Skip to main content

బీ అలర్ట్ - రేపు రాత్రి 9 గంటలకు అసద్ భాయి అంతరంగం


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు అనగా గురువారం రాత్రి 9 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకొచ్చి మాట్లాడతానని, దాన్ని అందరూ ఫాలో అవ్వాలని స్వయంగా ట్వీట్ చేశారు. కరోనా కలకలం మన దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో అసద్ భాయి ఏం చెబుతారన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. 


తబ్లిగీలను మోటివేట్ చేస్తారా? మోడీ మీద మాటల దాడితో సరిపెడతారా?
నిజాముద్దీన్ లోని మర్కజ్ కు వెళ్లొచ్చిన తబ్లిగీలతో కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాపించిందన్న విషయం తేలిపోయిన క్రమంలో తబ్లిగీలను గుర్తించి, క్వారంటైన్ కు తరలించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. స్వచ్ఛందంగా డాక్టర్లను సంప్రదించి పాజిటివ్ అని తేలినట్టయితే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని పౌర ప్రపంచంలోని అన్నివర్గాల ప్రజలూ అభ్యర్థిస్తున్నారు. అయినా ఇప్పటికీ పలువురు తబ్లిగీలు అజ్ఞాతాన్ని వీడడం లేదన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి. అంతేకాదు... గుర్తించి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న తబ్లిగీలు సైతం డాక్టర్లకు సహకరించకపోవడం ఒక్కటే కాదు.. భౌతికదాడులకు దిగుతున్నారు. పరుషంగా, రాయడానికి వీల్లేని భాషలో మాట్లాడుతున్నారు. మహిళా వైద్యసిబ్బందితో దురుసుగా ప్రవర్తించడమే కాక అసభ్యంగా, అనాగరికంగా బిహేవ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు స్వయంగా వైద్యసిబ్బందే చేయడం గమనించాలి. తాజాగా ఢిల్లీలోని ద్వారకాలో గల క్వారంటైన్ సెంటర్లో మూత్రం నింపిన బాటిళ్లను బయటికి విసిరారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఎవరన్నది ఇంకా గుర్తించకపోయినా ఎఫ్ఐఆర్ మాత్రం బుక్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తి కోసమే ఇలా చేశారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇక నరేలా క్వారంటైన్ సెంటర్లో పలువురు తబ్లిగీలు ఆస్పత్రి పరిసరాల్లో, వరండాల్లో బహిరంగ మలవిసర్జన చేసి వాతావరణం అంతా పాడు చేస్తున్నారని, చికిత్సకు సహకరించడం లేదని, క్వారంటైన్ సెంటర్లోకి ఎవరినీ రాకుండా చేస్తున్నారన్న ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మహిళా సిబ్బందిని చూసి వెకిలిగా ప్రవర్తించడం, కొందరైతే బట్టలు విప్పుకొని మరీ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులొస్తున్నాయి. 


Readable links:  తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు 


                      డాక్టర్లపై దాడులు జరుగుతున్నది ఇందుకేనా?


గాంధీలో కూడా జరిగింది ఇదే
ఒక్క ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కూడా తబ్లిగీల ప్రవర్తన ఇలాగే కనిపించడం గమనించాల్సిన అంశం. అటు నిజమాబాద్ లో వైద్య సిబ్బందికి ఎలాంటి ట్రీట్ మెంట్ జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభుత్వాధికారుల మీద రాళ్ల దాడి సరేసరి. కొందరి వల్ల యావత్ ముస్లిం సమాజానకే చెడ్డపేరు వస్తోందని చాలా మథనపడుతున్న ముస్లింల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. వారికి సద్బుద్ధి కలగాలని అల్లాను ప్రార్థిస్తూ తలనీలాలు సమర్పించుకున్న (తలనీలాలు సమర్పుంచుకోవడం హిందువుల్లో మాత్రమే కాదు.. ముస్లింలలో కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు) జర్నలిస్టుల ఉదంతాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఈ క్రమంలో గురువారం షబ్-ఎ-బరాత్ ను పురస్కరించుకొని రాత్రి 9 గంటలకు అసదుద్దీన్ ఏం మాట్లాడతారన్నది దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. తెలిసో, తెలియకో కరోనా బారినపడ్డ సోదర ముస్లింలను చికిత్సకు సహకరించాలని, రోగాన్ని అంటించుకోవడం కన్నా ఇతరులకు అంటించడం మహా పాపమని, ఖురాన్ లో ఆ విధంగా ఎక్కడా లేదని, అలాంటి చర్యలను అల్లా సహించడని కన్విన్స్ చేసి కళ్లు తెరిపిస్తారా? లేక.. తమ సోదర వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని, దీన్ని మానుకోవాలని, ఎందరో ముస్లింలు ఈ దేశం కోసం పాటుపడ్డారంటూ పాతపాటలే పాడతారా అన్నది ఆసక్తి గొలుపుతోంది. బాధ్యతగా మాట్లాడతారా.. తమ బాధ్యతను ఇంకొకరి చేతగానితనంగా చూపిస్తారా వేచి చూడాలి. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.