Skip to main content

Posts

వరంగల్-కొత్తగూడెం: సేమ్ ఇన్సిడెంటల్ అండ్ సేమ్ పొలిటికల్ సీన్

ఆరేళ్ల క్రితం ఏం జరిగిందో.. సరిగ్గా అలాగే కాకపోయినా.. అలాంటిదే రిపీటైంది. వరంగల్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎస్. రాజయ్య ఇంట్లో నాలుగు నిండు ప్రాణాలు అగ్ని కీలలకు ఆహుతైపోతే.. కొత్తగూడెెం జిల్లా పాల్వంచలో అలాంటివే నాలుగు ప్రాణాలు బూడిదైపోయాయి. అక్కడ కాంగ్రెస్ నేత కొడుకు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భార్యను కట్నం పేరుతో రాచి రంపాన పెట్టి గ్యాస్ సిలిండర్ కుట్రకు బలిపెడితే.. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు ఆస్తి తగాదాలు పరిష్కరించే నెపంతో ఓ అసహాయుడి అర్థాంగిపై కన్నేసి, హైదరాబాద్ లోని తన గడీకి పంపించుమని ఆర్డరేసి, గడి బయట కట్టుకున్న భర్తనే కాపలాగా ఉంచే నయా కీచక పర్వానికి తెరతీశాడు. అచ్చంగా ఆనాటి గడీల పాలనకు తాజా ఆనవాలుగా నిలిచాడు. భర్తకు విషయం చెప్పలేక, ఆమెను వదిలి తానొక్కడే తన దారి తాను చూసుకోలేక, పిల్లల దారుణ భవిష్యత్  చిత్రాన్ని ఊహించుకోలేక అందరినీ తన వెంటే తీసుకుపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు, అందాలొలికే భార్యను కర్కశ మంటల్లో కాల్చేశాడు. తానూ తగులబడిపోయాడు.  కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్ణ తన తల్లితో, సోదరితో ఆస్తుల పంపకాల విషయాన్ని తేల్చుకోలేకపోయాడు. దాదా

బీ అలర్ట్.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు

ప్రపంచ మానవాళిని కరోనా ఓ కుదుపు కుదిపింది. దాని ప్రభావం 2022 వరకు ఉంటుందని, కేవలం ఐదారు నెలలకే ఈ సమస్య సమసిపోయేది కాదని అప్పట్లోనే కొందరు నిపుణులు అన్నారు. అదే నిజమవుతోందిప్పుడు. అయితే థర్డ్ వేవ్ గా చెప్పుకునే ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి గురించి ఆరోగ్య నిపుణులు కాసింత పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రముఖ విద్యావేద్ద, మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు వాసిరెడ్డి అమర్నాథ్ ఏమంటున్నారో చూడండి.  ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది. తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది. ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు కొన్ని రెట్లు పెరుగుతూ జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు. ఒమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే..   1. ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్.  2. ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

చిత్రం ఏమంత దరిద్రంగా వుంది??? బానే తీశారు కదా.... నటన, కథ, నాట్యం, సంగీతం, సాహిత్యం అన్నీ బానే వున్నాయి కదా.. గొప్ప చిత్రం కాకపోయినా అసహ్యంగా అయితే లేదు కదా అనే అనుమానం మనకు రాక మానదు.. నిజమే సాంకేతికంగా అన్నీ బానే వున్న చిత్రమే.... అందునా నాని చిత్రం....సాయి పల్లవి లాంటి నాట్యం నటన అద్భుతంగా చేసే నటి వున్న చిత్రం అన్నీ సమపాళ్లలో వున్న చిత్రమే. కాకపోతే వొచ్చిన చిక్కల్లా అనసరంగా పెట్టిన రెండు విషయాలు.  1. కమ్యూనిజం. 2. హిందూ ద్వేషం. అనవసరంగా పెట్టారు అనేకన్నా కావాలనే పెట్టినట్టు అనిపించింది. అందుకే పొరబాటు అయితే పోనీలే అని వొదిలెయ్యొచ్చు కానీ కావాలని చేస్తే మాత్రం తగ్గేదెలే.. అందుకే ఈ విశ్లేషణ.. అసలు నేను దీనికి విశ్లేషణ రాయకూడదు అనుకున్నా. రాసినా రెండే రెండు ముక్కల్లో ముగించెయ్యాలి న్యాయంగా.  కానీ మరీ రెండు ముక్కల్లో అయితే సదరు దర్శకుని సంగతి అంచనా వెయ్యటం కష్టం కదా, అందుకే ఇలా... మొట్ట మొదటగా కొన్ని విషయాలు చెప్పేసి తర్వాత చిత్రం గూర్చి చర్చించుకుందాం. 1. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉండి, అది ఎన్నికల్లో పాలుపంచుకోవడం. 2. అసలు ఏ మత సిద్ధాంతానికి

12 ఏళ్ల లోపు పిల్లలకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్

రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థను (ఆర్టీసీ) కొత్తపుంతలు తొక్కిిస్తున్న ఎండీ సజ్జనార్ మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు. ఆంగ్ల సంవత్సరాది, జనవరి ఫస్టును పురస్కరించుకొని 12 ఏళ్ల లోపువారికి  ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సజ్జనార్ కల్పించారు. ఆ ఒక్కరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా వారి వెంట ఉండాలి. ఆర్టీసీ ప్రయాణంలో ఉండే సౌకర్యం, భద్రతతో పాటు పెరిగిన పెట్రో ధరల కారణంగా ప్రైవేట్ సర్వీసుల్లో ప్రయాణం చాలా కాస్ట్ లీ గా తయారైన దరిమిలా ఈ సౌకర్యాన్ని పేరెంట్స్, పిల్లలు ఉపయోగించుకోవాలని సజ్జనార్ సూచించారు. పేద, మద్య తరగతి ప్రజలు జనవరి ఫస్టు  రోజున సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ సర్వీసును ఉపయోగించుకోవచ్చని కోరారు. ప్రభుత్వ అధికారులందరూ ఈ విషయాన్ని పెద్దస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. సజ్జనార్ ఇప్పటికే జంట నగరాల్లో రూ. 100 కే 24 గంటలు అన్ని సర్వీసుల్లోనూ తిరగగలిగేలా టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) ఆఫర్ పరిచయం చేశారు. సిటీలోని ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక

బండీ.. నీ దొంగ దీక్ష ఢిల్లీలో చెయ్యి

- నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయి..మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏవి..? - కేంద్రంలో ఖాళీగా ఉన్న 9 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు..? - కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి - రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వయసు కు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ది నిరుద్యోగ దీక్ష కాదు దొంగ దీక్ష అని విమర్శించారు.నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయాలన్నారు. మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏవన

జనవరి ఫస్టు రోజున చలో రామప్ప - బొడ్డుపల్లి బాలబ్రహ్మం

ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఫస్టున  ఓ భారీ యాత్రను తలపెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఖ్యాతికెక్కిన రామప్ప దేవాలయ యాత్రను శనివారం (జనవరి ఫస్టు) తలపెట్టామని మంగళంపల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తేదీ శనివారం రాత్రి‌ BHEL నుండి ఓ లగ్జరీ బస్సు బయలుదేరి రెండవతేదీ ఆదివారం ఉదయానికల్లా దక్షిణ  కాశీగా అందరూ పిలుచుకునే కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యనదీ స్నానం  ఆచరించి, ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ప్రాణవట్టం పై (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు) యముడు, శివుడి దర్శనం చేసుకుంటారు. అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశ్వరీమాత నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం ముగించుకొని మద్యాహ్నం 2 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప గుడిని చేరుకుంటారు. రామప్ప గుడి శిల్పసంపద, ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గొప్పతనం తెలిపే విషయాలను వీడియో షూట్ చేస్తారు. యాత్రలో పాల్గొన్నవారి అభిప్రాయాలు, అన