Skip to main content

Posts

ఈటలతో జతకట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి

హరీష్ రావు ఆత్మీయ సహచరుడు రవీందర్ ఉత్తర తెలంగాణలో సీనియర్ టిఆరెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ తో జతకట్టనున్నారు..గురువారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి నేరుగా ఈటెలను కలిసి సంఘీభావం ప్రకటించారు..  ఈ పరిణామం టిఆరెస్ లో  సంచలనం సృష్టిస్తోంది.. మంత్రి హరీష్ రావు కు అత్యంత నమ్మకమైన రాజకీయ సహచరుడిగా మెదులుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెలను కలవడం రాజకీయ ప్రకంపనలకు దా రితీయబోతోంది..2004 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన రవీందర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు..15 ఏళ్ళ పదవీ కాలంలో హరీష్ రావు వెంటే నీడలా ఉన్నారు..పొద్దున్నుండి రాత్రి వరకు హరీష్ వెంటే ఉండేవారు..2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ చేతిలో ఓడిపోయినప్పటికి…హరీష్ రావు తో బంధం వీడలేదు.. కొద్దికాలానికే కాంగ్రెస్ నుంచి సురేందర్ కారెక్కడంతో సిట్టింగ్ హోదాలో ఉన్న జాజులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది హరీష్ రావు కు..అయినా రవీందర్ రెడ్డి తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు హరీష్ రావు..సిట్టింగ్ ఎమ్మెల...

జర్నలిస్టుల కుటుంబాలకు చేయూతనిద్దాం-జైన్ కుమార్ విశ్వకర్మ

వార్తల కవరేజీ విషయంలో కరోనా మహమ్మారికి ఎదురీదుతూ పనిచేస్తున్న జర్నలిస్టులను గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జైన్ కుమార్ విశ్వకర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంగా కరోనా విజృంభణకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన తరుణంలో మీడియా సంస్థలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ఆదుకునే విషయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన అంశమని జైన్ అన్నారు. అదే స్ఫూర్తితో స్థానిక ప్రభుత్వాలు కూడా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు వర్తింపజేసి జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి తనవంతుగా ఒక నెలకు సరిపడా సరుకులు అందజేశామని, జర్నలిస్టులకు చేయూతనందించే విషయంలో అన్ని సామాజికవర్గాలవారూ ముందుకు రావాలని జైన్ పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు టి.రమేశ్ బాబు కు ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ తరఫున ఈ సరుకులు అందజేశామని, ఇతర ప్రాం...

మొబైల్ జర్నలిజం-రూరల్ డెవలప్మెంట్ పై ముగిసిన శిక్షణ తరగతులు

రూరల్ డెవలప్మెంట్ అండ్ మీడియా కవరేజి,  డాక్యుమెంటేషన్ పై ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ శిక్షణా తరగతులు ముగిశాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గల సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ కు సారథ్యం వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకాంక్ష ఏడు రోజుల శిక్షణా తరగతులను విజయవంతంగా నిర్వహించారు. ఇలా దేశ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. రూరల్ రిపోర్టింగ్, అభివృద్ధి కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పై వివిధ విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్ల చేత క్లాసులు ఇప్పించామని ఆకాంక్ష చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రూరల్ డెవలప్మెంట్, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫ్యాక్ట్ చెకింగ్, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులపై గ్రామీణులకు అవగాహన కల్పించడం, జియో ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్స్ ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడం,  మహిళా సాధికారతను ఏ విధంగా త్వరితగతిన సాధించాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ఉపయోగించుకోవడం ఎలా, గ్రామాల్లో మీడియా పోషించాల్సిన పాత్ర, కొత్త పుంతలు తొక్క...

ఈటల ప్లేస్ లో భర్తీ అయ్యేది ఇతనేనా?

ఈటల రాజేందర్ సొంత  నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ హుజురాబాద్‌లో ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ స్థానిక‌ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వారం క్రిత‌మే పెద్దిరెడ్డి కేసీఆర్‌ను క‌లిసిన‌ట్టుగా స‌మాచారం. దీన్ని బ‌ట్టి ఈటల‌ను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.ఈటలను వెళ్లిన వెంటనే పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు. ఈటలను బయటకు పంపించి పెద్దిరెడ్డికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ బాధ్యతలు  అప్పజెప్పాలనే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో పెద్దిరెడ్డి.. మంత్రిగానే కాకుండా టీడీపీ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత దేవేంద‌ర్ గౌడ్‌తో క‌లిసి న‌వ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని ప్ర‌జారాజ్యంలో విలీనం చేశారు. కొన్నాళ్లు మ‌ళ్లీ టీడీపీలోకి తిరిగివ‌చ్చారు. తెలంగాణ వ‌చ్చాక టీడీపీ బ‌లం త‌గ్గిపోవ‌డంతో.. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీలో చేరారు. నిజానికి ఈట‌ల రాజేంద‌ర్ ను చాలా రోజులుగానే దూరం పెడుతున్నారు కేసీఆర్. రెం...

పేద విశ్వకర్మలకు రూ. 10 వేలు, 50 కిలోల బియ్యం ఇవ్వాలి

నిరుపేద విశ్వకర్మల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని, దాదాపు గతేడాది నుంచి ఉపాధి కోల్పోయి, ఆకలితో పస్తులుంటున్న నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబాలు తెలంగామలో వేలాదిగా ఉన్నాయని, వారికి చేయూతనందించాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్యసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కౌలే జగన్నాథం విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10 వేల రూపాయలు, 50 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జగన్నాథం-వెంకటలక్ష్మి దంపతుల 37 ఏళ్ల పెళ్లిరోజు సందర్భంగా పలువురు విశ్వబ్రాహ్మణ సమాజం నాయకులు.. ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో  వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్యసంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్ చారి, ప్రధాన కార్యదర్శి మారోజు రవీంద్రాచారి, సైదాబాద్ మండలాధ్యక్షుడు వొరువాల వీరేశ్ చారి, ప్రధానకార్యదర్శి మేడిపల్లి వెంకటేశంచారి తదితరులు పాల్గొన్నారు.   

అసహాయులైన విశ్వకర్మలకు సరుకులు పంచిన వేదాస్

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి లేక, పట్టించుకునేవారు లేక అల్లాడుతున్న నిరుపేద విశ్వకర్మలకు చేయూత అందించేందుకు  వేదాస్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగోజు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి నాగాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దనాచారి సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ శాఖ నాయకుడైన జైన్ కుమార్ ఈ సరుకుల పంపిణీ నిర్వహించారు. హైదరాబాద్ లో మూడు నిరుపేద కుటుంబాలను ఎంచుకొని వారికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు నగదు కూడా అందించారు. అంబర్ పేటకు చెందిన దివ్యాంగుడైన రవీందర్ కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు రూ. 2 వేల నగదు, వృద్ధులైన రెండు జంటలకు కూడా అదే తరహాలో నిత్యావసర సరుకులతో పాటు మొత్తం 7 వేల నగదును అందించారు.  వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ప్రోత్సాహంతోనే తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నామని, ఇందుకు సహకరించిన వేదాస్ సభ్యులు, నాయకులు అందరికీ జైన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర సహాయాధ్యక్షుడు కౌలే జగన్నాథం, అదే సంఘానికి చెందిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కమ్మరి మ...

తెలంగాణలో విశ్వబ్రాహ్మలకు ఒరిగింది శూన్యం

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఖమ్మం జిల్లాకు చెందిన బ్రహ్మశ్రీ ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మను నియమించారు. ఆదివారం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినట్లు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వనాథుల పుష్పగిరి చెప్పారు. అనంతరం ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మ మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తానని, విశ్వకర్మ సమాజపు పూర్వ వైభవానికి, సంస్కృతీ పరిరక్షణకు, సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తానని, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ లక్ష్యాలకు అనుగుణంగా ఎల్లవేళలా విశ్వకర్మలందరికి అందుబాటులో ఉంటానని ప్రమాణం చేశారు. సాధించుకున్న తెలంగాణలో విశ్వకర్మలకు ఒరిగింది ఏమీ లేదని, ప్రభుత్వ పథకాలు సైతం విశ్వకర్మ సమాజానికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఎందరో విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని, తమ కుల సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తనవంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని శ్రీనివాస్ విశ్వకర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ విశ్వబ్...