Skip to main content

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు. 

ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక్ మనిపిస్తాడు. ఈ విషయంలో అధికారులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అసలు కారణం వారు చూసీ చూడనట్టు వదిలేయడం కాదనీ.. దేవస్థానం ఉన్నతాధికారులు ఆనంద్ తో కుమ్మక్కై తలా కొంత సొమ్ము పంచుకునే అవగాహనతోనే లైట్ తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలో ఎంతటి వీఐపీలు వచ్చినా ఎవరికీ ప్రైవేటుగా వీడియోలు గానీ, ఫొటోలు గానీ అనుమతించరు. కానీ దలారీ ఆనంద్ తల్చుకుంటే భక్తులకు స్పెషల్ దర్శనాలు చేయించి వారు కోరిన చోట ఫొటోలు తీసి పెడుతూ  సొమ్ము చేసుకుంటున్నాడు. పలువురు బుల్లితెర నటులు సైతం ఆనంద్ ఆశీర్వాదంతో స్వామివారి  ఆలయంలో ఫొటోలను తమ ఆల్బమ్స్ లో పెట్టుకుంటున్నారు. ఆలయంలో మూలవిరాట్ల ప్రదేశాల్లో, మండపాలలో, స్వామి స్వర్ణగోపురం ప్రదేశాల్లో, అమ్మవారి  బంగారుగోపురాలు  కనిపించే విధంగా ఫోటోలను తీసి ఒక్కో ఫొటోకు రూ. 500/-లు, ఆ పైనే తీసుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు. ఆ వచ్చిన సొమ్మును ఆలయ అధికారులు, సీయస్వో భాగాలు వేసుకొని పంచుకుంటున్నారని స్ధానికులు అనుకుంటున్నారు. మరి ఓ దళారీ చేతిలో పవిత్రమైన మల్లన్న పరువు కాస్తా మంట గలుపుతున్న  ఆలయ అధికారులు ఇకనైనా.. నిబంధనలు పాటించి ఆలయ పవిత్రతను కాపాడుతారా?  ఓ అవకాశం ఇచ్చి వేచి చూద్దాం అంటున్నారు మల్లన్న భక్తజనం. 

Comments

Popular posts from this blog

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తి

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరా

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే