Skip to main content

కైలాసనాథుడి చెంతకు ఇకపై రోడ్డు మీదుగా..


హిమాలయాల్లోని మానసరోవరానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన ముందడుగు వేసింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ వద్ద లింక్ రోడ్డు వేయడంతో కైలాస మానసరోవరానికి మరింత సులభంగా వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. ఈ చర్యతో టూరిస్టులకు ఢిల్లీ నుంచి మానసరోవారం అత్యంత సమీపానికి నేరుగా బస్సులోనే వెళ్లే అవకాశం ఏర్పడింది. ప్రతి సంవత్సరం మానసరోవరానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుమతిస్తారు. ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ లింక్ రోడ్డు ద్వారా టిబెట్ భూభాగంలో ఉన్న మానసరోవరాన్ని నేరుగా సందర్శించవచ్చు. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో హిందువులు పోటీపడుతుంటారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పూర్తయిన ఈ రోడ్డు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. లిపులేఖ్ పాస్ నుంచి మానసరోవరం 90 కి.మీ. దూరంలో ఉంటుంది. రోడ్డుమార్గం ప్రారంభంలో రాజ్ నాథ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానసరోవరానికి మొదటి జట్టు భక్తుల యాత్రకు రాజ్ నాథ్ జెండా ఊపారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఈ రోడ్డును పూర్తి చేసింది. ఈ పని చేసినందుకు రాజ్ నాథ్ బీఆర్వోను అభినందించారు. లిపులేఖ్ పై వివాదం


భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ ద్వారం గుండా టిబెట్ లోకి, చైనాలోకి ప్రవేశించవచ్చు. అయితే లిపులేఖ్ పాస్ నేపాల్ అధీనంలో ఉంది. నేపాల్ ప్రభుత్వానికి అధికారిక సమాచారం లేకుండానే భారత్ ఈ రోడ్డు మార్గం నిర్మించిందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఢిల్లీలోని నేపాల్ ఎంబసీలో గల ఉన్నతాధికారుల ద్వారా నేపాల్ ప్రభుత్వానికి సమాచారం ఉందని, దీనిపై చాలా ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయని భారత్ పేర్కొంది. లిపులేఖ్ నుంచి రోడ్డు మార్గం నిర్మాణానికి 1997లోనే ద్వైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఆ తరువాత 2015లో కూడా ప్రధాని మోడీ హయాంలో ఈ చర్చలు జరిగాయని.. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియ పూర్తయిందని భారత విదేశీ వ్యవహారా నిపుణులు చెబుతున్నారు. అయితే తమకు ఢిల్లీలోని నేపాల్ ఎంబసీ ద్వారా సమాచారం ఉన్నప్పటికీ.. రోడ్డు నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియదని, ఆ నోట్ వచ్చాక అధికారికంగా స్పందిస్తామని నేపాల్ చెబుతోంది. 


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల