కొత్తగా ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు మహిళా నేతలకు కీలక స్థానాలు కల్పించారు. తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డి.కె. అరుణ, ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఓబీసీ మోర్చాకు బాధ్యుడిగా తెలంగాణ మాజీ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ ను నియమించారు. మొత్తానికి 12 మంది ఉపాధ్యక్షులను, 8 మంది ప్రధాన కార్యదర్శులను, ముగ్గురు జాయింట్ జనరల్ సెక్రటరీస్, 13 మంది కార్యదర్శులు, కోశాధికారిగా రాజేశ్ అగర్వాల్, 23 మంది అధికార ప్రతినిధులను నియమించారు.
అఖిల భారత ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అగర్వాల్ పేరు మీద నియామకాలు జారీ అయ్యాయి.
Comments
Post a Comment
Your Comments Please: