Skip to main content

Posts

Showing posts with the label NATIONAL

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారా? 

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మరో దఫా లాక్ డౌన్ మరింత పకడ్బందీగా విధించడం తప్ప మార్గం లేదని అనేక వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం మీద అటు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ప్రచారం సాగుతోంది. మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే తప్ప ప్రజలకు రక్షణ లేదని, కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతన్న క్రమంలో లాక్ డౌనే శరణ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు కేంద్రం కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా చర్చిస్తోందని, జూన్ 15 తరువాత గానీ, కాస్త అటుఇటుగా గానీ లాక్ డౌన్ విధించడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్రం ప్రభుత్వమే స్వయంగా వెల్లడిస్తుందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో మరో దఫా సంపూర్ణ లాక్ డౌన్ వార్తలు పుకార్లేనని తేల్చినట్లయింది.  ఆందోళనకరంగా కేసులు భారత్ లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజుకు 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడల

మతోన్మాదం పేదవారికి ప్రథమ శత్రువు

  ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. ఆధ్యాత్మికతలో మనిషి తనను తాను పరిశీలించుకుని ఆత్మ దర్శనం కొరకు సాధన చేసి పరమాత్మను గురించి పరమాత్మ సంకల్పానుసారం సాధనలో ముందుకు వెళ్తాడు. ఆత్మ జ్ఞానానికి ఏ మతంతో, కులంతో సంబంధం లేదు. ఋషులు, మునులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శిరిడి సాయిబాబా, బ్రహ్మంగారు ఈ కోవలోకి చెందినవారు. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో హిందూ మతం, హిందూ జాతి అనే పదాలను అర్థం తెలియకుండా వాడుతున్నారు. వేదాలలో భగవద్గీతలో హిందూ మతం అనే పదం లేదు. భరతజాతి అని కొన్ని చోట్ల ఉంది. మన దేశంలో కొందరు విష్ణు భక్తులు, వైష్ణవులు, కొందరు శివ భక్తులు, శైవులు కొందరు అద్వైతాన్ని మరికొందరు ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. యజ్ఞాలలో జంతుబలిని హింసను వ్యతిరేకించి కరుణారస హృదయంతో బౌద్ధం వచ్చింది. శంకరుని మాయ వాదమైనా బౌద్ధంలోని నిరంతరం మారే ప్రపంచమన్న వాస్తవంగా ఒకే విషయాన్ని చెప్తున్నది.   యోగులు అందరూ అద్భుతమైన అనుభవాలు కలవారే. ఇహలోక సుఖాలను కాదని పరమాత్మ సన్నిధానానికై ప్రయత్నించినవారు అన్ని మతాల్లో ఉన్నారు. జైనులు, సిక్కులు, ఆర్య సమాజం వారు ఇలా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. వాస్తవంగా ఒక మతం, ఒక జాతి అంట

లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?

బెంగళూరులో ఓ మద్యం షాపు ముందు మహిళల క్యూ భీకర యుద్ధం ముగియలేదు. శత్రువు ఓటమిపాలు కాలేదు. యుద్ధంలో కూరుకుపోయిన మనకు విజయం ప్రాప్తించనూలేదు. కానీ విజయోత్సాహాన్ని మించిన వేడుక జరుగుతోంది. నెలా పదిహేను రోజులుగా చుక్క మందుకు నోచుకోని సగటుజీవి గడపదాటి తెరిపిన పడేందుకు వైన్ షాపుల ముందు క్యూ కట్టాడు. ప్రేయసిని మించిన ప్రేయసి కోసం గంటలకొద్దీ వెయిట్ చేశాడు. ఎదురుచూపులు చూసిచూసి, యుగాలతో పోల్చదగిన ఎడబాటును ఎంతో ఓర్పుతో భరించిన మందుబాబు... చుక్కమ్మను అపురూపంగా అందుకున్న అరుదైన ఘట్టం భారతావని అంతటా ఆవిష్కృతమైంది. అంతేనా? మేమేం తక్కువ, ఎందులో తక్కువ అంటూ మహిళామణులు కూడా క్యూ కట్టడం విస్తుగొలిపే అంశం.  కర్నాటక, ఏపీ, గోవా, రాజస్థాన్, యూపీ.. ఇలా అనేక రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలకు ద్వారాలు తెరిచాయి. ఒకవైపు లాక్ డౌన్ ను మూడోసారి పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధమైన మరో నిర్ణయం  తీసుకోవడం విడ్డూరం కాకపోయినా తెలివిలేని, పనికిమాలిన, సిగ్గుమాలిన నిర్ణయంగా రుజువైపోయింది. లాక్ డౌన్ కఠినతరం చేస్తూ పొడిగించడం ఏంటి? లిక్కర్ అమ్మకాలకు అనుమతులివ్వడమేంటి? మూడుసార్లు ప్రధాని మీడియా ముందుకొచ

"కరోనాతో సహజీవనమే పరిష్కారం"

శత్రువును తుదముట్టించడం సాధ్యం కానప్పుడు లేదా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు రాజీ మార్గమే పరిష్కారమనేది మన ప్రాచీన రాజనీతి. అదే సూత్రం యుద్ధనీతికీ వర్తిస్తుంది. రెండువర్గాలు ఎదురుబొదురు కూర్చొని ఏదోకటి సెటిల్ చేసుకునే సందర్భంలో ఎవరో ఒకరు తగ్గడం, ఇంకొకరు మొగ్గడం సాధారణమే. అయితే యుద్ధం మొదలై శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు ఆ శత్రువును కూడా చికాకు పరచకుండా కొంత సానుకూల వాతావరణం, కొంత అనుకూలమైన ప్రదేశం కల్పించి తనకు ఇబ్బంది రాకుండా చూస్తే శత్రువు దృష్టి మళ్లించినవాళ్లమవుతాం. తన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా చూస్తే మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. అంటే ఒకరిని ఒకరు ఇబ్బందిపెట్టకుండా ఉండడం లేదా ఒకరికొకరు భయంతో కూడిన గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చూచాయగా చెప్పారు. తాము కోవిడ్-19 ని ఎదుర్కోవాలని నిశ్చయించామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చి ప్రకటించారు కేజ్రీవాల్. కరోనాను పూర్

ఆదిశంకరాచార్యుడి విజయంలో అసలు రహస్యం

(2530వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)   ద్వాపరయుగ అంతంలో ధర్మ సంరక్షణకు కురుక్షేత్రంలో జరిగిన సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం ఆహుతి అయింది. భగవాన్ శ్రీకృష్ణుడు రక్షించిన ధర్మం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. క్రమంగా దేశమంతటా జాతి విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలిపోయాయి. దేశం పతనం వైపు వేగంగా పరుగులిడుతుంది. ఇలాంటి సమయంలో దేశాన్ని సరియైన దిశవైపు నడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాలకు ఆధారం వేదాలు. వేదాల్లోని అంతరార్థ సత్యాన్ని తిరిగి ప్రకటించడం కోసం 3 కొత్త దర్శనాలు వెలుగులోకి వచ్చాయి. 1. పతంజిల యోగ దర్శనం, 2. జైమిని మీమాంస దర్శనం, 3. బాదరాయణ వేదాంత దర్శనం.  Readable: మీ ఇంటికే ఫుడ్ - డయల్...   వేదాల్లోని కర్మకాండకు వ్యతిరేకంగా భగవాన్ శ్రీకృష్ణుడే పూనుకున్నాడు. కర్మకాండపై భాగవత ధర్మం తిరుగుబాటు చేసింది. దేశంలోని సాంఘిక వ్యవస్థకు దెబ్బ  తాకకుండా ఇంద్రుడు మొదలైన దేవతల పూజలు మాన్పించాడు శ్రీకృష్ణుడు. వేదాల మీద, వైదిక వ్యవస్థ మీద సంపూర్ణ ఆదర భావం కూడా చూపించాడు. అక్కడి నుండి భాగవత ధర్మం యొక్క ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. ఆ మూడు దర్శనాలతో కొత్తపుంతలు తొక్కించింది. బాదరాయణు

ఫేస్ బుక్-జియో బంధంతో ట్విట్టర్ కు కష్టకాలమేనా?

దేశీయ టెలికాం రంగానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న జియో టెలికాం పంచన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ చేరడంతో రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్  రూ. 43, 574 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని జియో టెలికాంలోకి పంపింగ్ చేస్తోంది. జియోలో దాదాపు 10 శాతాన్ని ఫేస్ బుక్ వాటాగా పొందుతుంది. దీంతో ఫేస్ బుక్ చేతిలో ఉన్న వాట్సాప్ కూడా జియో చేపట్టబోయే ఆపరేషన్స్ కి బాసటగా నిలుస్తాయి. టెలికాం విభాగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉన్న జియో.. తాజాగా డిజిటల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. జియో మార్ట్ పేరుతో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి భారీ ఎత్తున ప్లాన్ చేసిన ధీరూబాయి అంబానీ తనయుడు... అతిత్వరలోనే ఫేస్ బుక్, వాట్సాప్ ల సహకారంతో ఆ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబోవడం ఖాయంగా మారింది. జియో మార్ట్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని మైక్రో లెవల్లోకి తీసుకెళ్లనున్నట్టు దాదాపు 6 నెలల క్రితమే ముఖేశ్ బయటపెట్టుకున్నారు. అది కాస్తా ఇప్పటికి రూపం దాల్చింది. ఫేస్ బుక్ కి భారీ సంఖ్యలో ఉన్న ఖాతాదారుల వివరాలు, అలాగే వ్యక్తిగత సమాచారం కోసం వా

డాక్టర్ల నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక

ఓపికకు కూడా హద్దుంటుంది కదా. అదే ఇప్పుడు ముందుకొస్తోంది. కరోనా విజృంభణకు బ్రేకులు వేసేందుకు ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యసిబ్బందిలో నిరసన సెగలు రగులుతున్నాయి. కరోనా పాజిటివ్ బారిన పడిన కొందరు వ్యక్తులు, హైడింగ్ లో ఉండడమే కాక.. పోలీసుల ద్వారా ఐడెంటిఫై అయ్యాక డాక్టర్లు వెళ్లినా కూడా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పోయి వైద్యుల మీద దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో, నిజామాబాద్ లో జరిగినా ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకోదగ్గ చర్యలు లేకపోవడం వైద్యసిబ్బందిలో ఆందోళనకు కారణమవుతోంది. ఆ రెండు సంఘటనల తరువాత కూడా OGH వైద్యుడిపై రక్తం వచ్చేలా కొట్టిన ఘటన జరిగింది. వైద్య సిబ్బంది మీద దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సర్కారు ప్రకటనలు కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. అటు యూపీలో కూడా డాక్టర్ అగర్వాల్ పై, అతని అనుచరులు, డ్రైవర్ పై విచక్షణ లేకుండా దాడి చేశారు. మీ ప్రాణాలు కాపాడేందుకే వచ్చామని చెబుతున్నా మూర్ఖత్వం తలకెక్కిన పాజిటివ్ రోగులు వాళ్ల వెహికల్ పై రాళ్లవర్షం కురిపించారు. చివరికి రోగులు ఉండాల్సిన హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్లు ఉండాల్సి వస్తోంది. Al

తండ్రి అంత్యక్రియలకు యోగి దూరం

Photos Credit: OBN, NP News24 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పితృవియోగం సంభవించింది. 71 ఏళ్ల వయసున్న ఆనంద్ సింగ్ బిష్ట్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చనిపోయారు. కిడ్నీ సంబంధ సమస్యలతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తండ్రి మరణవార్త తెలిసే సమయానికి అక్కడ యూపీలో సీఎం ఆదిత్యనాథ్ కోవిడ్-19 లాక్ డౌన్ అమలుకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ఉన్నారు. రేపు ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో తండ్రి అంత్యక్రియలు జరుగుతాయి. అయితే తండ్రి మరణం తనకు ఎంతో దుఃఖదాయకమని, తండ్రి లేని లోటును ఎవరూ పూడ్చలేరని, తాను తలపెట్టిన అన్ని కార్యక్రమాలకు తండ్రి ప్రోత్సాహం లభించిందని యోగి ఎంతో ఆవేదనతో చెప్పారు. అయినా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా కష్టకాలంలో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాలని, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత తాను కుటుంబ సభ్యుల్ని కలుస్తానని ఆదిత్యనాథ్  చెప్పడం విశేషం. తన తండ్రి కర్తవ్య నిర్వహణ గురించి చెప్పిన అంశాలనే తాను పాటిస్తున్నానని, తండ్రికి ఇచ్చే నివాళి తన విధ్యుక్త ధర్మ నిర్వహణలోనే ఉందని యోగి చాలా సాదాసీదాగా  చెప్పడం విశేషం. 

వదిలేస్తే వల్లకాడే - ఈ లెక్కలే సాక్ష్యం

Photo: Job Vacancy కేంద్రప్రభుత్వం గానీ, రాష్ట్రాల ప్రభుత్వాలు గానీ కరోనా పేరుతో ప్రకటిస్తున్న రోజువారీ పాజిటివ్ కేసుల లెక్కలు నమ్మకానికి బదులు అపనమ్మకాన్ని పెంచుతున్నాయి. క్వారంటైన్ చేసినా, ఐసోలేషన్లో ఉంచినా, కంటైన్మెంట్ తో కట్టడి చేసినా... కరోనా అనే ఉపద్రవం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప ఆగిన దాఖలాలు ఇప్పటికైతే కనిపించలేదు. ఉదాహరణకు ప్రభుత్వం చెప్పిన లెక్కల్నే పరిశీలిద్దాం. మన దేశంలో మిలియన్ ప్రజలకు (10 లక్షలకు) 268 మందిని పరీక్షిస్తున్నారు. ఆ మేరకు రోజుకు దాదాపు 1000 కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రోజువారీ సగటు పరీక్షలు 375. ఆంధ్రాలో రోజువారీ సగటు పరీక్షలు 539. మరణాల రేటులో కూడా జాతీయ సగటు కన్నా తెలంగాణ సగటు భేషుగ్గా ఉందంటూ, ఆంధ్రా సగటు భేషుగ్గా ఉందని మనకు మనమే సంతృప్తి పడుతున్నాం. అది మన అల్పత్వానికి పరాకాష్ట. అదే మన దేశంలో టెస్ట్ కిట్లు సరిపడినన్ని ఉండి ఇంకా ఎక్కువ పరీక్షలు నిర్వహించినట్టయితే ఎక్కువ కేసులు బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ పరీక్షలకు 311 మంది చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతుంటే మన దేశంలో (20 తేదీ నాటికి) మిలియన్ పరీక్షలకు 13 మంది చొప్పున బయట పడ

ఎవరి తలరాతలు మార్చడానికి ఈ గీతలు?

దేశద్రోహం కేసులో బెయిల్ రాకపోతే ముస్లింల పట్ల వివక్ష అవుతుందా? కౌంటర్ కరెంట్స్ అనే ఒక వెబ్ సైట్ ఉంది. అందులో వేసిన తాజా కార్టూనే ఇది. కరోనా అనే ముద్ర వేసి ముస్లింలను చంపుతున్నట్టుగా మీర్ సుహైల్ ఖాద్రి అనే వ్యక్తి ఈ కార్టూన్ వేశాడు. అతను యాక్టివిస్టో, హ్యూమినిస్టో, రెవల్యూషనిస్టో.. ఇంకే ఇజాన్ని మోస్తున్నాడో తెలీదు గానీ.. బయటి ప్రపంచం మాత్రం జర్నలిస్టుగానే భావిస్తుంది. దేశంలో శాంతి-సౌభ్రాతృత్వాలు కోరుకునే జర్నలిస్టు ఎవరైనా ఇలాంటి కార్టూన్లు వేయడానికి సాహసించడు. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. భావావేశాలు, సెంటిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే మన భారత్ లో మాత్రం రెండు వర్గాలకు సంబంధించిన విషయాన్ని చాలా బాధ్యతాయుతంగా డీల్ చేస్తారు. అలాగే చేయాలి కూడా.  కానీ కౌంటర్ కరెంట్స్ అనే వెబ్ సైట్ యాజమాన్యం మాత్రం అలాంటి జాగ్రత్తలు పాటించకుండానే జనం మీద విషం చిమ్ముతోంది. షార్జీల్ అనే వ్యక్తి మార్చి 11 నుంచి ఇప్పటివరకు వారి బంధువులను, మిత్రులను, ఆఖరుకు లాయర్ ను కూడా కలుసుకోలేకపోయాడు. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాడు. ఇది పూర్తిగా మానవ హక్కులకు విరుద్ధం. కరోనా విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లోనైనా షార

వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక ప్రపంచ నాయకుడు

అనుసరించేవాడు ఫాలోయర్. నడిపించేవాడు లీడర్. ప్రపంచాన్నంతా అమెరికా శాసిస్తుంటే.. అమెరికాను ఇండియా శాసించకపోయినా ఫాలో అయ్యేలా మాత్రం చూసుకుంటోంది. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని, ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అమెరికా... పూర్తిగా ఇండియా మీద ఆధారపడిందనేందుకు ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఇటీవల కరోనా విజృంభించి మానవాళికి ముప్పుగా పరిణమించిన క్రమంలో ధనిక దేశాలు చాలావరకు ఇండియా వైపే చూశాయి. ఇండియా మీదనే ఆశలు పెట్టుకున్నాయి. అమెరికా కూడా ఆ జాబితాలోనే ఉండడం అందరం చూసిందే. అమెరికా ఏ స్థాయిలో ఇండియా మీద పూర్తి భరోసాగా ఉందనేందుకు ఇంతకన్నా చెప్పుకోదగ్గ నిదర్శనం అవసరం లేదు.అమెరికా పాలసీకి, పరిపాలనకు అద్దం పట్టే వైట్ హౌస్.. ఇండియాను ప్రముఖంగా ఫాలో అవుతోంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.  Also Read: చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్.. ద వైట్ హౌస్ కు 2 కోట్ల 16 లక్షల పైచిలుకు ఫాలోయర్స్ ఉండగా.. అది మాత్రం కేవలం 19 మందిని మాత్రమే ఫాలో అవుతోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఐదున్నర కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉండ

నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా?

Photo Credit: deccanherald.com (symbolic image) కరోనా వైరస్ విశ్వరూపంలో కొత్తకోణం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ డాక్టర్ తాజాగా కోవిడ్-19 బారిన పడడం వైద్య నిపుణులను కూడా కలవరపెడుతోంది. 60 ఏళ్లున్న జనరల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ) ఇండోర్ లోని త్రివేణి కాలనీలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఆయన కరోనాతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. అది సాధారణ ఎలర్జీగానే భావించారు. అయినప్పటికీ ఈ నెల 3, 4 తేదీల్లో కరోనా టెస్టులు కూడా నిర్వహించారు. ఆ రెండు సార్లు కూడా నెగెటివ్ తేలడంతో డాక్టర్, ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అవే అలర్జీ లక్షణాలతో ఆయన రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్లకు వైద్యసేవలు అందించారు. అయితే ఆయనకు కోవిడ్-19 సోకిందని తెలిసేటప్పటికే చనిపోవడం కలకలం రేపుతోంది.  Also Read: అంతా బానే ఉంది కానీ..                   కరోనా కాటేస్తుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారు?                   తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు ఆయన దగ్గరకు ట్రీట్ మెంట్ కోసం ఎంతమంది వచ్చారు? వారి

అంతా బానే ఉంది కానీ..

షబ్-ఎ-బారాత్ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ ప్రసంగం మొత్తమ్మీద బాధ్యతాయుతంగానే కనిపించడం చెప్పుకోదగ్గ విశేషం. ముందుగా రాత్రి 9 గంటలకు ప్రసంగం ఉంటుందని డిక్లేర్ చేసినా ఆ సమయాన్ని రాత్రి పదిన్నరకు వాయిదా వేశారు. దీంతో జనరల్ మీడియాలో దానికి పెద్దగా స్పేస్ దక్కలేదు. కానీ దాదాపు ఒక గంట సేపు జరిగిన సోషల్ ఇంటరాక్షన్ కి ట్విిట్టర్ లో భారీ రెస్పాన్స్ కనిపించింది. ట్విట్టర్ లో ఆయనకు 11 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అందులో నేను కూడా ఒకణ్ని. వ్యూహాత్మక ప్రసంగంలో మేటిఅసదుద్దీన్ అద్భుతమైన వాక్చాతుర్యం గల వ్యక్తి. ఎలాంటి విషయాన్ని, ఎలాంటి సందర్భాన్నయినా తనకు అనుకూలంగా చక్కగా మలుచుకోవడంలో, బాధ్యతను అవతలి వ్యక్తి మీదికి తోసేయడంలో ఘనాపాటిగా పేరుంది. గురువారం రాత్రి జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో తొలి భాగం ఎంతో బాధ్యతగా మాట్లాడిన అసదుద్దీన్.. రెండో భాగానికి వచ్చేసరికి మళ్లీ పాతపాటే పాడారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ సపోర్టర్స్ అంతా కూడబలుక్కొని విషం చిమ్ముతున్నారని కడిగిపారేశారు. కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమన్న అర్థం వచ్చేలా పాత వ

డాక్టర్లపై దాడులు జరుగుతున్నది ఇందుకేనా?

ఈ దేశ సామాన్య ముస్లింలు.. రోగుల ప్రాణాలు నిలబట్టే డాక్టర్లపై దాడులు చేసేంత తెలివిలేనివారా? కరోనా విజృంభణ తమను కూడా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తుందన్న విషయం కూడా వారికి తెలియదా? ఒక సామాన్య భారతీయుడికి ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. అయితే వారికి తెలియదనుకోవడం పొరపాటే అయినా.. వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారన్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. మన దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లింల కోసం ఆలోచించే నాయకులు, సంఘాలు మాత్రం మరింత బాగా, బాధ్యతగా ఆలోచించాల్సిన తక్షణావసరం ఏర్పడుతోంది.  మన ముస్లింలు కరోనా డయాగ్నిసిస్ కోసం సహకరించకపోవడానికి మూలం దేశంలో కరోనా కనిపించడానికి ముందే ఏర్పడింది. డిసెంబర్ లో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లుకు రూపకల్పన జరిగి చట్టరూపం దాల్చడానికి ముందు నుంచే అస్సాంలో మొదలైన నిరసనలు అనేక రాష్ట్రాలకు విస్తరించాయి. ఇక సీఏఏ అమల్లోకి వచ్చాక ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో 3 వారాల పాటు ధర్నాలు జరిగాయి. దేశమంతా చలితో వణికిపోతున్న ఆ టైమ్ లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజకీయం వేడెక్కింది. సీఏఏ ను వాపస్ తీసుకునేదాకా విశ్రమించేది లేదన్న అసాధ్యమైన డిమాండ్ తో సామాన్య ప్రజల్ని రంగంలోకి దింపారు. చిన్నపిల్ల

మోడీ సోషల్ మీడియా వదిలేస్తే ఏమౌతుంది?

  ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు స్వస్తి పలుకుతారన్న ప్రకటన సోషల్ మీడియాలో కలకలమే రేపుతోంది. ఎందుకంటే కోట్లాది  మంది ఫాలోయర్లు మోడీకి ఉన్నారు. ఈ విషయంలో మన దేశంలో మోడీనే టాప్ లో ఉండడం గమనించాల్సిన అంశం. అంతమంది ఫాలోయర్స్ ను పెట్టుకొని అకౌంట్స్ ని వదిలేసేందుకు సిద్ధమవడం చాలా గొప్ప విషయమే కాక ఆలోచించాల్సిన విషయం కూడా.  మోడీ సోషల్ మీడియాను వదులుకోవడానికి కారణాలు ఇవీ -  1) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలావరకు న్యూస్ ని స్ప్రెడ్ చేయడమే తప్ప.. వాటి మీద కంట్రోల్ లేకపోవడం. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్.  2) కంట్రోల్ చేయాలనుకున్నా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం. ముఖ్యంగా అందుకోసం చిత్తశుద్ధి లేకపోవడం.  3) వన్ బిలియన్ ప్రజల మార్కును దాటిన భారత్ లో దాదాపు 50 శాతానికి పైగా ప్రజలు నిత్యం ఆన్ లైన్ లోనే ఉంటున్నారు. దీంతో నెట్ వర్క్ బిజినెస్ లో ఇండియాది పైచేయిగా మారుతోంది. దీన్ని బిజినెస్ అవకాశంగా మలుచుకుంటున్న సోషల్ మీడియా బాసులు రూమర్స్ అంశాన్ని అసలేమాత్రం పట్టిించుకోవడం లేదు. పైగా ఆ రూమర్స్ నే బిజినెస్ పాయింట్ గా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో విపరీతంగా వినిపిస్తున్నాయి. 4) భారత

గత్తర లేపుతున్న కరొనా... గడప ముందుకొచ్చింది

ప్రపంచాన్ని వణికిస్తున్న కరొనా వైరస్ ఇండియాకు రానే వచ్చింది. మొన్ననే కేరళలో ముగ్గురు యువకులకు సోకినట్లు కన్ఫామ్ అయినప్పటికీ ట్రీట్ మెంట్ తరువాత వారిని డిశ్చార్చ్ చేశారు. వారిని యథేచ్ఛగా బయట తిరగరాదని హెచ్చరించి వదిలారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు యథేచ్ఛగా వెళ్లరాదని స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా మంది విమానయానాలు రద్దు చేసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప.. కరొనా వైరస్ భయానికి ఎవరూ విమాన ప్రయాణాలు చేయడం లేదు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలం అవుతోంది. అయితే తాజాగా మరో ఇద్దరికి కరొనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. మొన్నటిదాకా కరొనా వైరస్ ను లైట్ తీసుకున్న ప్రజలు.... ఇప్పుడు చాలా భయపడుతున్నారు. తరచుగా ఇటలీ వెళ్లే ఒక ఢిల్లీవాసి, తరచుగా దుబాయికి వెళ్లే తెలంగాణ వాసి... ఈ కరొనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరు ఇండియాలో ఐదుగురికి కరొనా వైరస్ సోకినట్టు అధికారికంగా గుర్తించినట్టయింది. మరి ఈ సంఖ్య ఇక్కడితో ఆగిపోతుందా.. అలా జరక్కపోతే ఇండియా పరిస్థితి ఏంటి... చైనాలో మాదిరిగా కొన్ని గంటల్లోనే మనకు ఓ స్టేడియాన్ని హాస్పిటల్ గా మార్చే సామర్థ్యం గానీ, వె

ఇది దేశ వ్యతిరేక చర్యా?  సీఏఏ వ్యతిరేక చర్యా?

- అల్లర్లలో అసువులు బాసిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, తుపాకీతో కాల్పులు జరుపుతున్న ఆందోళనకారుడు   సీఏఏ వ్యతిరేక ఆందోళనలు శ్రుతి మించుతున్నాయి. నిరసన మాటున అసహనం హద్దు మీరుతోంది. సీఏఏ ను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ పంతం పట్టిన ఆందోళనకారులు ఢిల్లీని రణరంగంగా మార్చేశారు. మూడు రోజులుగా షాహీన్ బాగ్ లో నిరసనకారులను ప్రజాస్వామ్య పద్ధతిలో దారికి తెచ్చుకునేందుకు నేరుగా సుప్రీంకోర్టే రంగంలోకి దిగింది. నిరసన అనేది ప్రజాజీవితానికి భంగం కలిగించరాదన్న సుప్రీంకోర్టు కండిషన్ తో అది క్లియర్ అయిన సమయంలోనే.. ట్రంప్ భారత్ లో పర్యటించడం.. దాన్నే అదనుగా తీసుకున్న ఆందోళనకారులు జఫ్రాబాద్, మౌజ్ పూర్-బాబర్ పూర్ మెట్రో స్టేషన్లలో హడలెత్తించారు. సీఏఏకు, దేశానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ దుకాణాలపై రాళ్లు విసరడం, రాకపోకలకు అంతరాయం కలిగించారు. నిరసనకారులు పలు దుకాణాలను, మాల్స్ ను తగులబెట్టారు. మంటల్లో చిక్కుకొని పలు షాపులు దగ్ధమయ్యాయి. అటు ఫైర్ సిబ్బందిని కూడా సహాయ చర్యలు చేపట్టకుండా అడ్డుకోవడం ఆందోళన రేపుతోంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకురావడం పోలీసుల తరం కాలేకపోయింది.  గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జీ, గాల్ల