Skip to main content

వీరబ్రహ్మేంద్రస్వామినే అటకాయిస్తున్న ప్రబుద్ధులు

తెెలుగునాటనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే కాలజ్ఞాన కర్తగా, భవిష్యత్ దార్శనికుడిగా సకల సమాజం చేత పూజలందుకునే యుగపురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమే. అలాంటిది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సాక్షాత్తూ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కుంటాల మండలం కల్లూరు గ్రామంలో మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి 40 ఏళ్లకు పైగా పూజలు జరుగుతూ వచ్చాయి. అయితే స్వామివార్ల విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకోవడంతో.. అలాంటి విగ్రహాలకు పూజలు చేయరాదన్న నియమాల కారణంగా ఆ విగ్రహాలను పక్కన పెట్టారు. అలా దాదాపు తొొమ్మిదేళ్లుగా వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యపూజలు ఆగిపోయాయి. స్వామివార్ల విగ్రహాలు మళ్లీ పునఃప్రతిష్టించడానికి అవసరమైన వనరుల కొరత కారణంగా ఆ  విషయం వాయిదా పడుతూ వస్తోంది. అయితే అదే విగ్రహాలున్న చోట ఖాళీగా ఉంచడం ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితమే దేవీ నవరాత్రులకు అంకురారోపణ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రతియేటా దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నారు. 

ఇటీవల కల్లూరు గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ, శివలింగం, గణపతి, సిద్ధయ్య తదితర విగ్రహాలు కొత్తవి తీసుకొచ్చి అక్కడ పునఃప్రతిష్ట చేసేందుుకు పూనుకున్నారు. అయితే తమ ఈ ప్రయత్నాన్ని గ్రామంలోని కొందరు యువకులు అడ్డుకుంటున్నారని, అక్కడ బ్రహ్మంగారి గుడి పునరుద్ధరించడానికి వీల్లేదని గొడవ పడుతున్నారని ఆ గ్రామంలోని పలువురు విశ్వబ్రాహ్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక కుంటాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే... అక్కడ బ్రహ్మంగారి గుడిపై అభ్యంతరాలున్నాయని, కాబట్టి ఆ ప్రయత్నం విరమించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారని, ఇదేం న్యాయమని వారు వాపోతున్నారు. 

అయితే ఆ స్థలం విశ్వబ్రాహ్మణులకు చెందిందేనని ఊరందరికీ తెలుసని, తమ స్థలమే అయినా అమ్మవారి నవరాత్రోత్సవాలను తామంతా కలిసి ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నామని, కానీ ఇదివరకు ఉన్నట్టు బ్రహ్మంగారి విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే తమను అడ్డుకోవడం బాధగానే కాక అవమానంగానూ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని బ్రహ్మంగారి స్థలంగానే ఊరివారంతా చెప్పుకోవడం విశేషం. బ్రహ్మంగారి విగ్రహాలు ఏర్పాటు చేయటానికి విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కారణంగా పూజాదికాలకు అంతరాయం ఏర్పడిందని వారంటున్నారు. 50 సంవత్సరాల క్రిందట విశ్వబ్రాహ్మణుడైన ఆకోజి వెంకటస్వామి (స్వర్ణకార వృత్తి), రామిస్వామితో పాటు సైకిల్ టాక్స్ తో జీవనోపాధి పొందే మరో విశ్వబ్రాహ్మణుడు, హోటల్ నడుపుకునే మరో వ్యక్తి కల్లూరులో నివాసం ఉండేవారు. ఆర్థికపరమైన, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రామస్వామి కమ్మర్పల్లి గ్రామానికి వలస వెళ్ళగా మిగతావారు రామ్  టెక్ వెళ్లారు. దీంతో అక్కడ బ్రహ్మంగారి విగ్రహాలను పట్టించుకునేవారు కరవయ్యారు. ఆ విధంగా పూజలకు నోచుకోని విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకున్నాయి. మళ్లీ ఇప్పుడు తమ విగ్రహాలను తాము ప్రతిష్టించుకుంటే అవగాహన లేని కొందరు యువకులు తమను అడ్డుకోవడం సరైంది కాదని వారంటున్నారు. దీనిపై విశ్వబ్రాహ్మణ నాయకులు, సంఘాలు తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. 

Comments

Popular posts from this blog

15 నిమిషాలు.. 15 కోట్లు.. ప్రమాదం ముంచుకొస్తోంది

Photo Credit: ANI, Public Radio International, Swarajya పదిహేను నిమిషాలు టైమిస్తే హిం.... లను ఊచకోత కోసేస్తాం. ఈ దేశంలో ముస్లింలు 15 కోట్ల మంది ఉన్నారు గుర్తుంచుకోండి. వాళ్లంతా రోడ్ల మీదికొస్తే వంద కోట్ల మంది కూడా ఏం చేయలేరు.. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రెండు డైలాగులు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) నేతల నుంచి వచ్చాయి. మొదటిది కొన్నేళ్ల క్రితం అక్బరుద్దీన్ నోటి నుంచి వచ్చిందైతే.. రెండో వార్నింగు ఈ మధ్యాహ్నం, కాసేపటి క్రితమే (20--2-2020) కర్నాటకలో జరిగిన ఒక మీటింగ్ లో అసదుద్దీన్ సమక్షంలోనే ఆ పార్టీ మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ నోటి నుంచి వెలువడింది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని రాజకీయ నేతల గురించి మాట్లాడుకోవడం వృథా. కానీ.. అన్నీ ఉండీ అన్నీ మూసుకునే జర్నలిస్టుల గురించి, వారి మౌనం గురించి మాట్లాడుకోవాల్సిన తరుణం మాత్రం ఇదే.  15 నిమిషాలు టైమిస్తే ఒకడు కోటానుకోట్ల మందిని ఊచకోత కోసేస్తానని బహిరంగ సమావేశంలోనే అంటాడు. మేం 15 కోట్ల మందిమి ఉన్నాం.. ఏమనుకుంటున్నారో అంటూ ఇంకొకడు హుంకరిస్తాడు. టెక్నికల్ గా వీళ్లంతా ఈ దేశ పౌరులే కానీ.. ఎథికల్ గా వీళ్లు టెర్రరిస్టులకు

ముంబైలో మొదలైంది.. హైదరాబాద్ వైపు కదిలింది

దేశంలో అగ్రగామి వాణిజ్యవేత్తగా, ప్రపంచంలోని వంద ప్రభావశీలుర జాబితాలో ఒకడిగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యాపారంలో వైరి వర్గాలను ఊచకోత కోస్తున్నారు. ముఖేశ్ మొదలుపెట్టిన ఊచకోత మరింత తీవ్రరూపం దాలుస్తోంది. భారతీయ మార్కెట్లో ఓ నూతన శకాన్ని కూడా ఆరంభించడం ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టెలికాం రంగంలో ఓ మోస్తరు కంపెనీలను సైతం జియో బిస్తరు సర్దుకునేలా  చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీ డాటా ఆఫర్ తో ఇండియా ప్రజానీకాన్ని అంతర్జాల ప్రియులుగా మార్చేసిన జియో… అది ఇస్తున్న పోటీకి భారతీ ఎయిర్ టెల్, ఐడియా-వొడాఫోన్ వంటి పెద్ద కంపెనీలను బేజారెత్తిస్తోంది. బకాయిలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఆ రెండు కంపెనీలు కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ రంగంలో జియో అప్రతిహతంగా దూసుకెళ్లడానికి ఆటంకాలేవీ లేవనే చెప్పాలి.  టెలికాం రంగంలో బీభత్సం సృష్టిస్తున్న రిలయన్స్.. ఈ-కామర్స్ లోనూ అడుగు పెట్టేందుకు కొన్నేళ్ల క్రితమే పెద్దఎత్తున కసరత్తు చేసింది. ఆ విషయం మార్కెట్ కు ఇంకా బయటకు పొక్కకముందే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి టాప్ ఈ-క

ఆవు పేడతో చెప్పులు.. త్వరలో మార్కెట్‍లోకి

Main Story:   జానారెడ్డికి గవర్నర్‍గిరీ? Also Read:   పాక్ మెడలు వంచిన రోజు ఇదే   Also Read:   ఎంఐఎంతో పొత్తుకు తహతహ ఇందుకేనా? Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ఆవు పేడ ఏంటి.. చెప్పుల తయారీ ఏంటి.. అనుకుంటున్నారు కదా. మీరు వింటున్నది నిజమే. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆవుకు మంచి డిమాండే ఉంటుందని ఊహించవచ్చు. హైదరాబాద్ లో ఉంటున్న అమిత్ భట్నాగర్ దాదాపు 20 ఏళ్లకు పైగా పంచగవ్య చికిత్స విషయంలో పని చేస్తున్నారు. తాను తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చాలా మంది గో ప్రేమికులు, ఆత్మీయ సహచరులు పాలుపంచుకుంటున్నారని భట్నాగర్ చెబుతారు . ఆవు విసర్జితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేయాలన్నదే అమిత్ భట్నాగర్ సంకల్పం. హైదరాబాద్ తో పాటు పాత కరీంనగర్ జిల్లాలోని మంథనిలో వీరి ఆధ్వర్యంలో గోశాలలు నడుస్తున్నాయి. అంతేకాదు.. రాజస్తాన్ లో వీరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గో ఉత్పాదనల ప్రాజెక్టు నడుస్తోంది.  వీరి రీసెర్చ్ వల్లే ఆవు పేడ నుంచి అనేక కొత్త రకాల ఉత్పాదనలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఆవు పేడ నుంచి అందరూ ఆశ్చర్యపోయేలా కాగితాన్ని తయారు చేశా