Skip to main content

Posts

జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగాలి

తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఉన్నతాశయాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని హైదరాబాద్ ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, పీజేఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి ఆకాంక్షించారు. నేటితరం విద్యార్థులు, యువకులు రేపటితరం యోగక్షేమాల కోసం పని చేసినప్పుడే ఆదర్శవంతమైన సమాజం సిద్ధిస్తుందని చేపూరి అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86 జన్మదిన వేడుకలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్ డివిజన్ తానాజీ నగర్ లో నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, సి అనీశ్ ఆచారి, తోట శ్రీనివాసాచారి, సి అభిషేక్ ఆచారి, వేణు, అశోక్, బొడ్డుపల్లి యాదగిరి ఆచారి తదితరులు పాల్గొన్నారు. 

పోలీసు సహచరికి చివరి సలాం- పూర్తి ఫొటోలు

  ఆపదల్లో అప్రమత్తం చేసి, ప్రమాదాల నుంచి తప్పించి, విధుల్లో విజయాలు అందించి, మెడల్లో మెడల్స్ వేయించి.. అడుగడుగునా గర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసిన ఆ పోలీసుల సహచరి వారి నుంచి శాశ్వతంగా దూరమైంది. చేతుల్లోనే పెరిగి, పెట్టింది తిని, అప్పజెప్పిన టాస్క్ ను అద్భుతంగా పూర్తి చేసిన లియో అనే స్నిఫ్ఫర్ డాగ్ అకాలంగా చనిపోవడంతో మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా ఏర్పడినప్పుడే జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్, జిల్లా కార్యాలయానికి నూతన సిబ్బందితో పాటు లియో అనే పోలీస్ జాగిలం కూడా పోలీసులతో పాటే అడుగు పెట్టింది. లియో పేరు చెపితే నిందితులకు, సంఘ విద్రోహులకు ముచ్చెమటలే. ఆ జాగిలం ప్రత్యేకతే వేరు. పోలీసులు ఛేదించలేని నేరాలు సైతం ఈ పోలీసు జాగిలం కనిపెడుతుందని గొప్పగా చెబుతున్నారు. లియో జిల్లాకు వచ్చిన్నటి నుంచి తన విధి నిర్వహణలో భాగంగా మేడారంలో ఏర్పాట్లు, సీఎం భద్రతా పర్యవేక్షణ విధులు, నేరస్తులను పట్టకోవడం... ఇలా తన పాత్ర భేషంటున్నారు పోలీసు అధికారులు. ఆర్మ్డ్ రిజర్వ్ లో పోలీసు ఉన్నతాధికారి అయిన డీఎస్పీ జనార్దన్ రెడ్డి... లియో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగింద

ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ - ఫొటోలు ఇవే

  ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అటు సమాంతరంగా అదే ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. సిర్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.  Read also: ఆ మావోయిస్టుపై రూ. 8 లక్షల రివార్డు డిస్ట్రిక్ట్ వలంటీరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా తుమిడిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్లా గ్రామ సమీపంలోని అడవుల్లో కూబింగ్ నిర్వహించింది. ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా... పలువురు తప్పించుకున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందినవారిలో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది.

భూ మాఫియా అవతారంలో కొందరు బీసీలు

    రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో ఒక భూవివాదంలో జరిగిన దాడి రెవిన్యూ విభాగంలోని అనేక చీకటి పార్శ్వాలను మరోసారి తెరమీదికి తెస్తోంది. మన దేశంలో, రాష్ట్రంలో పబ్లిక్ సర్వెంట్స్ కు ఉన్న స్వేచ్ఛ, ప్రత్యేకాధికారాలు ప్రజలకు లేవని మరోసారి రుజువైంది. ఫిర్యాదుదారులు ప్రజలే, బాధితులు కూడా ప్రజలే అవుతుండగా.. ఆ ఇద్దరి మధ్యా లేని వివాదాలు సృష్టించి, ఉన్న వివాదాలను పెంచి.. వారి మధ్య  వైషమ్యాలను శాశ్వతంగా పెంచి పోషిస్తున్నది స్వయంగా అధికారులేనన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అసమగ్రంగా ఉన్న భూ రికార్డులు, అసలు రికార్డులకే ఎక్కని భూములు, తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములను ఆసరా చేసుకొని కలిసి జీవించే ప్రజా వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     బాధితుడు మక్రోజు పరిపూర్ణాచారి కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ అనే గ్రామంలో తాతల కాలం నుంచి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నారు. శనివారం వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లిన పరిపూర్ణాచారికి అనుకోని దృశ్యం కనిపించింది. తన భూమిలో మరికొందరు వ్యక్తులు అదే భూమిలో పనులు

వీరగురుడికి విశ్వబ్రాహ్మల గురుపూజ

తెలుగునాట గురుపూజా ఉత్సవం ఘనంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు తమ నేపథ్యాన్ని అనుసరించి గురుపరంపరను స్మరించుకున్నారు. ఇక ఆధ్యాత్మికంగా తమదైన విలక్షణతకు ప్రఖ్యాతి గల విశ్వబ్రాహ్మలు.. విశ్వసృష్టిని రచించిన విశ్వకర్మ, ఆదిశంకరాచార్యుడు, జగద్గురువు వీరబ్రహ్మేంద్రస్వాములను స్మరించుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా అన్ని చోట్లా వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించి గురుపూజ నిర్వహించారు.    శేరిలింగంపల్లిలో మిషన్ విశ్వకర్మ లీడర్స్ వ్యవస్థాపకుడు ఆచార్య మాణిక్యం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామిని భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఆచార్య మాణిక్యం విశ్వబ్రహ్మ జాతి తనదైన మూలాలు తెలుసుకొని పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలని కోరారు. విశ్వబ్రాహ్మలు కేవలం ఆధ్యాత్మిక పథంతో పాటుగా వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవాలన్నా రు. విశ్వ గమనానికి, గమ్యానికి అవసరమైన అన్నీ ఎంతో జాగ్రత్తగా రచించి ఇచ్చిన విశ్వబ్రాహ్మలు ఇవాళ ఆకలితో అలమటించే పరిస్థితుల మీద పోరాడాలని, ఇందుకోసం కదిలివచ్చే నాయకత్వాన్ని సమర్థించాలని విజ్ఞప్తి చేశారు.  విశ్వబ్రాహ్మలు తలుచుకుంటే సాధ్యం కానిదేదీ

ఆ మావోయిస్టుపై రూ. 8 లక్షల రివార్డు-Xclusive Pics

మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన  ఎన్ కౌంటర్ లో పెరమిలి దళం కమాండర్  కోటె అభిలాష్ అలియాస్  చందర్, సోమా, శంకర్ అనే మావోయిస్ట్ మృతి చెందాడు. ఏటాపల్లి తాలుక హెడ్రీ పీయస్ పరిధిలోని  యెలదుడమి అటవీ ప్రాంతంలో సి60 కమాండోలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో  తెలంగాణ ములుగు జిల్లా కారపల్లి గ్రామానికి చెందిన అభిలాష్ అనే మావోయిస్టు మృతి చెందాడు. సోమ పై రూ. 8 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  సంఘటన స్థలంలో ఒక  తుపాకీ, వాకీటాకీలు, ప్రెసర్ కుక్కర్, 20 కిట్ బ్యాగులు, సామాగ్రి, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సి60 కమాండోలను జిల్లా ఎస్పీ శైలేష్ బల్కావుడే అభినందించారు.  

తాగేనీళ్లలో కాళ్లు కడుగుతున్నాడు-వీడియో

హైదరాబాద్, కూకట్ పల్లిలోని మూసాపేటకు చెందిన మంచినీళ్ల ట్యాంకర్ ఇది. ప్రజలకు మం..చి..నీ..ళ్లు సరఫరా చేయాల్సిన ఈ మున్సిపల్ ఉద్యోగి ఏం చేస్తున్నాడో ఈ వీడియోలో చూడండి. ఇలాంటివాళ్లను ఏం చేస్తే బాగుంటదో మీరే చెప్పండి. ప్రజలకు మంచినీళ్లు ఇచ్చేందుకు వాటర్ ట్యాంకర్ లో వాటర్ లోడింగ్  చేస్తుండగా.. అదే  ట్యాంకర్ లో ఏకంగా కాళ్లను కడుగుతున్నాడు. వందలాది మంది ఇదే నీటిని తాగి ప్రాణాలు నిలుపుకుంటున్న తరుణంలో.. తాను, తన కుటుంబం తాగడం లేదు కదా.. ఎవడెలా పోతే నాకేంటి.. అనే ఇలాంటి దుష్టబుద్ధులను దేవుడు కాదు.. అధికారులే శిక్షించాలి.