Skip to main content

మోడీ సోషల్ మీడియా వదిలేస్తే ఏమౌతుంది?


 


ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు స్వస్తి పలుకుతారన్న ప్రకటన సోషల్ మీడియాలో కలకలమే రేపుతోంది. ఎందుకంటే కోట్లాది  మంది ఫాలోయర్లు మోడీకి ఉన్నారు. ఈ విషయంలో మన దేశంలో మోడీనే టాప్ లో ఉండడం గమనించాల్సిన అంశం. అంతమంది ఫాలోయర్స్ ను పెట్టుకొని అకౌంట్స్ ని వదిలేసేందుకు సిద్ధమవడం చాలా గొప్ప విషయమే కాక ఆలోచించాల్సిన విషయం కూడా. 


మోడీ సోషల్ మీడియాను వదులుకోవడానికి కారణాలు ఇవీ - 


1) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలావరకు న్యూస్ ని స్ప్రెడ్ చేయడమే తప్ప.. వాటి మీద కంట్రోల్ లేకపోవడం. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్. 


2) కంట్రోల్ చేయాలనుకున్నా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం. ముఖ్యంగా అందుకోసం చిత్తశుద్ధి లేకపోవడం. 


3) వన్ బిలియన్ ప్రజల మార్కును దాటిన భారత్ లో దాదాపు 50 శాతానికి పైగా ప్రజలు నిత్యం ఆన్ లైన్ లోనే ఉంటున్నారు. దీంతో నెట్ వర్క్ బిజినెస్ లో ఇండియాది పైచేయిగా మారుతోంది. దీన్ని బిజినెస్ అవకాశంగా మలుచుకుంటున్న సోషల్ మీడియా బాసులు రూమర్స్ అంశాన్ని అసలేమాత్రం పట్టిించుకోవడం లేదు. పైగా ఆ రూమర్స్ నే బిజినెస్ పాయింట్ గా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో విపరీతంగా వినిపిస్తున్నాయి.


4) భారత్ తీసుకుంటున్న చాలా నిర్ణయాల విషయంలో సోషల్ మీడియా బాధ్యతగా వ్యవహరించడం లేదు. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు జమ్మూ-కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం కోసం చేసిన ప్రయత్నాలను కాకుండా చిన్నచిన్న ప్రదర్శనలకు అధిక ప్రయారిటీ ఇచ్చి అభూత కల్పనలు ప్రచారం చేసింది. అలాంటి అభూతకల్పనలన్నీ ఫేక్ అకౌంట్ల ద్వారానే జరిగిన విషయం రుజువైంది. కానీ ట్విట్టర్ యాజమాన్యం మాత్రం దేశ ప్రజల సెంటిమెంట్స్ ను పట్టించుకోలేదు. ఫేక్ అకౌంట్లను కట్టడి చేయలేదు. అలాగే అక్కడున్న వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పేందుకు ప్రయత్నం  కూడా చేయలేదు. 


5) అమెరికా అధ్యక్షుడి ఎన్నికల సందర్భంలో ఫేస్ బుక్ అకౌంట్ హోల్డర్ల సమాచారాన్ని భారీ మొత్తానికి అమ్ముకున్నారన్న ఆరోపణలు జుకర్ బర్గ్ మీద ఉండనే ఉన్నాయి. ఇది గమనించాల్సిన అంశం. 


 


మోడీ లాంటి వారు వదిలేస్తే మంచిదే - 


ప్రపంచంలో అత్యధిక ఫాలోయర్లు ఉన్న నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్లు వదిలేస్తే అది ఓ మంచి సంప్రదాయమే అవుతుంది. కనీసం ఇప్పుడైనా ఆయా యాజమాన్యాలు పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా అనేది వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక. అందులో ఎవరికి తోచింది వారు రాసుకుంటారు. నచ్చినవాళ్లు యాడ్ అవుతారు. నచ్చనివారు లెఫ్ట్ అయిపోతారు. ఎవరికీ లాభ-నష్టాలతో పనిలేదు. బాధ్యతల పట్టింపు అసలే ఉండదు. నా అకౌంట్ - నా ఇష్టం అన్నట్టుగా రాతలు, కూతలు సాగిపోతుంటాయి. ఒకర్ని నియంత్రించే అధికారం ఇంకొకరికి ఉండదు. ఇప్పుడు ఇదో పెద్ద సవాలై కూర్చుంది. 


ప్రత్యామ్నాయం ఏంటి?


అయితే మోడీ తన అకౌంట్లను వదిలేస్తాను అంటూనే ప్రజలతో టచ్ లో ఉంటాను అనడం మాత్రం ఆసక్తి రేపుతోంది. ఏ విధంగా టచ్ లో ఉంటారు.. రేడియో, దూరదర్శన్ లాంటివాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటారా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వంటివాటిని సోషల్ మీడియాలోకి తీసుకొస్తారా.. లేక మరేదైనా ప్రత్యామ్నాయాన్ని ఇప్పటికే ఆలోచించి పెట్టారా..  అన్నది చాలా ఆసక్తిగా మారింది. బాధ్యత లేని సోషల్ మీడియాను నిషేధించి, బాధ్యతగా ప్రవర్తించే జనరల్ మీడియాను అమితంగా ప్రోత్సహిస్తారా? అదే జరిగితే జనరల్ మీడియాకు మంచిరోజులు వచ్చినట్టే. జనరల్ మీడియాలోకి ఇప్పటికే ఎఫ్.డి.ఐ. లకు  పూర్తి పర్మిషన్ ఇచ్చిన మోడీ మనసులో ఇంకెలాంటి ఆలోచనలున్నాయో వేచి చూడాలి. అయితే మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా వారి సేవలను, త్యాగాలను హైలైట్ చేస్తూ తన అకౌంట్లను వారు గానీ, వారి తరఫున కథనాలు గానీ పోస్ట్ చేసేవారు టేకోవర్ చేసుకునే అవకాశం కల్పించడం మాత్రం వినూత్నమైన ఆలోచన. 


Photo: pragativadi


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత