Skip to main content

Posts

Showing posts with the label DEVOTIONAL

పాతాళగంగలో ఉబ్బలి బసవన్న - చదివి తీరాల్సిన కథ

పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో మహా విశ్వకర్మ వంశోద్భవుడు, మహా శివభక్తుడైన బసవాచార్యుడను ఒక శిల్పాచార్యుడు వుండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పాచార్యులు సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.  తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్త వ్రతాన్ని (ఉదయంనుండి భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఏమి లాభం? వెంటనే విచారంలో మునిగి పోయాడు. ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి? అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి. నిద్రకూడా పట్టలేదు. అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పాచార్యుడు. వెంటనే ఒక కల. కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో యిలా అన్నాడు. భక్తా! నీ సంకల్పం మహత్తర మైనది. నీ శ్రమ ఫలించింది. ఇవిగ

కైలాసనాథుడి చెంతకు ఇకపై రోడ్డు మీదుగా..

హిమాలయాల్లోని మానసరోవరానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన ముందడుగు వేసింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ వద్ద లింక్ రోడ్డు వేయడంతో కైలాస మానసరోవరానికి మరింత సులభంగా వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. ఈ చర్యతో టూరిస్టులకు ఢిల్లీ నుంచి మానసరోవారం అత్యంత సమీపానికి నేరుగా బస్సులోనే వెళ్లే అవకాశం ఏర్పడింది. ప్రతి సంవత్సరం మానసరోవరానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుమతిస్తారు. ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ లింక్ రోడ్డు ద్వారా టిబెట్ భూభాగంలో ఉన్న మానసరోవరాన్ని నేరుగా సందర్శించవచ్చు. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో హిందువులు పోటీపడుతుంటారు.  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పూర్తయిన ఈ రోడ్డు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. లిపులేఖ్ పాస్ నుంచి మానసరోవరం 90 కి.మీ. దూరంలో ఉంటుంది. రోడ్డుమార్గం ప్రారంభంలో రాజ్ నాథ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానసరోవరానికి మొదటి జట్టు భక్తుల యాత్రకు రాజ్ నా

చిత్రమాలిక-వాడవాడలా వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆరాధనోత్సవాలు

రాజయోగి, అద్వైతబ్రహ్మ శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి 327వ ఆరాధనోత్సవాలు తెలుగు నేలపై శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. స్వామివారు జీవసమాధి అయిన రోజునే ఆరాధనా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగునాట వస్తున్న సంప్రదాయం. బ్రహ్మంగారు తెలుగు, కన్నడ మూలాలకు చెందిన తత్త్వవేత్త కావడం వల్ల దక్షిణభారత దేశంలో ఆయన బోధనలకు  ప్రాశస్త్యం లభించింది. తత్వవేత్తగానే గాక యోగిపుంగవుడిగా, సామాజిక న్యాయమూర్తిగా, మహిమలు చూపిన మహిమాన్వితుడిగా, కోరిన కోర్కెలు తీర్చిన దేవదేవుడిగా, కాలజ్ఞాన ప్రదాతగా, ప్రళయానంతర కాలమున వెలుగులు ప్రసరింపజేయడానికి వచ్చే పరంజ్యోతిగా.. ఇలా అనేక విధాలుగా బ్రహ్మంగారు తెలుగువారి ఇంటిల్లిపాదికీ ఇష్టదైవం.  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలో స్వామివారి ఆరాధనోత్సవాలను సామాజికదూరం పాటిస్తూ తెలుగువారు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని "శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి" రాష్ట్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు "బ్రహ్మశ్రీ వేములవాడ మదన్ మోహన్" స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి గురుపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువ

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

వార్తల్లోకెక్కిన వెయ్యేళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం

  భారత్ ప్రాచీన దేశం. పేరుకు తగినట్టే పురాతన విగ్రహాలకు, ప్రాచీన సంస్కృతికి, వెల కట్టలేని సాంస్కృతిక వైభవానికి మన దేశం పెట్టింది పేరు. పైన ఫొటోలో చూస్తున్న విగ్రహం విష్ణుమూర్తిది. అనంత పద్మనాభస్వామి అనగానే కేరళలో ఉన్నాడనే అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ అలాంటి అనంత శయనుడి విగ్రహాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. దాదాపు అలాంటి భంగిమలోనే మధ్యప్రదేశ్ లోని బాంధవగఢ్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. విగ్రహానికి అంతా నాచుపట్టి, నిరాదరణకు గురైన స్థితిలో ఉంది. కానీ విగ్రహం ఒరిజినాలిటీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండడంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇది వెయ్యేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. పార్కుకు వచ్చే సందర్శకులు ఈ విగ్రహాన్ని చూసి, ఆ పుణ్యస్థలానికి పునర్వైభవం తేవాలని కోరుతున్నారు.