Skip to main content

Posts

ఎంబీసీల ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ

జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ కాళప్ప ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని హైదరాబాద్, ఉప్పుగూడలో అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఎంబీసీ చాంద్రాయణగుట్ట కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చేపూరి లక్ష్మణాచారి చెప్పారు. లాక్ డౌన్ కారణంగా భోజన సదుపాయాలు కరువైన దాదాపు 150 మంది నిరుపేదలు, కాలనీవాసులకు భోజన ప్యాకెట్లు పంచినెట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని లలితా బాగ్, మారుతి నగర్, ఉప్పుగూడ, తానాజీ నగర్, భయ్యాలాల్ నగర్ వాసులు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాస్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాయి బ్రాహ్మణ సంఘం నుంచి కొడిచెర్ల రమేష్, వాసవి విజయ్ కుమార్, ఏపీజే కలాం అసోసియేషన ఎగ్జిక్యూటివ్ మెంబర్, వలబోజు రవికిరణ్ చారి, శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.   Readable Article: లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?  

లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?

బెంగళూరులో ఓ మద్యం షాపు ముందు మహిళల క్యూ భీకర యుద్ధం ముగియలేదు. శత్రువు ఓటమిపాలు కాలేదు. యుద్ధంలో కూరుకుపోయిన మనకు విజయం ప్రాప్తించనూలేదు. కానీ విజయోత్సాహాన్ని మించిన వేడుక జరుగుతోంది. నెలా పదిహేను రోజులుగా చుక్క మందుకు నోచుకోని సగటుజీవి గడపదాటి తెరిపిన పడేందుకు వైన్ షాపుల ముందు క్యూ కట్టాడు. ప్రేయసిని మించిన ప్రేయసి కోసం గంటలకొద్దీ వెయిట్ చేశాడు. ఎదురుచూపులు చూసిచూసి, యుగాలతో పోల్చదగిన ఎడబాటును ఎంతో ఓర్పుతో భరించిన మందుబాబు... చుక్కమ్మను అపురూపంగా అందుకున్న అరుదైన ఘట్టం భారతావని అంతటా ఆవిష్కృతమైంది. అంతేనా? మేమేం తక్కువ, ఎందులో తక్కువ అంటూ మహిళామణులు కూడా క్యూ కట్టడం విస్తుగొలిపే అంశం.  కర్నాటక, ఏపీ, గోవా, రాజస్థాన్, యూపీ.. ఇలా అనేక రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలకు ద్వారాలు తెరిచాయి. ఒకవైపు లాక్ డౌన్ ను మూడోసారి పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధమైన మరో నిర్ణయం  తీసుకోవడం విడ్డూరం కాకపోయినా తెలివిలేని, పనికిమాలిన, సిగ్గుమాలిన నిర్ణయంగా రుజువైపోయింది. లాక్ డౌన్ కఠినతరం చేస్తూ పొడిగించడం ఏంటి? లిక్కర్ అమ్మకాలకు అనుమతులివ్వడమేంటి? మూడుసార్లు ప్రధాని మీడియా ముందుకొచ

"కరోనాతో సహజీవనమే పరిష్కారం"

శత్రువును తుదముట్టించడం సాధ్యం కానప్పుడు లేదా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు రాజీ మార్గమే పరిష్కారమనేది మన ప్రాచీన రాజనీతి. అదే సూత్రం యుద్ధనీతికీ వర్తిస్తుంది. రెండువర్గాలు ఎదురుబొదురు కూర్చొని ఏదోకటి సెటిల్ చేసుకునే సందర్భంలో ఎవరో ఒకరు తగ్గడం, ఇంకొకరు మొగ్గడం సాధారణమే. అయితే యుద్ధం మొదలై శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు ఆ శత్రువును కూడా చికాకు పరచకుండా కొంత సానుకూల వాతావరణం, కొంత అనుకూలమైన ప్రదేశం కల్పించి తనకు ఇబ్బంది రాకుండా చూస్తే శత్రువు దృష్టి మళ్లించినవాళ్లమవుతాం. తన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా చూస్తే మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. అంటే ఒకరిని ఒకరు ఇబ్బందిపెట్టకుండా ఉండడం లేదా ఒకరికొకరు భయంతో కూడిన గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చూచాయగా చెప్పారు. తాము కోవిడ్-19 ని ఎదుర్కోవాలని నిశ్చయించామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చి ప్రకటించారు కేజ్రీవాల్. కరోనాను పూర్

తెలంగాణలో మరాఠీ సినిమా - ఓ శుభారంభం

మూస కథలు, పసలేని కథనాలు, మూడు పాటలు, ఆరు ఫైట్లు అనే ట్రెండు నుంచి తెలుగు ఇండస్ట్రీ కాస్త దారి మళ్లినట్టు కనిపిస్తున్నా.. నూతన పోకడలు, లో-బడ్జెట్ లోనే సృజనాత్మకమైన ప్రయోగాలు అనే కేటగిరీస్ లో మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. తిమింగలాల వంటి బడాబాబులు ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలతో కూడిన లో-బడ్జెట్ సినిమాలకు ఇంకా సమయం రాలేదన్న నిరాశ అంతటా ఆవరించిన ఉన్న సమయంలో నూతన తరానికి మలయసమీరం లాంటి ఓ శుభవార్త వినిపిస్తోంది.  తొలితరం తెలంగాణ పోరాటయోధుడు కేశవరావు జాదవ్ మనవడు అయిన సత్యనారాయణరావు జాదవ్ రచయితగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తెలంగాణ గడ్డ మీద మరాఠీ సినిమా పూర్తి చేశారు. పతీమజాకరామతీ (నా మొగుడు చిలిపికృష్ణుడు అని  తెలుగులో సమానార్థం) విడుదలకు సిద్ధమైన క్రమంలోనే లాక్ డౌన్ రావడం వేరే విషయం. అయితే 2, 3 నెలల్లో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా హాల్స్ తెరిస్తే దీపావళి కానుకగా పతీమజాకరామతితో పాటు శెగావచరాజా అనే మరో సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు సత్యనారాయణరావు జాదవ్ చెప్పారు. ఒకవేళ లాక్ డౌన్ తెరవడం కుదరకపోతే ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్  ఫామ్ లో ఉన్న దాదాపు 160 చానల్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస

చిత్రమాలిక-వాడవాడలా వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆరాధనోత్సవాలు

రాజయోగి, అద్వైతబ్రహ్మ శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి 327వ ఆరాధనోత్సవాలు తెలుగు నేలపై శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. స్వామివారు జీవసమాధి అయిన రోజునే ఆరాధనా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగునాట వస్తున్న సంప్రదాయం. బ్రహ్మంగారు తెలుగు, కన్నడ మూలాలకు చెందిన తత్త్వవేత్త కావడం వల్ల దక్షిణభారత దేశంలో ఆయన బోధనలకు  ప్రాశస్త్యం లభించింది. తత్వవేత్తగానే గాక యోగిపుంగవుడిగా, సామాజిక న్యాయమూర్తిగా, మహిమలు చూపిన మహిమాన్వితుడిగా, కోరిన కోర్కెలు తీర్చిన దేవదేవుడిగా, కాలజ్ఞాన ప్రదాతగా, ప్రళయానంతర కాలమున వెలుగులు ప్రసరింపజేయడానికి వచ్చే పరంజ్యోతిగా.. ఇలా అనేక విధాలుగా బ్రహ్మంగారు తెలుగువారి ఇంటిల్లిపాదికీ ఇష్టదైవం.  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలో స్వామివారి ఆరాధనోత్సవాలను సామాజికదూరం పాటిస్తూ తెలుగువారు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని "శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి" రాష్ట్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు "బ్రహ్మశ్రీ వేములవాడ మదన్ మోహన్" స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి గురుపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువ

ఆఖరు కేజీ వరకు వరి కొనుగోలు చేస్తాం - మంత్రి వేముల

  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి కేజీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళనకు గురికావద్దని, రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, చెప్పుడు మాటలు విని ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు.కరోనా వైరస్ వల్ల రైతులెవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశామని, నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందని, గురువారం ఒక్క రోజే 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. అందుకు మొత్తం 355 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చామని, గురువారం 336 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు.పెట్టుకున్న అంచనాకు 30 శాతం అంటే 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ 336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సేకరించిన వరి ధాన్యంలో 92% అంటే 1.68 లక్

పేదలకు సరుకులు పంచిన ప్రణవి ఫౌండేషన్

  లాక్ డౌన్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కూలీలు, ఉపాధి లేనివారికి ప్రణవి ఫౌండేషన్ తోడ్పాటునందించింది. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత లాక్ డౌన్ కష్టాలు చుట్టుముట్టడంతో భోజన సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న పేదప్రజలు ఉండే కాలనీ మాణికేశ్వరీ నగర్, ఒడ్డెర బస్తీలో తాజాగా ప్రణవి ఫౌండేషన్ వంట సరుకులు అందజేసింది. బియ్యం, గోధుమపిండి, ఉల్లిగడ్డ, మిర్చి, పసుపు ఇత్యాది వంట సరుకులను ఫాండేషన్ సమకూర్చింది. ప్రణవి ఆధ్వర్యంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి విడతలవారీగా తాము వంటసరుకులు పంపిణీ చేస్తున్నామని, తమ ఫౌండేషన్ తో పాటు పేద ప్రజల సేవలో మరికొందరు ఔత్సాహికులు కూడా తమను ప్రోత్సహిస్తున్నారని ఫౌండేషన్ అధ్యక్షుడు జైన్ కుమార్  ఆచార్య వారికి కృతజ్ఞతలు చెప్పారు. లాక్ డౌన్ మరింతకాలం పొడిగించే అవకాశం కనిపిస్తున్నందున ఔత్సాహికుల నుంచి ఇదే తరహా స్ఫూర్తి కొనసాగాలని జైన్ కోరారు.  ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జి.శ్రీకాంత్, ఇమ్రాన్, కె.వెంకటరమణ, జి.మోహన్, ఎస్.రాధాకృష్ణ, జి.ఆనంద్ ఆచార్య, రమేశ్ నాయ క్, సామేశ్ తదితరులు పాల్గొన్నారు.