చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే గానీ.. ఆ చదువుల తల్లే ఏదో దారి చూపిస్తుందంటారు పెద్దలు. అదే జరిగింది.. కొక్కొండ కపిలాదేవి అనే ఇంజినీరింగ్ అమ్మాయి విషయంలో కపిలాదేవి టెన్త్ లో ఉన్నప్పుడే పరీక్షలకు ముందు తండ్రి చనిపోయాడు. అప్పటికే చదువులో టాప్ స్టూడెంట్ గా ఉన్న ఆ అమ్మాయికి.. తండ్రి పోవడంతో చదువులు ఎలా కొనసాగించాలో పాలుపోలేదు. కానీ పెద్ద చదువులు చదివి ఐఏఎస్ కావాలన్న ఆకాంక్ష మాత్రం ఆ అమ్మాయిలో బలంగా ఉంది. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా 'వేదాస్' అసోసియేషన్ ముందుకొచ్చి ఆ అమ్మాయికి అండగా నిలబడాలని నిర్ణయించుకుందని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాచారి భాగ్యనగర్ పోస్టుకు చెప్పారు. దాతల్ని కూడగట్టి అమ్మాయిని ప్రోత్సహిస్తే వెనుకబడ్డ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం మరో ఆణిముత్యాన్ని ఈ సమాజానికి అందించినవారు అవుతామని భావించామని.. ఈ క్రమంలో ఖమ్మం వాస్తవ్యుడు సుదర్శనాచారి ముందుకొచ్చారని నాగాచారి చెప్పారు.
సుదర్శనాచారి ప్రోత్సాహంతో గత మూడేళ్లుగా అమ్మాయి బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్య కొనసాగిస్తోందని చెప్పారు. కపిలాదేవిని దత్తత తీసుకున్న సుదర్శనాచారి ఆమెకు ఏది కావలిస్తే అది ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడటం గొప్ప విషయం అన్నారు. ఈ నాలుగో సంవత్సరంలో వేదాస్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో దాతల్ని కూడగట్టి ఈసారి 32వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఆమెకు ఇలా వేదాస్ సాయం చేయడం వరుసగా నాలుగో సంవత్సరంగా నాగాచారి చెప్పారు. అమ్మాయి ఐఏఎస్ చదవులను ప్రోత్సహించేందుకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడానికి వేదాస్ లక్ష రూపాయలు ఏర్పాటు కూడా చేస్తుందని నాగాచారి చెప్పారు. అమ్మాయి భవిష్యత్తు కోసం సహకరించిన దాతలందరికీ వేదాస్ కృతజ్ఞతలు తెలియజేస్తుందని నాగాచారి చెప్పారు.
Also Read: తెలంగాణ జాతిపిత యాదిలో..
Comments
Post a Comment
Your Comments Please: