Skip to main content

ఈటల ప్లేస్ లో భర్తీ అయ్యేది ఇతనేనా?


ఈటల రాజేందర్ సొంత  నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ హుజురాబాద్‌లో ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ స్థానిక‌ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వారం క్రిత‌మే పెద్దిరెడ్డి కేసీఆర్‌ను క‌లిసిన‌ట్టుగా స‌మాచారం. దీన్ని బ‌ట్టి ఈటల‌ను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.ఈటలను వెళ్లిన వెంటనే పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు. ఈటలను బయటకు పంపించి పెద్దిరెడ్డికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ బాధ్యతలు  అప్పజెప్పాలనే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో పెద్దిరెడ్డి.. మంత్రిగానే కాకుండా టీడీపీ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత దేవేంద‌ర్ గౌడ్‌తో క‌లిసి న‌వ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని ప్ర‌జారాజ్యంలో విలీనం చేశారు. కొన్నాళ్లు మ‌ళ్లీ టీడీపీలోకి తిరిగివ‌చ్చారు. తెలంగాణ వ‌చ్చాక టీడీపీ బ‌లం త‌గ్గిపోవ‌డంతో.. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీలో చేరారు.

నిజానికి ఈట‌ల రాజేంద‌ర్ ను చాలా రోజులుగానే దూరం పెడుతున్నారు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఏర్పాటు చేసిన కేబినెట్ లో ఈటలకు మొదట చోటు దక్కలేదు. ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో ఈటలకు అవకాశం కల్పించారు కేసీఆర్. ఈటలకు మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని, ఉద్యమకారులను దూరం పెట్టారనే ఆరోపణలు ఎక్కువ కావడంతో బలవంతంగానే ఆయన్ను తీసుకున్నారని చెబుతున్నారు. మంత్రిపదవి ఇచ్చినా ఈటలతో కేసీఆర్ గ్యాప్ కొనసాగిందని తెలుస్తోంది. చాలాకాలం పాటు ఈటలకు కేసీఆర్ .. అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీ జరిగిన సమయంలో ప్రగతి భవన్‌కు వెళ్లి రెండు గంటలు వెయిట్ చేసినా.. ఈట‌ల‌కు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేద‌ని తెలుస్తోంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈటలకు హుజురాబాద్ అసెంబ్లీ టికెట్ రాదనే ప్రచారం జరిగింది. తన భార్యకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి... తాను కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఈటల అడిగినా కేసీఆర్ పట్టించుకోలేదంటారు. అయితే చివరి నిమిషంలో ఈటలకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికలో కొందరు టీఆర్ఎస్ నేతలు ఈటలకు వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. పార్టీ పెద్దల ఆశిస్సులు ఉన్న నేతలే ఇలా చేశారని ఈటల బహిరంగానే చెప్పారు. ఆ కోపంతోనే పలు సార్లు రాజేందర్.. టీఆర్ఎస్ , కేసీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లమని ఏడాది క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడే ఈటలను సాగనంపాలని కేసీఆర్ డిసైడయ్యారని, సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్ కల్లోలం లేకుంటే ఏడాది క్రితమే ఈటలను సాగనంపే వారంటున్నారు.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత