Skip to main content

విశ్వకర్మ పూజోత్సవానికి సిద్ధమవుతున్న బ్రహ్మగిరి


ప్రతియేటా సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు విశ్వకర్మ సామాజికవర్గమంతా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. విశ్వ సృష్టికర్త, విశ్వ రచనా దురంధరుడు అయిన విశ్వకర్మను స్మరించుకోవడం, విశ్వ జనావళి బాగోగుల కోసం సరికొత్త కార్యకలాపాల గురించి యోచించడం, ఆచరణ మార్గాలు అన్వేషించడం విశ్వకర్మల సామాజిక ధర్మం. ఇందులో భాగంగానే సౌరమానం ప్రకారం ప్రతియేటా జరుపుకునే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం గురించి చేవెళ్లలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చేవెళ్లలోని బ్రహ్మగిరిపై దాదాపు పదేళ్లుగా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, విశ్వకర్మ యజ్ఞమహోత్సవం జరుపుతున్నారు. ఈసారి కరోనా కారణంగా భారీ స్థాయిలో జరుపుకోకపోయినా.. నిర్వహణలో లోటు రాకుండా పరిమితులు పాటిస్తూ శ్రద్ధాభక్తులతో జరుపుకోవాలని చేవెళ్ల విశ్వబ్రాహ్మలు తీర్మానించుకున్నారు. మరోవైపు విశ్వకర్మ పూజోత్సవ ఏర్పాట్లలో భాగంగా వంటశాల చదును చేయడం, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడడం, గుట్టపై పెరిగిన కలుపును తీసిపారేయడం, మట్టిపని వగైరా పనుల్లో నిమగ్నమయ్యారు. అడ్వొొకేట్ బాలాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్వాహకులు లింగాచారి, మాణిక్యాచారి, శంభులింగాచారితో  పాటు స్థానిక విశ్వబ్రాహ్మణ నేతల పిల్లలు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం విశేషం. శ్రీశ్రీశ్రీ గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామి


బ్రహ్మగిరిని సందర్శించిన మిషన్ విశ్వకర్మ లీడర్స్


మిషన్ విశ్వకర్మ లీడర్స్ బృందం బ్రహ్మగిరిని సందర్శించి ఆలయ అభివృద్ధి పనులు, ఇంకా అవసరమైన కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ విశ్వకర్మ లీడర్స్ వ్యవస్థాపకుడు మావిశ్రీ మాణిక్యం, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత చేపూరి లక్ష్మణాచారి, తెలంగాణ విశ్వకర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్తోజు మధుకర్ ఆచార్య, సీనియర్ జర్నలిస్టు రమేశ్ ఆచార్య కలిసి బ్రహ్మగిరి క్షేత్రాన్ని సందర్శించినవారిలో ఉన్నారు. ఆలయ నిర్మాణానికి పూనుకున్న క్రమం, తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక విద్యుత్ విభాగం అధికారులు తమకు ఎంతో సహకరించారని, వారి సహకారంతోనే బ్రహ్మగిరి మీద గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామిని ప్రతిష్టించామని, పదేళ్ల తరువాత ఆలయం ఈ రూపంలోకి వచ్చిందని లింగాచారి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విశ్వబ్రాహ్మల్లో సహృదయులు, సేవాతత్పరులు ముందుకొస్తే జాతి గర్వించే స్థాయిలో బ్రహ్మగిరిని తీర్చిదిద్దుతామని మాణిక్యాచారి అన్నారు. బ్రహ్మగిరి క్షేత్రంలో ఇంకా విరాట్ విశ్వకర్మ, గాయత్రీమాత కొలువై ఉండగా భక్తాంజనేయస్వామి కోసం ప్రత్యేకంగా ఆలయం రూపుదిద్దుకుంటోంది. 
Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల