Skip to main content

సింగరేణి ఏరియా ఎమ్మెల్యేల్లో గుబులు


వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు...కానీ నియోజక వర్గాల్లోకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు ఇబ్బందిగా మారిందని ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇంతకీ ఇబ్బందులు పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు... ఏ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వారు గుర్రుగా ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం తమకు ఇబ్బందులు తెస్తున్నాయని వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు ఉండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ...ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసి యూనియన్ ఆఫీసులకు తాళాలు వేయడంతో ఆ ప్రభావం తమపైన పడిందంటున్నారు గులాబీ పార్టీ  ఎమ్మెల్యేలు. అంతేకాదు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని భయపడుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, రామగుండం, భూపాల పల్లి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహిస్తే బాగుండని అనుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సంఘాలను క్లోజ్ చేసినట్లే సింగరేణిలో కూడా కార్మికుల సంఘాలను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పటి వరకు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘం, సింగరేణి బొగ్గు గని కార్మిక  సంఘం కొంచెం వీక్ అవ్వడం బీజేపీ అనుబంధ సంఘం బియంయస్ బలంగా అవ్వడం కూడా ఒక కారణం అని అనుకుంటున్నారు. దీంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలని అనుకుంటున్నారని సమాచారం.సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవాలని అనుకుంటున్నారట. సింగరేణి కార్మిక సంఘాన్ని క్లోజ్ చేస్తే తమ పైన నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరిగి రానున్న ఎన్నికల్లో  పార్టీ పైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని ముఖ్యమంత్రి కి చెప్పాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇస్తారా....సింగరేణి కార్మిక సంఘాల పైన సీఎంకి ఎలాంటి అభిప్రాయం ఉందొ చూడాలి.


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల