Skip to main content

ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ - ఫొటోలు ఇవే



 


ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అటు సమాంతరంగా అదే ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. సిర్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. 


Read also: ఆ మావోయిస్టుపై రూ. 8 లక్షల రివార్డు



డిస్ట్రిక్ట్ వలంటీరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా తుమిడిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్లా గ్రామ సమీపంలోని అడవుల్లో కూబింగ్ నిర్వహించింది. ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా... పలువురు తప్పించుకున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందినవారిలో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది. ఘటనా స్థలంలో ఇన్సాస్ రైఫిల్, నాటు తుపాకీ, వివిధ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టులపై గతంలో ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. వీరు బంశధార-ఘుముసారా-నాగావళి (బీజీఎన్) డివిజన్‌కు చెందిన మావోయిస్టులగా గుర్తించారు. 



క్రితంరోజే ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో కోటె అభిలాష్ అనే మావోయిస్టు చనిపోగా మరుసటి రోజే మరో ఎన్ కౌంటర్ జరగడం గమనించాల్సిన అంశం. ఒడిశాలో జరిగిన తాజా ఎన్ కౌంటర్ కు ముందు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు చేరడంతోనే కూంబింగ్ ఆపరేషన్ కట్టుదిట్టంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల వైపు భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. 



 


Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో