Skip to main content

Posts

అసహాయులైన విశ్వకర్మలకు సరుకులు పంచిన వేదాస్

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి లేక, పట్టించుకునేవారు లేక అల్లాడుతున్న నిరుపేద విశ్వకర్మలకు చేయూత అందించేందుకు  వేదాస్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగోజు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి నాగాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దనాచారి సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ శాఖ నాయకుడైన జైన్ కుమార్ ఈ సరుకుల పంపిణీ నిర్వహించారు. హైదరాబాద్ లో మూడు నిరుపేద కుటుంబాలను ఎంచుకొని వారికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు నగదు కూడా అందించారు. అంబర్ పేటకు చెందిన దివ్యాంగుడైన రవీందర్ కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు రూ. 2 వేల నగదు, వృద్ధులైన రెండు జంటలకు కూడా అదే తరహాలో నిత్యావసర సరుకులతో పాటు మొత్తం 7 వేల నగదును అందించారు.  వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ప్రోత్సాహంతోనే తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నామని, ఇందుకు సహకరించిన వేదాస్ సభ్యులు, నాయకులు అందరికీ జైన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర సహాయాధ్యక్షుడు కౌలే జగన్నాథం, అదే సంఘానికి చెందిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కమ్మరి మహేశ్, ప్ర

తెలంగాణలో విశ్వబ్రాహ్మలకు ఒరిగింది శూన్యం

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఖమ్మం జిల్లాకు చెందిన బ్రహ్మశ్రీ ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మను నియమించారు. ఆదివారం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినట్లు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వనాథుల పుష్పగిరి చెప్పారు. అనంతరం ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మ మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తానని, విశ్వకర్మ సమాజపు పూర్వ వైభవానికి, సంస్కృతీ పరిరక్షణకు, సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తానని, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ లక్ష్యాలకు అనుగుణంగా ఎల్లవేళలా విశ్వకర్మలందరికి అందుబాటులో ఉంటానని ప్రమాణం చేశారు. సాధించుకున్న తెలంగాణలో విశ్వకర్మలకు ఒరిగింది ఏమీ లేదని, ప్రభుత్వ పథకాలు సైతం విశ్వకర్మ సమాజానికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఎందరో విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని, తమ కుల సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తనవంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని శ్రీనివాస్ విశ్వకర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ విశ్వబ్

వీకెండ్ స్టోరీ: హండ్రెడ్ పర్సెంట్ హరామ్

ఈ మధ్య కొద్ది నెలలుగా టెండర్ కట్స్ పేరుతో ఓ భారీ వ్యాపార ప్రకటన ఖరీదైన ఇంగ్లిష్ పేపర్లో, ఫ్రంట్ పేజ్‍లో దర్శనమిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్.. ఇలా మాంసాహార ఉత్పత్తులు మీరు కోరుకున్న చోటికి డోర్ డెలివరీ అంటూ ఊదరగొడుతోంది. ఇప్పుడైతే హైదరాబాద్ లోని 11 సెంటర్లలో టెండర్ కట్స్ దుకాణాలు రెడీ అయ్యాయని కూడా తాజాగా మరో ప్రకటన వెలువడింది. అది వ్యాపార ప్రకటన కాబట్టి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ యాడ్ లో చక్కగా బొట్టు పెట్టుకున్న ఈ హిందూ మహిళ చేత ఎంతో గర్వంగా పోజిప్పించి టెండర్ కట్స్ మాంసానికి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎడమవైపు పైన 100 PER CENT HALAL అంటూ స్టార్ గుర్తులో హైలైట్ చేయడమే ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి దారితీస్తోంది.  హలాల్ అనేది ముస్లింల విశ్వాసాల ప్రకారం దేవునికి సమర్పించుకునే నైవేద్యం. ముస్లిమేతరులు ముస్లిమేతర పద్ధతుల్లో సమర్పించుకునే నైవేద్యాన్ని సంప్రదాయ ముస్లింలు ఎవరూ ముట్టుకోరు. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా చెబుతున్న షరియా సూత్రాలను ఇండియన్ ముస్లింలు పెద్దసంఖ్యలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బయటి దేశా

భారత్ ఆక్రమణలో మావో జెడాంగ్ థియరీనే చైనా అమలు చేస్తోందా?

అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని చైనా ఆక్రమించడం, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇవాళ కొత్త కాదు. కానీ భారత్ చైనాను విజయవంతంగా నిలువరిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే చైనా అరుణాచల్ మీద ఎందుకు కన్నేసిందనేదే ముఖ్యాంశం.  ఎలా బయటపడింది? అమెరికాలోని ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. ఆ ఇమేజెస్ గత నవంబర్ లోవి. తాజా ఫొటోల్లో కొత్త ఇళ్ల సముదాయం కనిపించింది. అదే చోట 2019 ఆగస్టులో ఇళ్లేవీ లేవు. ఇళ్లు నిర్మించిన ప్రాంతం భారత్-చైనా సరిహద్దు నుంచి అరుణాచల్ భూభాగంలో దాదాపు 5 కి.మీ. లోపలికి వచ్చేసింది. అంటే ఏడాదిలో చైనా అక్కడ శాశ్వత మానవ నివాసాలను నిర్మించిందన్నమాట. సారీ చూ అనే నది ఒడ్డున చైనా పౌరులకు శాశ్వత నివాసాలు నిర్మిస్తోంది. చైనా పౌరులు కూడా ఇప్పుడక్కడ తరచుగా కనిపిస్తున్నారు. దీనిపై స్థానిక బీజేపీ ఎంపీ కూడా కేంద్రాన్ని అలర్ట్ చేశాడు.  చైనా ఎందుకిలా చేస్తోంది? చైనా భారత భూభాగం మీద కన్నేయడమనేది కొత్త కాదు. ఆక్రమించడానికి చైనా ఎప్పట్నుంచో కాచుకొని ఉంది. నెహ్రూ హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం మొదలుపెట్ట

వీకెండ్ స్టోరీ-ఏపీలో విగ్రహాల విధ్వంసకాండ ఆపాల్సింది ఎవరు?

ఏపీలో ఏ జిల్లా చూసుకున్నా విధ్వంసకాండ మాత్రం కామన్ గా మారింది. జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీశైలం నుంచి దేశప్రజలందరికీ ఆరాధ్య దైవమైన రామతీర్థం రాములవారి క్షేత్రం దాకా ఎక్కడ చూసినా మత విద్వేషం బుసలుకొడుతోంది. హిందువుల సెంటిమెంట్లను పనిగట్టుకొని గాయపరచడమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. అయినా పాలకులకు గానీ, అధికారులకు గానీ ఆ విషయాలేవీ పట్టటం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగానూ అదే రిపీటైంది.  Also Read:   తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర? Also Read:   ఒవైసీ వ్యూహం వెనుక ఏముందంటే.. పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుకొచ్చి వెక్కిరిస్తుందని సామెత. ఆ ఎలుక ఇంకా ఏం చేస్తుందో మాటల్లో చెప్పడం బాగుండదు కానీ.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి, ఆనందం అనుభవిస్తున్న సమయంలో.. ఏపీలో మాత్రం దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది సమయంలో తెల్లవారుతుందనగా రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు విరిచేశారన్న వార్త మీడియా ద్వారా ప్రపంచానికి చేరింది. అంతకు కొద్ది గంటల ముందే, డిసెంబర్ 30న విజయనగరం జిల్లా రామతీర్థం కొండమ

ఒకే కాలనీలో 12 వేల మందికి నూతన గృహాలు

విజయనగరం జిల్లాలోని గుంకలామ్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 12,301 ఇళ్లతో నిర్మించబోయే వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీకి శంకుస్ధాపన జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎం.పి.లు వి. విజయసాయి రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం.హరిజవహర్ లాల్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. 
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా