Skip to main content

తలసాని ఇలాకాలో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్


దేశంలోనే తెలంగాణను అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ని చేస్తున్నారని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 5 కోట్ల‌తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు బ్యాడ్మింట‌న్ కోర్టులు, లేడీస్ జిమ్‌, యోగా హాల్‌, స్నూక‌ర్ రూమ్‌, క్యార‌మ్స్, జెంట్స్ జిమ్, టేబుల్ టెన్నిస్ ఆడుకునేందుకు స‌దుపాయాలు క‌ల్పించారు. సనత్ నగర్ నెహ్రూ పార్కులో థీమ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంత‌కుముందు బ‌ల్కంపేట‌లో రూ. 3.60 కోట్ల‌తో నిర్మించిన వైకుంఠ‌ధామాన్ని ప్రారంభించారు. 


స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు, అవ‌స‌రాలు తెలుసుకుని వాటిని తీర్చేవారే అస‌లైన నాయ‌కులని కేటీఆర్ అన్నారు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రాష్ర్టం ఏర్ప‌డ్డ స‌మ‌యంలో అనేక అనుమానాలు ఉండేవి. అప్పుడు క‌రెంట్ ఉంటే వార్త‌.. నాడు నీళ్లు వ‌స్తే వార్త‌. అప్పుడు సుస్తీ చేస్తే ఎక్క‌డికి పోవాలో తెలియ‌ని ప‌రిస్థితి. కానీ తెలంగాణ ప్ర‌భుత్వంలో అలాంటి స‌మ‌స్య‌లు లేవు. 24 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ప్ర‌తి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. పేద‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం.. ఇలా హైద‌రాబాద్‌లో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు.


తెలంగాణ‌ను భారత‌‌దేశంలోనే అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాల‌నే ఉద్దేశంతో సీఎం ప‌ని చేస్తున్నారు. రాష్ర్టం రెవెన్యూను పెంచాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని ఉద్ఘాటించారు. పేద‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాల రూపంలో ఆ ఆదాయాన్ని అందించాల‌న్న‌దే సీఎం ఉద్దేశం అని కేటీఆర్ తెలిపారు. పేద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. క‌రోనా వైర‌స్‌, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అర్హులైన‌ పేద‌ల‌కు త‌ప్ప‌కుండా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను పంపిణీ చేస్తామ‌న్నారు. పేద‌వారికి స్థ‌లాలు ఉండి ప‌ట్టాలు రాని వారు ఉన్నారు. గ‌తంలో జీవో నం. 58, 59 కింద కొంత‌మందికి ఇచ్చాం. మిగ‌తా స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.


 


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత