Skip to main content

కరోనా వైరస్ శరీరంలో చేరితే ఏమవుతుంది?


 

కరోనా వైరస్ వ్యాప్తి వెనుక భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ఇంత పెద్ద నష్టం కలిగిస్తుందా అనిపిస్తుంది. కానీ అది నిజం. 

కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను శ్వాస లోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు కళ్ళు , ముక్కు , నోటి ద్వారా ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. మొదట గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బు వున్నట్టు తెలీదు. మరి కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంటుంది. కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి కొద్ది ఇన్‌ఫెక్షన్‌గా ఉంటుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు. ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. కానీ తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు. ఈ వ్యాధి వచ్చినప్పుడు న శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కు ప్రతి స్పందించటం వలన జ్వరం, నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను దాడి చేసిన శత్రువుగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించి ఆ వైరస్స్ ను ఎదుర్కోవటానికి కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేయటం ద్వారా శరీరంలోని మిగతా భాగమంతటికీ సంకేతాలు పంపిస్తుంది. నిజానికి ఈ కైటోకైన్లు మన రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి.ఈ కరోనా వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అందులో తెమడ వంటిదేమీ రాదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.ఈ లక్షణాలు ఉన్నప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ వంటి మందులతో చికిత్స అందిస్తారు ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే వారిలోని రోగ నిరోధ వ్యవస్థ వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.

 

రెండవ దశలో స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు అవుతాయి. ఇంకా తీవ్రమైతే ఇన్ ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరుకుని శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు లక్షణాలు కూడా రావచ్చు. రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని మిగతా భాగానికి పంపించే రసాయన సంకేతాలైన కైటోకైన్ల వల్ల వాపు రావచ్చు. ఇలా ఊపిరితిత్తుల వాపు న్యుమోనియా గా దారి తీయవచ్చు . మానవ ఊపిరితిత్తులు రెండు చిన్న పాటి గాలి సంచుల్లా ఉంటాయి న్యూమోనియా వచ్చినపుడు ఈ గాలి సంచులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది. కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస పరికరం) అవసరమవుతుంది . ఈ ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది. కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది చివరి దశలొ విఫలమవటం మొదలవుతుంది. రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పిపోతూ రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయి, అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయటం ఆగిపోయి చివరికి పూర్తిగా విఫలమవుతాయి. ఊపిరితిత్తుల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాపు వలన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తలెత్తుతుంది. అంటే శ్వాసప్రక్రియ దాదాపుగా ఆగిపోయి శరీర మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది దీనివలన కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. పేగులు దెబ్బతింటాయి.అంతర్గత అవయవాలు శరీరాన్ని సజీవంగా ఉంచలేవు. 

 

కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి వ్యాధి బయట పడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతుండగా కొందరు పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుటుందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారి శరీరంలో వ్యాధికారక వైరస్‌ 37 రోజుల వరకు జీవించి ఉండగలదని ఓ కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఇటీవల స్వామి పరిపూర్ణానంద  చెప్పినట్టు దాదాపు ఒక మండలం రోజులు అజ్ఞాతవాసంలో ఉండడం అందరికీ క్షేమకరమని భావించాలి. 


నావల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు. తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడినా వారికి కూడా అంటుకుంటుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులను ఆలింగనం చేసుకున్నా, కరచాలనం చేసినా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడినా వారికి సోకుతుంది. లిఫ్ట్‌లలో, టేబుళ్లు, మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకునే రాడ్లపై కరోనా వైరస్ చేరితే అది 12 గంటల వరకు ఉంటుంది. ఈ 12 గంటలలోగా ఎవరైనా ఈ ప్రాంతంలో చేతులుపెట్టినా, శరీరంలోని ఇతర భాగాలు తాకించినా వారికి సోకవచ్చు. అందుకే కరోనా సోకిన వ్యక్తి అందరికీ దూరంగా ఉండటం మంచిది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు, లేదా నాప్కిన్ అడ్డుగా పెట్టుకోవాలి.

ఆహార అలవాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. విదేశాలకు వెళ్లినప్పుడు బాగా ఉడికించిన మాంసాహారం మాత్రమే తీసుకోవాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.
మరీ ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం, జ్వరం ఉన్న వ్యక్తులకు మధ్య కనీసం 1 మీటరు (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి. చేతులు కడుక్కున్న తరువాత వేడి గాలి వచ్చే పరికరం కింద చెయ్యి పెడితే వైరస్ చచ్చిపోతుందనుకోవడం కూడా ఒక అపోహ. ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్లినా కరోనా రాదనుకోవడం అపోహ మాత్రమే. డాక్టర్లు వాడే అత్యంత కాస్ట్‌లీ మాస్కుల వల్ల మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మాస్క్ అనేది నేరుగా కరోనా సోకిన వ్యక్తి నుంచి విడుదలయ్యే తుంపర్లు మనలోకి ప్రవేశించకుండా మాత్రమే ఆపగలవు.పైగా చాలా మంది మళ్లీ మళ్లీ వాడిన వాటినే వాడుతున్నారు. అది మరింత ప్రమాదం.

ఎండ పెరిగితే కరోనా రాదా?

అలా అని రుజువు కాలేదు. ఇదివరకు వచ్చిన స్వైన్ ఫ్లూ సహా చాలా వైరస్‌లు ఎండాకాలంలో కూడా ప్రభావం చూపాయి.  

 

ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుందా? 

అప్పటికే ఒంట్లోకి ప్రవేశించిన వైరస్ బయటి నుంచి మద్యం, క్లోరిన్ చల్లుకున్నంత మాత్రాన చనిపోదు. పైగా అవి చర్మానికి, కళ్లకు హాని చేస్తాయి.

యాంటీబయోటిక్స్ తో కరోనాను ఆపగలమా?

యాంటీబయోటిక్స్&బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయటానికే తోడ్పడతాయి. వైరస్ ల మీద పనిచేయవు.

నువ్వుల నూనె కాపాడుతుందా? 

నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే కరోనా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించదని అనుకోవటం అపోహ. బ్లీచ్/క్లోరిన్ ఆధారిత క్రిమినాశకాలు, ఈథర్ ద్రావణాలు, 75% ఇథనాల్, పెరాసెటిక్ యాసిడ్& క్లోరోఫాం వంటివి ఆయా వస్తువులు, ఉపరితలాల మీద అంటుకున్న వైరస్ లను చంపగలవు. గోమూత్రం సేవించడం వల్ల వైరస్ చనిపోతుందనేది ఒక అపోహ.

 

వెల్లుల్లి తింటే కరోనా రాదా? 

వెల్లుల్లికి సూక్ష్మక్రిములను చంపే శక్తి ఉంది. అంతమాత్రాన వెల్లుల్లిని తింటే కరోనా వైరస్‌ రాదని లేదు. వెల్లుల్లి కరోనాను పోగొడుతుందని రుజువు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది.

 

 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత