Skip to main content

రేపటి ఉద్యమానికి నేటి నుంచే సిద్ధం కావాలి: చెల్లోజు రాజు


ఉపాధి దెబ్బతిని, కుటుంబాలు అల్లకల్లోలమవుతున్న తరుణంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని, ప్రభుత్వాలు తమవైపు దృష్టి సారించేదాకానైనా తమ జాతిలో ఔదార్యం గలవారు ముందుకు రావాలని, వృత్తిపనులకు దూరమైన పేద విశ్వబ్రాహ్మల్ని ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పలు పేద కుటుంబాలకు విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించినట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ఆదేశాల మేరకు, కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ఇల్లంతకుంటలో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశానికి మండల విశ్వబ్రాహ్మల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. 

తమ జాతి ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నారని, తెలంగాణ వచ్చిన తరువాత అనేక కులాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నా.. విశ్వబ్రాహ్మలు మాత్రం వివక్షకు గురవుతున్నారన్నారు. ఎందరో విశ్వబ్రాహ్మణ సోదరులు ఆత్మహత్యలకు పాల్పడ్డా వారి కుటుంబాలకు కనీస పరామర్శ సైతం దక్కడం లేదన్నారు. మరోవైపు ఇప్పటివరకు తమ జాతిలో అనేక సంఘాలు ఉనికిలో ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, ఒకే ఒక ఐక్య సంఘం ఆధ్వర్యంలో  సరైన మార్గదర్శనం కింది స్థాయిదాకా అందుతుందన్నారు. ఐక్యసంఘం ఆధ్వర్యంలో వివిధ దశల్లో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని, తమకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞాపనలు అందించే ప్రక్రియ పూర్తయిన తరువాత ఉద్యమాల బాట పట్టాల్సి ఉంటుందని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గాన్ని రాజు అప్రమత్తం చేశారు. 

స్వప్రయోజనాల కోసమో, స్వార్థం కోసమో తాము సంఘ బాధ్యతలు తీసుకోలేదని, జాతి పట్ల పూర్తి సానుభూతితోనే పని చేయడానికి ముందుకొచ్చామన్నారు. అదే విధంగా కింది స్థాయిలో కూడా ప్రజలు తమకు తోచినవిధంగా సంఘం అభివృద్ధి కోసం పనిచేసి హక్కులు సాధించుకోవాలన్నారు. డబ్బున్నవారు డబ్బు, సమయం ఉన్నవారు సమయం, ఆలోచన ఉన్నవారు ఆలోచనలు ప్రజలతో పంచుకుంటే అనుకున్న లక్ష్యాన్ని త్వరలోనే సాధించుకోగలమన్నారు. 1969 కన్నా ముందు నుంచే తెలంగాణ కోసం పోరాడితే.. అది కేసీఆర్ హయాం నాటికి ఫలించిందని, అలాగే విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఈనాటి తరం కృషి చేస్తే వచ్చేతరం లబ్ధి పొందుతుందని, తెలంగాణ సాకారమే అందుకు ఓ నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పాములపర్తి వేణుగోపాల్, స్థానిక అధ్యక్షుడు ఊకంటి మల్లాచారి, ప్రధాన కార్యదర్శి అప్పాల సురేశాచారి తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  Also Read:  విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా? అలాంటి మహా పండితుడికి తగిన గుర్తి

బీజేపీ విజయానికి దూసుకొస్తున్న కొత్త నినాదం

ప్రతి జాతీయ ఎన్నికలోనూ సరికొత్త నినాదంతో విజయాలు నమోదు చేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. మోడీ, అమిత్ షా నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ పార్టీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరింత వినూత్నంగా ప్రచారానికి ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీ ఈసారి సృజనాత్మకమైన కన్సల్టెంట్లను రంగంలోకి దింపుతోంది.  అందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ప్రచార బాధ్యతలను ప్రముఖ కన్సల్టెంట్ దుర్గా స్థపతి చేపట్టారు. హైదరాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేస్తూ రాజకీయ కన్సల్టెంట్ గా కొనసాగుతున్న దుర్గాస్థపతి ఆచార్యకు ఈటల రాజేందర్ తమ పార్టీ జాతీయ స్థాయి ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా "యూత్ విత్ మోడీ - బూత్ విత్ మోడీ" అనే ఆకర్షణీయమైన ఎన్నికల నినాద అస్త్రాన్ని ఈటల ఆవిష్కరించారు. అలాగే "ఈటలతో మనమందరం -  అవుతుంది ప్రతి ఇల్లూ రామమందిరం" అనే మరో ఆకర్షణీయమైన క్యాప్షన్ ని కూడా సోషల్ మీడియాలోకి వదిలారు ఈటల. ఈ నినాదాలు అర్థవంతంగా ఉండడమే గాక.. ఎంతో ఆకట్టుకుంటున్నాయని, ప్రజల్ని ఆలోచింపజేస్తాయన్న నమ్మకం తనకు

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత