తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అమరుడు శ్రీకాంతాచారి బలిదానమే అత్యంత కీలకంగా మారిందని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలంతా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో... అమరుల కుటుంబాలను మాత్రం ఆదుకునేవారే కరువయ్యారన్నారు. కనీసం వారి త్యాగాలనైనా పట్టించుకునేవారు లేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అన్నారు. ఒక శ్రీకాంతాచారి, ఒక యాదిరెడ్డి లాంటివారు ఎందరో ఉద్యమాన్ని రగిలిస్తే.. వారి కుటుంబాల్లోనే చీకట్లు అలుముకోవడం తెలంగాణ చరిత్రలో విషాదకరమైన ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు సగటు కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అంతకన్నా భిన్నంగా ఏమీ లేవని ఆవేదన చెందారు. అందుకే ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను మరో అంకానికి చేర్చే ప్రయత్నం జరుగుతుందని.. అమరుల స్ఫూర్తితో తెలంగాణ ప్రజల పార్టీ ఆ కార్యక్రమం పూర్తి చేస్తుందని చంద్రకుమార్ చెప్పారు. శ్రీకాంతాచారికి పాలాభిషేకం అంటే తెలంగాణ అమరులు అందరికీ చేసినట్టే అవుతుందన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి టీపీపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. పూలు చల్లి నివాళులు అర్పించారు. టీపీపీ నేతలంతా ఉద్యమ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమం అనంతరం టీపీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ టి. శ్యామ్ సుందర్, ఇంద్రసేన్, సత్తార్ ఖాన్, సుదర్శన్, ఉమ, ఆయనాల కృష్ణారావు తదితరులు పార్టీ రాబోయే కార్యక్రమాల అవసరాన్ని చర్చించారు.
Comments
Post a Comment
Your Comments Please: