ఆపదల్లో అప్రమత్తం చేసి, ప్రమాదాల నుంచి తప్పించి, విధుల్లో విజయాలు అందించి, మెడల్లో మెడల్స్ వేయించి.. అడుగడుగునా గర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసిన ఆ పోలీసుల సహచరి వారి నుంచి శాశ్వతంగా దూరమైంది. చేతుల్లోనే పెరిగి, పెట్టింది తిని, అప్పజెప్పిన టాస్క్ ను అద్భుతంగా పూర్తి చేసిన లియో అనే స్నిఫ్ఫర్ డాగ్ అకాలంగా చనిపోవడంతో మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా ఏర్పడినప్పుడే జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్, జిల్లా కార్యాలయానికి నూతన సిబ్బందితో పాటు లియో అనే పోలీస్ జాగిలం కూడా పోలీసులతో పాటే అడుగు పెట్టింది. లియో పేరు చెపితే నిందితులకు, సంఘ విద్రోహులకు ముచ్చెమటలే. ఆ జాగిలం ప్రత్యేకతే వేరు. పోలీసులు ఛేదించలేని నేరాలు సైతం ఈ పోలీసు జాగిలం కనిపెడుతుందని గొప్పగా చెబుతున్నారు. లియో జిల్లాకు వచ్చిన్నటి నుంచి తన విధి నిర్వహణలో భాగంగా మేడారంలో ఏర్పాట్లు, సీఎం భద్రతా పర్యవేక్షణ విధులు, నేరస్తులను పట్టకోవడం... ఇలా తన పాత్ర భేషంటున్నారు పోలీసు అధికారులు. ఆర్మ్డ్ రిజర్వ్ లో పోలీసు ఉన్నతాధికారి అయిన డీఎస్పీ జనార్దన్ రెడ్డి... లియో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగిందని, తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సేవలందించిన లియో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదని... దాని సేవలు గుర్తు చేసుకుని విలపించారు. శనివారం రాత్రి లియో కాలం చేయడంతో పోలీసు లాంఛనాల మధ్య జాగిలానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర
Comments
Post a Comment
Your Comments Please: