Skip to main content

Posts

Showing posts with the label INTERNATIONAL

కరోనా ఫ్యామిలీ చాలా పెద్దది.. ఒక్కొక్కటీ మహా హంతకి

       (కరోనా ధాటికి వల్లకాడవుతున్న ఇటలీ) చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ కరోనా వైరస్‌. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో ఈ కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్. కరోనావైరస్‌ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా అనే పదం.. క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్ లు ఉన్నాయి. వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల

తెరమీదికొస్తున్న పాత సంప్రదాయాలు ఇవే

కరోనా వైరస్ అంటుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల క్రమంగా కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి.మరణ భయం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తానికి అనుభవంలోకి వస్తున్న భయంకరమైన దృశ్యం కనిపిస్తోంది. అయితే కరోనా వైరస్ మృత్యు కోరలు చాస్తున్నా.. దానికన్నా కూడా నరనరాల్లో భయంకరంగా వ్యాపించి ఉన్న అతివిశ్వాసపు ఏహ్య భావాల జాడ్యం మాత్రం కొందరిలో ఇప్పటికీ బుసలు కొడుతుండడమే విచిత్రం.  ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్.. ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందనే ఆసక్తి ప్రపంచ ప్రజల్లో, ప్రపంచ మీడియాలో వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కోసం జనాన్ని సిద్ధం చేయడం, ఆ ప్రతిపాదనకు విపరీతమైన ఆదరణ లభించడం చూస్తుంటే భారత ప్రజలు ఎంత స్వేచ్ఛను కోరుకుంటారో.. అనుకోని ఆపదలు సంభవించినప్పుడు అంతా సహకరించి ఒక్క తాటిపైకి వస్తారని కూడా రుజువవుతోంది.  చద్దిమూటలవుతున్న పెద్దల మాటలు పెద్దల మాట చద్దిమూట అన్న సూక్తిని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొని కొట్టిపారేశాం. మనలో చాలామంది నిన్నటివరకు నవ్వుకున్నారు కూడా. కానీ ఇప్పుడదే సూక్తి కరోనా మహ

మత స్వేచ్ఛ ఎలా ఉంటదో చెప్పవా ట్రంప్.. ప్లీజ్

  భారత్ లో మత స్వేచ్ఛపై ట్రంప్ మాట్లాడతాడట. మత స్వేచ్ఛపై ఏం మాట్లాడతావు? భారత్ లో మత స్వేచ్ఛ ఉందంటావా? లేదంటావా? అమెరికా కన్నా ఎక్కువుందంటావా ?  లేక అసల్లేదంటావా ? ఏ దేశంలో అమల్లో ఉన్న మత స్వేచ్ఛను ప్రామాణికంగా తీసుకొని భారత్ లో మతస్వేచ్ఛను కొలుస్తావు బాస్?     పేరులో ఇస్లామిక్ నేచర్ ఉన్నా, వేషధారణలో ఇస్లామిక్ కల్చర్ కనిపించినా భూతద్దం పెట్టి ఒళ్లంతా సెర్చ్  చేసే అమెరికాధీశుడు భారత్ లో మత స్వేచ్ఛ మీద మాట్లాడతాడట. మెక్సికో నుంచి వచ్చే శరణార్థులను అడ్డగించేందుకు నువ్వు ముళ్ల కంచెలు నాటుకుంటావు. అయినా అక్రమ వలసలు వరదలా పారుతుంటే 24 గంటల సెక్యూరిటీని అమలు చేసుకుంటావు. యూరోప్, మధ్య ప్రాచ్య దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా విపరీతమైన ఆంక్షలు పెడతావు.      ఎయిర్ పోర్టుల్లో తలపాగా చుట్టుకున్న సిక్కును చూసినా ముస్లిం పౌరుడేమోనని జడుసుకుంటావు. క్లీన్ షేవ్ తో ఉన్న మా స్మార్ట్ హీరో భారతీయుడు కమల్ హాసన్ ని చూసినా పేరులో హసన్ ధ్వనిస్తుంది కాబట్టి బట్టలు విప్పించి మరీ ముస్లింను కాదని చెప్పేదాకా వదలిపెట్టకుండా.. ఇండియాలో హిందువును అని చెప్పని కమల్ చేత నువ్వు మాత్రం... నేను హిందువునే మొర్రో అని గొ