Skip to main content

గ్రామ దేవతల కొలుపుతో పరవశిస్తున్న కమాన్‎పూర్


పెద్దపల్లి జిల్లా కమాన్‎పూర్ మండల కేంద్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎవర్ని పలకరించినా గ్రామ దేవతల ఆరాధనా పారవశ్యంతో తడిసిముద్దయిన ఆనందమే తాండవిస్తోంది. కమాన్‎పూర్‎లో దాదాపు వారం రోజులపాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపనా మహోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్లను గ్రామ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో, సామూహిక వేడుకగా జరుపుకుంటున్నారు. 

బొడ్రాయి ప్రతిష్టాపనా కార్యక్రమం అనేది దాదాపుగా తరానికి ఒకసారి జరుపుకుంటారని పెద్దల ఉవాచ. ఒకసారి అలాంటి వేడుక జరిగిన తరువాత మళ్లీ 3, 4 దశాబ్దాల తరువాత గానీ జరుపుకోవడం కుదిరే పని కాదంటారు అనుభవజ్ఞులు. దేశమైనా, గ్రామమైనా ఒక మనిషితో సమానమేనని భారతీయుల తాత్విక చింతన చెబుతుంది. మానవ ఆకారానికి నాభి ఎలాగైతే నవ నాడులకూ ఒక కేంద్ర బిందువుగా ఉంటుందో.. అలాంటిదే గ్రామానికి బొడ్రాయి కూడా. గ్రామం మధ్యలోనే ఈ శిలలను ఏర్పాటు చేస్తారు. అమ్మవార్ల అదే రూపాలను చెక్కబొమ్మలుగా తీర్చిదిద్ది ఉత్సవ విగ్రహాలుగా ఊరేగించడం ఆనవాయితీ. అమ్మవార్ల శుభాశీస్సులు, కరుణా కటాక్షాలు ప్రజలందరి మీదా సమానంగా ప్రసరించాలని వేడుకుంటారు. ఆ తరువాత ఊరంతా సామూహికంగా పండుగ చేసుకొని ఆనందాలు పంచుకుంటారు. ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమాల్లో బంధువులంతా కలిసి పాల్గొని బరువు బాధ్యతలు ఎలాగైతే పంచుకుంటారో.. బొడ్రాయి పండుగను కూడా ఊరంతా ఒక మహోత్సవంగా జరుపుకోవడం భారతీయుల తత్వ చింతనలోని ఒక విశేషంగా చెప్పుకుంటారు. 


ఇలాంటి గ్రామ వేడుకల వల్ల ఆ గ్రామ ప్రజల మధ్య ప్రేమానురాగాలు, పరస్పర విశ్వాసాలు బలపడతాయి. ఒకరి గురించి మరొకరికి అవగాహన పెరుగుతుంది. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వెంటనే స్పందించి ఆపన్న హస్తం అందించే ఐక్యతా గుణం ఏర్పడుతుంది. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం వల్ల గ్రామంలో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, ఊరి సంప్రదాయాల పట్ల ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. జన్మభూమి పట్ల మరింత బాధ్యతను, మరింత అనురాగాన్ని పెంపొందించే బొడ్రాయి వేడుక కోసం అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, దూరపు బంధువులు సైతం కలుసుకోవడం ఒక సంప్రదాయం. 

కమాన్‎పూర్ లో ఇలాంటి అరుదైన వేడుకను బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోందని, ప్రజల క్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఊళ్లోని వలంటీర్లు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు ఎంతగానో సహకరిస్తున్నారని సర్పంచ్ నీలం సరిత, శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ ఇదే ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

మా దేవీదేవతలకు పూజ చేసుకోనివ్వండి: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో గల ఓ ప్రధాన దేవాలయంలోకి హిందువులను అనుమతించి, అక్కడ పూజలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేస్తున్నారు. బోధన్ లో గల ఇంద్రనారాయణస్వామి ఆలయాన్ని హిందువులకు అప్పగించాలని ఆయన కోరుతున్నారు. 10 శతాబ్దంలో బోధన్లో ఇంద్రనారాయణుడి దేవాలయాన్ని ఆనాటి రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్రుడు నిర్మించాడని.. అది జైన్ టెంపుల్ గా చరిత్రకారులు నిర్ధారించారని అర్వింద్ చెబుతున్నారు. ఆ తరువాత కళ్యాణి చాళుక్యుల కాలంలో రాజా సోమేశ్వరుడి హయాంలో ఆలయాన్ని పునరుద్ధరించి దానికి ఇంద్రనారాయణస్వామి దేవాలయంగా నామకరణం చేశారన్నారు.  ఆలయ నిర్మాణం నక్షత్రాకారంలో ఉంటుంది. ఎంతో అద్భుతమైన, ఆకర్షణీయమైన శిల్పాలు దేవాలయంలో ఆశ్చర్యం గొల్పుతాయి. ఆనాటి శిల్పాచార్యుల ప్రతిభకు దేవాలయ గోడలపై ఉన్న శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమణ తరువాత దాన్ని మసీదుగా మార్చారు. దానికి దేవల్ మసీద్ అనే పేరు పెట్టారు. గర్భగుడిని మార్చి.. ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వేదికను నిర్మించి.. మిగిలిన దేవాలయాన్ని పూర్తిగా అలాగే ఉంచి దేవల్ మసీదు

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము