Skip to main content

లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?


బెంగళూరులో ఓ మద్యం షాపు ముందు మహిళల క్యూ


భీకర యుద్ధం ముగియలేదు. శత్రువు ఓటమిపాలు కాలేదు. యుద్ధంలో కూరుకుపోయిన మనకు విజయం ప్రాప్తించనూలేదు. కానీ విజయోత్సాహాన్ని మించిన వేడుక జరుగుతోంది. నెలా పదిహేను రోజులుగా చుక్క మందుకు నోచుకోని సగటుజీవి గడపదాటి తెరిపిన పడేందుకు వైన్ షాపుల ముందు క్యూ కట్టాడు. ప్రేయసిని మించిన ప్రేయసి కోసం గంటలకొద్దీ వెయిట్ చేశాడు. ఎదురుచూపులు చూసిచూసి, యుగాలతో పోల్చదగిన ఎడబాటును ఎంతో ఓర్పుతో భరించిన మందుబాబు... చుక్కమ్మను అపురూపంగా అందుకున్న అరుదైన ఘట్టం భారతావని అంతటా ఆవిష్కృతమైంది. అంతేనా? మేమేం తక్కువ, ఎందులో తక్కువ అంటూ మహిళామణులు కూడా క్యూ కట్టడం విస్తుగొలిపే అంశం. 


కర్నాటక, ఏపీ, గోవా, రాజస్థాన్, యూపీ.. ఇలా అనేక రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలకు ద్వారాలు తెరిచాయి. ఒకవైపు లాక్ డౌన్ ను మూడోసారి పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధమైన మరో నిర్ణయం  తీసుకోవడం విడ్డూరం కాకపోయినా తెలివిలేని, పనికిమాలిన, సిగ్గుమాలిన నిర్ణయంగా రుజువైపోయింది. లాక్ డౌన్ కఠినతరం చేస్తూ పొడిగించడం ఏంటి? లిక్కర్ అమ్మకాలకు అనుమతులివ్వడమేంటి? మూడుసార్లు ప్రధాని మీడియా ముందుకొచ్చి, ప్రతిసారీ అరగంటపాటు ఆర్ద్రంగా ఉపన్యాసమిచ్చి, ఇంట్లోనుంచి బయటకు రావద్దని చేతులెత్తి మొక్కి... ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 



కర్నాటకలోని బెల్గాంలో తొలి గిరాకీ చేస్తున్న మందుబాబుకు సన్మానం 


అటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ అమలు విషయంలోనే పూర్తిగా విజయవంతం కాలేని పరిస్థితుల్లో లిక్కర్ షాపులు బార్లా తెరిచి ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ ను మెయింటెయిన్ చేద్దామనుకుంటున్నారు? ఈ నిర్ణయం ఏ ప్రజల బాగోగుల కోసం తీసుకున్నట్టు? వలస కూలీలకు ఇన్నాళ్లూ సరిగా తిండి పెట్టక, ఎన్జీవోల సహాయంతో భోజన ఏర్పాట్లను గట్టెక్కించిన పాలకులు.. ఇప్పుడు మందు మాత్రం పోస్తున్నారంటే అర్థమేంటి? వాళ్లకు లాక్ డౌన్ కన్నా, ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కన్నా ఖజానా మాత్రమే ముఖ్యమని తెలుస్తోంది కదా. మందు లేకపోతే ప్రజల సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వాలకే శోష వచ్చేట్టు కనిపిస్తున్నమాట తేటతెల్లమైపోయింది. సరిగా ఇవాళ్టి రోజున ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో.. ఎన్నింటిని దాచిపెట్టారో.. ఎన్నింటిని కాగితాల మీదికి ఎక్కించారో.. ఎక్కించకుండా ఎన్ని కోట్ల మందిని మభ్యపెడతారో అంత ఈజీగా నిర్ధారణకు వచ్చే అంశం కాదు. మరి దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు? ఎవరి ఖాతా నుంచి రాబడతారు? లిక్కర్ ఆదాయాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటాయి? 



ఏపీ సీఎం ఏం చెబుతారు?


ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దశలవారీగా మద్యనిషేధాన్ని నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే మొదలుపెట్టారు. అటు కేంద్రం లిక్కర్ అమ్ముకోవచ్చని చెప్పిందో లేదో.. ఇక్కడ షాపులు బార్లా తెరిచారు. కిలోమీటర్ల కొద్దీ జనాలు క్యూ కట్టారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని తెలిసినా.. టెస్టుల సంఖ్యను పెంచి అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమైన జగన్ ధైర్యం.. లిక్కర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది?  అటు డాక్టర్లు కానీ, సామాజికవేత్తలు గానీ... మందు మానేయాలనుకునేవారైనా, మందును నిషేధించాలనుకుంటున్నవారికైనా ఇదే మంచి తరుణమని చెప్పడాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. 



ఏపీలో ఓ వైన్ షాపు ముందు భారీ క్యూ 


అటు యువతులు కూడా భారీ  సంఖ్యలో క్యూ కట్టారు. కర్నాటకలో వారికోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మద్య నిషేధం అమలు కావాలన్నా, ఒకచోట ఉండే షాపులు ఎత్తేయాలన్నా మహిళలతోనే సాధ్యం. ఇప్పటికే పలు మహిళా సంఘాలు సంపూర్ణ మద్య నిషేధం కోసం పని చేస్తున్నాయి. మరి  కుటుంబం పట్లగానీ, బాధ్యతల విషయంలో గానీ పురుషుల కన్నా మహిళలే సమర్థంగా వ్యవహరిస్తారన్న పేరు కాస్తా.. తాజా లిక్కర్ బ్యాన్ ఎత్తివేతతో అదంతా వట్టిదేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముందుచూపు లేకుండా తీసుకున్న లిక్కర్ అమ్మకాల నిర్ణయాన్ని రద్దు చేస్తారా..  లేక నియంత్రిస్తారా..  ఏదో ఒకటి సత్వరమే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరముంది. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటిక...