Skip to main content

Posts

అనాథల పాలిట ఆత్మబంధు మాతృభూమి ఫౌండేషన్

  కరోనా విజృంభణతో లాక్  డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న అనాథలు, పేదలు, వృద్ధులు, బిచ్చగాళ్లకు నేనున్నానంటూ ముందుకొచ్చింది మాతృభూమి ఫౌండేషన్. ఎంబీఎఫ్  ఆధ్వర్యంలో లాక్ డౌన్ విధించిన రోజు నుంచి అంటే నెల రోజులుగా ఆహార పదార్థాల పంపిణీ నిరాటంకంగా చేస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కోటర్ కిరణ్ చెప్పారు. శనివారం  గచ్చిబౌలి, ఇందిరానగర్ బస్తీలో 60 మందికి ఆహార సామగ్రి అందజేశారు. అలాగే మే5 వరకు ఆకలితో ఉన్నవారికి భోజన సదుపాయాలు సమకూరుస్తామని చెప్పారు. గడిచిన 30 రోజుల్లో దాదాపు 30 వేల మందికి భోజనం, మరో 500 మందికి ఆహార సామగ్రి అందించినట్లు చెప్పారు.     లాక్ డౌన్ కారణంగా బాగోగులు చూసే దిక్కులేని  బిచ్చగాళ్లకు, వృద్ధులకు భోజన సదుపాయాలు కూడా చేస్తున్నామని కిరణ్ చెప్పారు. మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పారు. తమ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లోని  విజయనగరం, రాజమండ్రి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో... అలాగే తెలంగాణలోని వికారాబాద్, నల్గొండ, ఖమ్మం, హైద్రాబాద్ జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.      తమ ఫౌండేషన్ విద్యాభివృద్ధికి

ఎంబీసీల ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఉసూరుమంటున్న పేదలు, బడుగుల కోసం పాతబస్తీ, ఉప్పుగూడ-లలితాబాగ్ లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాతీయ ఎంబీసీ సంఘం అధ్యక్షుడు కె.సి.కాళప్ప గారి ఆదేశాల మేరకు... చాంద్రాయణగుట్ట కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చేపూరి లక్ష్మణాచారి, వలబోజు రవికిరణ్, తోట శ్రీనివాసాచారి, షణ్ముఖాచారి ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ జరిగింది. తమ పరిధిలోని ఓల్డ్ సిటీ ప్రజలకు  ఎలాంటి ఇబ్బంది కలగ కూడదని బియ్యం పంపిణీ చేసినట్లు లక్ష్మణాచారి చెప్పారు. లలితా బాగ్, కాళికా  నగర్, మారుతి నగర్, ఉప్పుగూడ, తానాజీ నగర్, భయ్యాలాల్ నగర్,  శివాజీ నగర్ లోని పేదలకు బియ్యం పంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాసోజు లక్ష్మణాచారి, వీరేష్ చారి,బాణాల బ్రహ్మచారి, తిప్పర్తి రాజుచారి, మురళిగుప్తా, నోముల హరిగోపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ వర్కర్స్ కు ఆహారసరుకులు పంపిణీ

మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి యూత్ కో-కన్వీనర్ అజయ్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా మునిసిపల్ వర్కర్స్ కు, అలాగే ఇతరవర్గాల్లోని పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మల్లంపేట్ 22వ వార్డు  కార్పొరేటర్ సంధ్యాహన్మంతరావు, మేడ్చల్ తెలంగాణ జాగృతి యూత్ కన్వీనర్ పడాల మనోజ పాల్గొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆశయాలను... ఈ విధంగా ముందుకు తీసుకెళ్తునందుకు సంతోషంగా ఉందని సంధ్య, మనోజ అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ముప్పు తొలగిపోయేంతవరకు జాగ్రత్తగా ఉండాలని పిలువునిచ్చారు. ఇప్పుడు రంజాన్ కూడా ఉన్నందున హైదరాబాద్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. 

హేపీ రంజాన్ కు ఏడు సూత్రాలు

  ప్రపంచమంతా రంజాన్ కు సిద్ధమైంది. ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే కరోనా అనే మహమ్మారి మన పక్కనే పొంచి ఉన్న కారణంగా పండుగ సంబరంలో పడిపోయి జాగ్రత్తలు విస్మరించరాదని నిపుణులు సూచిస్తున్నారు. హేపీ రంజాన్ కోసం ఈ కింది సూత్రాలు పాటిస్తే పండుగ ఆనందాన్ని మన కుటుంబ సభ్యులకు పంచిన వారమవుతాం.  1) రంజాన్ ప్రవేశించింది కాబట్టి.. పండుగ కోసం కరోనా రూల్స్ ని మినహాయిద్దాం అన్న తలంపు చేయరాదు. 2) ప్రార్థనలు ఇళ్లలోనే ఉండి చేసుకోవాలి. మసీదుల్లోకి వెళ్లి ప్రార్థనలు చేయాలన్న ఆలోచన చేయరాదు. 3) ఏ ఒక్కరు మసీదులోకి వెళ్లినా ఇంకొకరు రూల్స్ బ్రేక్ చేయడానికి అవకాశం ఇచ్చినవారవుతారు. అది పూర్తిగా వాతావరణం చెడగొడుతుంది. 4) మనం పండుగ సంబరాన్ని ఆస్వాదించాలంటే కరోనా నుంచి సురక్షితంగా ఉండాలి. కాబట్టి ఎవరో బలవంతంగా రూల్స్ రుద్దుతున్నారని కాకుండా స్వచ్ఛందంగా రూల్స్ ని పాటించాలి. 5) బయట కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు ఇంటి నుంచే ప్రార్థన చేసుకోవాలన్న ప్రవక్త సూచనలు గుర్తు తెచ్చుకొని ఆ మార్గాన్ని అవలంబించాలి. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లైవ్ లో మాట్లాడిన

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

ఫేస్ బుక్-జియో బంధంతో ట్విట్టర్ కు కష్టకాలమేనా?

దేశీయ టెలికాం రంగానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న జియో టెలికాం పంచన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ చేరడంతో రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్  రూ. 43, 574 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని జియో టెలికాంలోకి పంపింగ్ చేస్తోంది. జియోలో దాదాపు 10 శాతాన్ని ఫేస్ బుక్ వాటాగా పొందుతుంది. దీంతో ఫేస్ బుక్ చేతిలో ఉన్న వాట్సాప్ కూడా జియో చేపట్టబోయే ఆపరేషన్స్ కి బాసటగా నిలుస్తాయి. టెలికాం విభాగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉన్న జియో.. తాజాగా డిజిటల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. జియో మార్ట్ పేరుతో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి భారీ ఎత్తున ప్లాన్ చేసిన ధీరూబాయి అంబానీ తనయుడు... అతిత్వరలోనే ఫేస్ బుక్, వాట్సాప్ ల సహకారంతో ఆ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబోవడం ఖాయంగా మారింది. జియో మార్ట్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని మైక్రో లెవల్లోకి తీసుకెళ్లనున్నట్టు దాదాపు 6 నెలల క్రితమే ముఖేశ్ బయటపెట్టుకున్నారు. అది కాస్తా ఇప్పటికి రూపం దాల్చింది. ఫేస్ బుక్ కి భారీ సంఖ్యలో ఉన్న ఖాతాదారుల వివరాలు, అలాగే వ్యక్తిగత సమాచారం కోసం వా

డాక్టర్ల నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక

ఓపికకు కూడా హద్దుంటుంది కదా. అదే ఇప్పుడు ముందుకొస్తోంది. కరోనా విజృంభణకు బ్రేకులు వేసేందుకు ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యసిబ్బందిలో నిరసన సెగలు రగులుతున్నాయి. కరోనా పాజిటివ్ బారిన పడిన కొందరు వ్యక్తులు, హైడింగ్ లో ఉండడమే కాక.. పోలీసుల ద్వారా ఐడెంటిఫై అయ్యాక డాక్టర్లు వెళ్లినా కూడా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పోయి వైద్యుల మీద దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో, నిజామాబాద్ లో జరిగినా ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకోదగ్గ చర్యలు లేకపోవడం వైద్యసిబ్బందిలో ఆందోళనకు కారణమవుతోంది. ఆ రెండు సంఘటనల తరువాత కూడా OGH వైద్యుడిపై రక్తం వచ్చేలా కొట్టిన ఘటన జరిగింది. వైద్య సిబ్బంది మీద దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సర్కారు ప్రకటనలు కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. అటు యూపీలో కూడా డాక్టర్ అగర్వాల్ పై, అతని అనుచరులు, డ్రైవర్ పై విచక్షణ లేకుండా దాడి చేశారు. మీ ప్రాణాలు కాపాడేందుకే వచ్చామని చెబుతున్నా మూర్ఖత్వం తలకెక్కిన పాజిటివ్ రోగులు వాళ్ల వెహికల్ పై రాళ్లవర్షం కురిపించారు. చివరికి రోగులు ఉండాల్సిన హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్లు ఉండాల్సి వస్తోంది. Al