒక పర్ఫెక్ట్ సర్జికల్ స్ట్రయిక్

సర్జికల్ స్ట్రయిక్ అంటే 2016లో భారతదేశం పాకిస్తాన్ మీద చేసిందే అనుకుంటారు అందరూ. కానీ అది ఓ కొనసాగింపు మాత్రమే. అలాంటి సర్జికల్ స్ట్రయిక్, అంతకన్నా ప్రమాదకరమైంది, అంతకన్నా ఎన్నో రెట్ల భయంకరమైంది భారతీయ పురాణ కాలంలోనే జరిగింది. ఆ సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన రుద్రమూర్తే వీరభద్రస్వామి. బహుశా దాన్ని మొట్టమొదటి సర్జికల్ స్ట్రయిక్ గా భావించవచ్చేమో.  శత్రువు చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారమే సరైన చర్య. అవమానించడానికి శత్రువే కానక్కర లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ అయినా సరే.. అవమానించాడంటే శత్రువు కిందే లెక్క. సాక్షాత్తూ పరమశివుడు కూడా అదే సూత్రాన్ని పాటించాడు. అల్లుణ్ని అవమానించడానికే దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టాడట. తండ్రి పిలవకపోయినా ఓ గొప్ప కార్యాన్ని, శుభకార్యాన్ని తలపెట్టాడు కాబట్టి వెళ్లొస్తానని శివుని దగ్గర బలవంతంగా అనుమతి తీసుకొని వెళ్లిపోయింది పార్వతి. దుర్బుద్ధితోనే యజ్ఞం తలపెట్టిన దక్షుడు.. కూతురు ముందే అల్లుణ్ని దారుణంగా అవమానించాడు. శివుడికి కూతురును ఇచ్చి పెళ్లి చేయడమే ఇష్టం లేని దక్షుడు.. కూతురే ఇష్టపడి చేసుకోవడంతో ఏమీ అనలేకపోయాడు. కానీ అల్లుడి మీద, అల్లుడి పేదరికం