తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఉన్నతాశయాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని హైదరాబాద్ ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, పీజేఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి ఆకాంక్షించారు. నేటితరం విద్యార్థులు, యువకులు రేపటితరం యోగక్షేమాల కోసం పని చేసినప్పుడే ఆదర్శవంతమైన సమాజం సిద్ధిస్తుందని చేపూరి అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86 జన్మదిన వేడుకలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్ డివిజన్ తానాజీ నగర్ లో నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, సి అనీశ్ ఆచారి, తోట శ్రీనివాసాచారి, సి అభిషేక్ ఆచారి, వేణు, అశోక్, బొడ్డుపల్లి యాదగిరి ఆచారి తదితరులు పాల్గొన్నారు.
భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‌కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ. రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‌కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే
Comments
Post a Comment
Your Comments Please: