Skip to main content

నకిలీ డీఎస్పీకి కొమ్ముకాస్తున్న అస్లీ ఖాకీలు

కర్నూల్, భాగ్యనగర్ పోస్ట్ ప్రతినిధి: శ్రీశైల మహాక్షేత్రంలో  గత సం డిసెంబర్ 31 రాత్రి నకిలీ డీఎస్పీ రజాక్ అనుచరులు శ్రీశైలం వచ్చిన భక్తులపై దాడి చేశారు. ఆ దాడిలో భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తే,  ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 323, 324, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసుల దుర్బుద్ధి, దురుద్దేశాలు ఇక్కడే బయట పడుతున్నాయంటున్నారు బాధిత భక్తులు. మారణాయుధాలతో దాడులు చేసి, రక్తాలు కారేలా కొట్టి, చంపడానికి యత్నిస్తే.. హత్యా యత్నాన్ని సూచించే 307 పెట్టకపోవడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఆ రాత్రి శ్రీశైలంలో నకిలీ డీఎస్పీ అనుచరులు నానా బీభత్సమే సృష్టించారు. ఓ సత్రంలోని రెండో అంతస్తు నుంచి ఓ వ్యక్తిని తోసేశారు. బాధితుణ్ని  హుటాహుటిన ప్రాజెక్ట్ వైద్యశాలకు తరలించారు. తనను ఎవరు ఏం చేశారు.. ఎలా గాయాలయ్యాయో.. పోలీసుల సమక్షంలో, వైద్యుల ముందే బాధితుడు చెబుతున్నా అతని వాంగ్మూలాన్ని మాత్రం పోలీసులు రికార్డు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో తీయకపోవడం, స్టేట్మెంట్ ఫైల్ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తక్షణం జిల్లా యంత్రాంగం ఈ సంఘటనలపై విచారణ చేపట్టాలని బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరోవైపు ఈనెల 3న రాత్రి నకిలీ డీఎస్పీ రజాక్ అనుచరులు మద్యం సేవించి ముగ్గురు యువకులపై దాడి చేశారు.  ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు మాత్రం పెట్టలేదు. నకిలీ డీఎస్పీ రజాక్ ప్రభావానికి లోనైన సీఐ రమణ  ఫిర్యాదు చేసినవారినే బెదిరింపులకు గురి చేసి రజాక్ అనుచరులకు, అల్లరిమూకలకు అండగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాక.. రజాక్ కు బాహాటంగా కొమ్ముకాస్తూ.. ఫిర్యాదు గనక వాపసు తీసుకోకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తానని, రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని తమనే బెదిరించారని బాధితులు వాపోతున్నారు.  ఈ విషయంలో టూటౌన్ ఎస్సై నవీన్ బాబు మరుసటి రోజు స్టేషన్కు పిలిపించుకొని ఫిర్యాదుదారులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కేసు పూర్వాపరాల జోలికి వెళ్లకుండా తమ పైనే ఐపిసీ 160 సెక్షన్ బనాయించారని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై కర్నూలు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులు నకిలీ పోలీసుల పేరుతో ప్రజల్ని పీడించేవారికి కొమ్ముకాయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.